అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం- కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన

Revanth Reddy to be the next CM of Telangana: టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది.

Revanth Reddy Telangana CM: తెలంగాణ సీఎంపై సస్పెన్స్ వీడింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించారు. దాంతో రెండు రోజుల తరువాత తెలంగాణ సీంపై సస్పెన్స్ వీడింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని, ఆందోళన చెందవద్దని సూచించారు.

నేటి సాయంత్రం కాంగ్రెస్ పెద్దలు కొందరు హైదరాబాద్ కు వచ్చి సీఎల్పీ నేతని ప్రకటించి సీఎంపై స్పష్టత ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఎల్లా హోటల్‌ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. నేటి రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారని సమాచారం. సీఎం రేసులో తామూ ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సైతం పట్టు వీడలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసింది. దాంతో రెండు రోజుల తరువాత తెలంగాణ కొత్త సీఎంపై సస్పెన్స్ వీడింది. 

తెలంగాణలో కాంగ్రెస్ ను కచ్చితంగా గెలిపిస్తానని హైకమాండ్ కు మాటిచ్చారు, అలాగే పార్టీని గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించారు రేవంత్ రెడ్డి. పార్టీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలున్నప్పటికీ, తన వాక్ చాతుర్యం, ప్రశ్నించేతత్వంతో పాటు సీనియర్లను కలుపుకునిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి మరోసారి ఊపిరిపోశారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి నేతలను వెనక్కినెట్టి మరీ అధిష్టానంతో మా సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించేలా చేసుకున్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు కైవసం చేసుకుంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితం కాగా, ఎంఐఎం 7 సీట్లు, కాస్త పుంజుకున్న బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. సీపీఐ పోటీ చేసిన ఒక్క స్థానంలో విజయం సాధించింది. డిసెంబర్ 3న తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించి ఎట్టకేలకు తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 

అన్ని ప్రధాన పార్టీలతో రేవంత్ కు అనుబంధం
విద్యార్థి నేతగా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న రేవంత్ కు తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలతో అనుబంధం ఉంది. విద్యార్థిగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2001-2002 మధ్య కాలంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. 2004లో కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2007లోను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి చురుకుదనం, వాగ్దాటి చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్... కాంగ్రెస్ నుంచి అప్పటికే ఐదుసార్లు గెలిచిన గుర్నాథరెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. ఆపై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017 అక్టోబర్ 31న కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. ఆరేళ్లకు సీఎం అయ్యారు.

 Also Read: Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు

Also Read:  తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget