Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Nandyal News: నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదని అక్కసుతో ఓ ఇంటర్ విద్యార్థి బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
Inter Student Pours Petrol On Girl And Sets Her On Fire In Nandyal: ఏపీలో ఘోరం జరిగింది. తనను ప్రేమించలేదనే కారణంతో బాలికపై ఓ ఇంటర్ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పింటించాడు. ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లాలో (Nandyal District) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక, కలగొట్లకు చెందిన బాలుడు ఇంటర్ చదువుతున్నారు. తనను ప్రేమించాలని బాలుడు కొంతకాలంగా బాలికను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపారు. 6 నెలల క్రితం బాలుడు అక్కడికి వచ్చాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక స్నేహితులు ఎవరు వచ్చినా ఇంటికి రానివ్వొద్దని అమ్మమ్మకు సూచించారు.
పెట్రోల్ పోసి నిప్పంటించాడు
ఆదివారం అర్ధరాత్రి దాటాక బాలిక ఇంటికి వెళ్లిన బాలుడు ఆమె గదిలోకి వెళ్లి బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె కేకలు పెడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం బాలుడికి కూడా మంటలు అంటుకోవడంతో పారిపోయేందుకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన నిందితున్ని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి