అన్వేషించండి

Improve Memory with Beer : బీర్​ తాగితే బొజ్జ కాదు, బుద్ది పెరుగుతుందట - కానీ, చిన్నట్విస్ట్!

Beer Improve Memory : బీర్​ తాగితే చాలా మంది బొజ్జ వస్తుంది అంటారు. కానీ బీర్​ తాగడం వల్ల బుద్ధి పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

Drinking Beer Might Improve Your Memory : కాలేజ్​ పోరగాళ్ల నుంచి.. పెద్దవారి వరకు.. ఎక్కువగా తాగేది బీర్. ముఖ్యంగా టీనేజ్​లో ఉండేవారు బీర్​ తాగేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అది తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది కాబట్టి. బాధ వచ్చినా.. సంతోషమొచ్చినా.. భయం వేసినా.. బ్రేకప్​ అయినా.. ఇలా ఒకటా.. రెండా ఏ కారణంతోనైనా బీర్​ తాగేవారు చాలామందే ఉన్నారు. బీర్​ తాగడం కోసం కారణాలు వెతుక్కునే వారు కూడా చాలామందే ఉన్నారు. కానీ కొందరు బీర్ తాగడం వల్ల బొజ్జ వస్తుందనుకుంటారు. ఇది కొంత వరకు నిజమే అయినా.. తాజాగా జరిపిన ఓ అధ్యయనం మాత్రం బీర్​ తాగేవారికి.. బీర్​ తాగకుండానే కిక్​ ఎక్కించే విషయాన్ని తెలిపింది.

విద్యార్థులపై అధ్యయనం..

వాస్తవానికి బీర్ మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో (University of Mexico Study).. 1652 మంది విద్యార్థులపై ఓ అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా విద్యార్థుకున్న మద్యపాన అలవాట్ల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. వారి ఆలోచనా తీరు, స్వల్పకాలిక జ్ఞాపకశక్తిపై కొన్ని టెస్ట్​లు నిర్వహించారు. అయితే దీనిలో ఇంట్రెస్టింగ్ విషయాలు (Intresting Facts) బయటపడ్డాయి.

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే

అస్సలు ఆల్కహాల్ తీసుకోనివారు, వైన్ తాగేవారు, స్పిరిట్ తాగేవారి కంటే.. బీర్ తాగేవారిలో శబ్ధ, పని, జ్ఞాపకశక్తిలో మరింత మెరుగ్గా, ఖచ్చితంగా, వేగవంతంగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. వైన్ తాగేవారు అత్యుత్తమ పని తీరు కనబరుస్తారు అనుకుంటే.. ఊహాలకు అందని విధంగా బీర్ తాగేవారు రెస్పాండ్ అయ్యారని తెలిపారు. 

అతిగా తాగారనుకో..

అబ్బా.. ఇదేదో బాగుందే.. అరే మావా నువ్వెళ్లి స్టఫ్ తీసుకురా.. నేను బీర్ తెస్తాను అని.. పీతల్లా తాగేస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే బీర్​ను లిమిట్​లో తాగినవారు మాత్రమే మెరుగైన జ్ఞాపకశక్తిని కనబరిచినట్లు ఈ అధ్యనం తెలిపింది. పురుషులు లేదా స్త్రీలు తమ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవాలి.. లేదా ప్రయోజనం చేకూర్చుకోవాలనుకుంటే.. మొత్తం వారానికి 100 గ్రాముల ఆల్కహాల్ మాత్రమే తీసుకోవాలంటున్నారు. మితమైన మద్యపానం మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందిస్తుందని పరిశోధకులు తెలిపారు. 

డాక్టర్​లు ఇచ్చే మెడిసన్ ఎక్కువగా వాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. బీర్​లు ఎక్కువ తాగితే అలాంటి, అంతకంటే ఎక్కువ దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఏదైనా లిమిట్​లో తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి ఆరోగ్యప్రయోజనాల కోసం బీర్​ తాగాలనుకుంటే లిమిటెడ్​గా తీసుకోవాలని అంటున్నారు. ఉంది కదా అని ఎక్కువ తాగేస్తే మాత్రం శారీరక, మానసిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget