అన్వేషించండి

Tasty Teja: తేజా ఔట్.. రతిక, శోభా సేఫ్ - కన్నీళ్లు పెట్టుకున్న హౌస్‌మేట్స్, నాగ్ ఎమోషనల్

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి టేస్టీ తేజా బయటకు వెళ్లాడు. రతిక, శోభా శెట్టి సేఫ్ అయ్యారు.

‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఊహించినట్లే టేస్టీ తేజా (Tasty Teja) బయటకు వెళ్లిపోయాడు. ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే తేజా.. తాను బయటకు వెళ్లిపోతానని ముందుగానే అంచనా వేయడంతో పెద్దగా షాక్ కాలేదు. చివరిలో తనతోపాటు నిలుచున్న రతికాకు (Rathika Rose) కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. వెళ్లేది నువ్వు కాదు.. నేను అన్నాడు. చివరికి అదే జరిగింది. రతిక సేఫ్ అయ్యింది.. తేజా హౌస్ నుంచి ఔట్ అయ్యాడు. 

శోభా కన్నీళ్లు.. ఫుడ్ వీడియో చేసుకుందాంలే అంటూ తేజా ఓదార్పు (Bigg Boss 7 Telugu)

తేజా ఇంటి నుంచి వెళ్తుంటే శివాజీతో సహా హౌస్‌మేట్స్ అంతా కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. వారందరినీ చూసి తేజా కూడా ఏడ్చేశాడు. నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నన్ను క్షమించండి అని తేజా వెళ్తు వెళ్తూ అందరికీ చెప్పాడు. ఆ తర్వాత నాగార్జునతో మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తానో లేదో ఊహించలేదు. కానీ అవకాశం వచ్చింది. హౌస్‌లోకి అమ్మను తీసుకొద్దామని అనుకున్నా. నేను వెళ్తున్నా. అదొక్కటే లోటు. దేన్నైనా పాజిటివ్‌గా తీసుకుంటా’’ అని తెలిపాడు. తేజా జర్నీ చూసిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. ‘‘బ్యూటిఫుల్ జర్నీ తేజా. ఎంత నవ్వించావ్ తేజా అందరినీ, నేను మిస్ అవుతా తేజా, నేను ఎంత నవ్వుకొనేవాడిని నీతో మాట్లాడుతూ. నీతో జోకులు వేస్తూ’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. శోభాశెట్టి (Shobha Shetty) చివర్లో తేజాతో మాట్లాడుతూ.. ‘‘నువ్వు లేకుండా ఎలా ఉండాలో అని భయం వేస్తోంది. మిగతా రోజులు నువ్వు నాతో ఉండవని ఊహించుకుంటేనే భయంగా ఉంది’’ అని కన్నీళ్లు పెట్టుకుంది.  

హౌస్‌మేట్స్‌కు మార్కులు వేసిన తేజా.. శోభాకు 10కి 20

హౌస్‌మేట్స్‌కు మార్కులు వెయ్యాలని తేజాను అడిగారు నాగ్. ఈ సందర్భంగా శోభా శెట్టికి 10కి 20 మార్కులు వేశాడు. ఇన్ని వారాలు నన్ను భరించినందుకు అన్ని మార్కులు ఇచ్చానని తెలిపాడు. గౌతమ్‌కు 8 మార్కులు, అర్జున్‌కు 8 మార్కులు ఇస్తానని తెలిపాడు. అయితే, అర్జున్ కూడా తేజా గురించి ఎమోషనల్ అవ్వడం గమనార్హం. ఇంట్లో బాగా కనెక్ట్ అయ్యింది తేజాయేనని అన్నాడు. ఆ తర్వాత యావర్‌కు 10 మార్కులు వేశాడు. కానీ, అతడు ఆ పది తీసుకోడని, తగ్గించుకుంటాడని తేజా అన్నాడు. భోలే వంటలకు 7 మార్కులు వేయొచ్చని అన్నాడు, అశ్వినీకి 8 మార్కులు, ప్రశాంత్‌కు 9 మార్కులు ఇచ్చాడు. ప్రశాంత్ ఓటమిని తీసుకోడు అందుకే ఒక మార్క్ తగ్గించానని అన్నాడు. ప్రియాంక బిగ్ బాస్ హౌస్‌లో వంటలక్క లాంటిదని తేజా అన్నాడు. హౌస్‌లో అమ్మాయిలను తాను ఏకవచనంతో పిలిచేవాడినని.. కానీ, ఆమెను మాత్రమే అలా పిలవలేదని అన్నాడు. ఆమె మీద ఉన్న రెస్పెక్ట్ అలాంటిదని తేజా తెలిపాడు. తన కెప్టెన్సీ కోసం ఆడినందుకు పదికి 10 మార్కులు ఇస్తానని తేజా తెలిపాడు. అమర్ దీప్‌ ఆటలో ఇప్పుడు పుంజుకున్నాడని, అతడికి 9 మార్కులు ఇస్తానని తేజా చెప్పాడు, రతికాకు 5 మార్కులు, శివాజీ తనని నామినేషన్ చేశాడు కాబట్టి 8 మార్కులు వేస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘తేజా నువ్వు చాలా తెలివైనవాడివి. నీ అంత తెలివైనవాడు ఈ హౌస్‌లో లేడు. నేను చూసినవాళ్లలో నువ్వు చాలా అరుదైనవాడివి’’ అని ప్రశంసించాడు.

Also Read: అందుకే రాహుల్‌ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget