Top Headlines Today: తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపేవేంటీ? ఏపీ రాజకీయాల్లో ఫామ్-7 కలకలం- మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
ఏయే అంశాల ప్రభావం ఎంత..?
తెలంగాణ ఎన్నికలు (Telangana Election 2023) ఈసారి చాలా ఆసక్తికరంగా మారాయి. అధికార BRS పార్టీ హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టిగానే కసరత్తు చేస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఈ రికార్డుకి బ్రేక్‌లు వేయాలని చూస్తోంది. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే ABP Cvoter Opinion Poll ఆసక్తికర విషయాలు వెల్లడించింది. BRS పార్టీకి గరిష్ఠంగా 61 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది. అటు కాంగ్రెస్ 43-55 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా చూస్తే హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయితే...ఈ పోల్‌లో భాగంగా చాలా కోణాల్లో సర్వే చేపట్టింది ABP Cvoter. ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలేంటో వివరించింది. ఏయే అంశం ఎంత ప్రభావం చూపించనుందో లెక్కలతో సహా వెల్లడించింది. ఇందుకోసం తెలంగాణలో 9,631 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఏపీలో ఫామ్-7 రగడ
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది. గ్రామాల్లో ఓట్ల తొలగింపుపై తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివిధ జిల్లాల్లో ఓట్ల తొలగింపునకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంది. తాజాగా గుంటూరు జిల్లాలో ఫామ్-7 అడ్డుపెట్టుకుని, ఓట్ల వందల ఓట్లను జాబితా నుంచి తీసివేయించేందుకు వైసీపీ నేతలు (YSRCP Leaders) దరఖాస్తు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో ఫామ్-7 ద్వారా ఓట్లు తొలగించాలని 858 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 663 దరఖాస్తులు అధికార వైసీపీ నేతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కాంగ్రెస్ పాపాలు
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లోనే ఉందని, తెలంగాణ వచ్చిన వెంటనే ఆ ఉద్యోగులకు 3 శాతం ఇక్రిమెంట్ ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని, ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీ, ఆ పార్టీ తరఫు అభ్యర్థికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పురందేశ్వరిపై పెద్దిరెడ్డి సెటైర్లు
బీజేపీ- ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తూర్పు నియోజకవర్గం మూడో డివిజన్‌లోని కనకదుర్గా నగర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్‌లను మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గక ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొలిక్కి
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు అంశం ఓ కొలిక్కి వచ్చింది. జనసేనకు 9 స్థానాలు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కూకట్పల్లి, వైరా, నాగర్ కర్నూలులో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇంకా 3 స్థానాలపై స్పష్టత రాలేదు. తొలుత జనసేన 11 చోట్ల పోటీ చేయాలని భావించినా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జనసేనాని పవన్ కల్యాణ్ చర్చల అనంతరం 9 స్థానాలకు ఆ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పని చేయాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పదోతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో నవంబర్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ గంటపాటు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, జనరల్ గురుకులాల్లోనూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు రోజూ ఒక సబ్జెక్టును చదివిస్తారు. రోజూ ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడే హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు సమాధానాలను సాధన చేయిస్తారు. ఇందుకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను విద్యాశాఖ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
భారత జట్టు జైత్రయాత్ర
వన్డే ప్రపంచ కప్ 2023లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో భారత్ మొదటి స్థానం పదిలం అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మ్యాచ్ జరుగుతుందా ? లేదా?
ప్రపంచకప్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగనున్న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరు జట్లకు ఇది నామమాత్రపు మ్యాచ్ ఏ అయినా... అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా రేపు బంగ్లాదేశ్ శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీ చేరుకున్నాయి. అయితే కాలుష్య తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను ర్దు చేసుకోవాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రైనింగ్ సెషన్ జరగాల్సి ఉంది. కానీ వాయు కాలుష్యం అధికంగా ఉండడంతో తమ జట్టు ఎలాంటి ఛాన్స్ తీసుకోదల్చుకోలేదని బంగ్లా టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ వెల్లడించారు. చాలా మంది బంగ్లా క్రికెటర్లు ఢిల్లీలో బయటకు వెళ్లారని, ఇప్పుడు వారికి దగ్గు వస్తోందని. ఆ కారణంగానే వారు మరింత అస్వస్థతకు గురవ్వకుండా ప్రాక్టీస్‌ను రద్దు చేశామని బంగ్లా టీమ్ డైరెక్టల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టేస్టీ తేజా ఔట్
‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఊహించినట్లే టేస్టీ తేజా (Tasty Teja) బయటకు వెళ్లిపోయాడు. ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే తేజా.. తాను బయటకు వెళ్లిపోతానని ముందుగానే అంచనా వేయడంతో పెద్దగా షాక్ కాలేదు. చివరిలో తనతోపాటు నిలుచున్న రతికాకు (Rathika Rose) కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. వెళ్లేది నువ్వు కాదు.. నేను అన్నాడు. చివరికి అదే జరిగింది. రతిక సేఫ్ అయ్యింది.. తేజా హౌస్ నుంచి ఔట్ అయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఓటీటీలోకి 'లియో'
కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన 'లియో'Leo) మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతోంది. ప్రస్తుతం థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటున్న ఈ మూవీని అనుకున్న డేట్ కి కాకుండా ముందుగానే రిలీజ్ చేయబోతుండటం గమనార్హంగా మారింది. అందుకు కారణం లియో మూవీ ఆన్ లైన్ లో లీక్ అవ్వడమే అని చెబుతున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ - దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లియో'(Leo) దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు నుంచి మూవీకి మిక్స్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి