అన్వేషించండి

Top Headlines Today:నేడు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన- కేసీఆర్‌కు ముందున్న సవాళ్లు ఏంటీ? మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today:

సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంపై సస్పెన్స్ వీడింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించారు. దాంతో రెండు రోజుల తరువాత తెలంగాణ సీంపై సస్పెన్స్ వీడింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని, ఆందోళన చెందవద్దని సూచించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కేసీఆర్‌కు సవాళ్లు

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే ఐదేళ్లలో వ్యవహరించాల్సిన పాత్రలపై ఓ స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ( congress Party ) అధికారం దక్కింది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయింది. బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీనే కానీ ప్రధాన ప్రతిపక్షం ( Opposition ) కాదు. అయితే ఆ పార్టీ ఎన్నో ప్రతికూల నిర్ణయాల ప్రభావాలకు లోనైనా ఎనిమిది సీట్లను గెల్చుకుంది. అంతే కాదు ఉత్తర తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలకు ధీటైన ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నేడూ వర్షాలు

దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను (మిషాంగ్) గత 6 గంటల్లో 11 కి.మీ వేగంతో ఉత్తరం వైపుగా కదిలి గరిష్ఠంగా 90-100 kmph గాలి వేగంతో తీవ్రమైన తుఫానుగా నిన్న 5 డిసెంబర్ 2023, మధ్యాహ్నం 12.30 నుండి 14.30 గంటల సమయంలో బాపట్లకు దక్షిణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ఇది ఈరోజు 14.30 గంటల సమయానికి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ వద్ద 15.8°N అక్షాంశం, 80.3°E రేఖాంశం సమీపంలో బాపట్లకు నైరుతి దిశలో 15 కి.మీ. ఒంగోలుకు ఈశాన్యంగా 40 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 2 గంటల్లో ఈ ఇది దాదాపు ఉత్తరం వైపు కదులుతూ తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రేవంత్‌పై హర్షం

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వర్షంలో రోజా రీల్స్

మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావంతో ఓ పక్క నియోజకవర్గం ప్రజలు ముప్పుతిప్పలు పడుతుంటే ఆ మంత్రి మాత్రం జోరు వానలో రీల్స్ చేసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే మంత్రి రోజా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సింది పోయి గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రతి ఇల్లు తిరుగుతూ అందర్నీ పలకరించారు. అదే సమయంలో జోరు వానలో రోజా చిందులు వేసిన వీడియోలు వెలుగు చూసాయి. ప్రస్తుతం ఈ వీడియోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఫేక్‌ ప్రచారం 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై ప్రజా వ్యతిరేకత పెంచడానికి ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోలను విస్తృతంగా ఉపయోగించుకున్నాయి.   ఫేక్ న్యూస్ ఆర్టికల్స్ నుండి మానిప్యులేటెడ్ వీడియోల వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వైరల్ అయ్యాయి.  రాజకీయ పార్టీలు ,  వ్యక్తులను వారి ప్రత్యర్థి గ్రూపుల మద్దతుదారులు లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని  వైరల్ చేసేందుకు ప్రయత్నించారు. అన్నిరాజకీయ పార్టీలు భారీగా సోషల్ మీడియా సైన్యాలను నియమించుకున్నాయి. వారితో పాటు ప్రత్యేకంగా ఖర్చు పెట్టి బాట్స్ ను పెట్టుకుని మరీ తప్పుడు ప్రచారాలు చేశారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వర్మ యానిమల్ రివ్యూ

ప్రస్తుతం ఎక్కడ చూసినా మూవీ లవర్స్ అంతా ‘యానిమల్’ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలోనే కాదు.. మరెన్నో అంశాల్లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. అసలు అంత పెద్ద సినిమా ఎవరైనా చూస్తారా అని విమర్శించిన క్రిటిక్స్.. ‘యానిమల్’కు వస్తున్న రెస్పాన్స్ చూసి షాక్‌తో పాటు సైలెంట్ కూడా అయ్యారు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ‘యానిమల్’ చూసి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన స్టైల్‌లో రివ్యూను అందించాడు. ఇక ఈ రివ్యూకు సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. 

ప్రతి గ్యాంగ్​లో ఎవరో ఒకరు.. ఏదొక టైమ్​లో గోవాకు వెళ్దాము మావా అంటారు. మీ గ్యాంగ్​లో కూడా ఇలా ఎవరైనా టూర్​కి వెళ్దామంటే.. గోవా పోదాం అనే వారు కచ్చితంగా ఉండే ఉంటారు. బ్యాచిలర్స్​లో ముఖ్యంగా అబ్బాయిల్లో గోవా ఫీవర్ కచ్చితంగా ఉంటుంది. కానీ ఎన్నో కారణాల వల్ల ఆ ప్లాన్స్ కాస్త బిస్కెట్ అవుతూ ఉంటాయి. కానీ కరెక్ట్​గా ప్లాన్​ చేసుకుంటే గోవా వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు. అమ్మాయిలు కూడా తమ గ్యాంగ్​తో కలిసి వెళ్లగలిగే ప్లేస్​ అది. అయితే ఈ టూరిస్ట్ ప్లేస్​కి ఏ సమయంలో వెళ్తే మంచిది.. ఎక్కడ స్టే చేయాలి? ఎక్కడ షాపింగ్ చేయాలి? టూరిస్ట్​ స్పాట్స్​కి ఏ సమయంలో ఎలా వెళ్లాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బీర్​ తాగితే బొజ్జ కాదు, బుద్ది పెరుగుతుందట

కాలేజ్​ పోరగాళ్ల నుంచి.. పెద్దవారి వరకు.. ఎక్కువగా తాగేది బీర్. ముఖ్యంగా టీనేజ్​లో ఉండేవారు బీర్​ తాగేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అది తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది కాబట్టి. బాధ వచ్చినా.. సంతోషమొచ్చినా.. భయం వేసినా.. బ్రేకప్​ అయినా.. ఇలా ఒకటా.. రెండా ఏ కారణంతోనైనా బీర్​ తాగేవారు చాలామందే ఉన్నారు. బీర్​ తాగడం కోసం కారణాలు వెతుక్కునే వారు కూడా చాలామందే ఉన్నారు. కానీ కొందరు బీర్ తాగడం వల్ల బొజ్జ వస్తుందనుకుంటారు. ఇది కొంత వరకు నిజమే అయినా.. తాజాగా జరిపిన ఓ అధ్యయనం మాత్రం బీర్​ తాగేవారికి.. బీర్​ తాగకుండానే కిక్​ ఎక్కించే విషయాన్ని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

కెప్టెన్సీ నుంచి కోహ్లిని నేను తప్పించలేదు, మరోసారి వివరణ ఇచ్చిన దాదా

2014 నుంచి ఏడేళ్లపాటు టీమిండియా(Team India) టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ(Virat Kohli)  2021లో అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం అందరికీ తెలిసినదే.  అత్యంత విజయంతమైన భారత కెప్టెన్‌గా పేరు ఉన్న రన్‌ మెషీన్‌ ఆకస్మాత్తుగా పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న  తర్వాత టెస్ట్  కెప్టెన్సీ నుం​చి పూర్తిగా వైదొలిగాడు. అంతే  కాదు తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తనను తప్పించడంలో నాటి బీసీసీఐ(BCCI) బాస్‌ గంగూలీ(Sourav Ganguly)  కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్‌ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన కోహ్లీ.. టెస్ట్ కెప్టెన్సీని కూడా వదిలేసాడు.  తరువాత కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కారని సమాచారం.  ఐపీఎల్‌ 2023 (IPL)సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్‌ శర్మ(Rohit Sharma)  టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
District App: ‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
RS Praveen: అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Embed widget