Top 10 Headlines Today: పుంగనూరులో ఏం జరుగుతోంది? ఆసరా కింద ఇన్ని రకాల పింఛన్లు ఇస్తున్నారా?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
పుంగనూరులోనే ఎందుకిలా?
పుంగనూరు నియోజకవర్గం. ఈ పేరు ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే అది అభివృద్ధి పనుల విషయంలో టామోటా పంటలను బాగా పండించిన విషయంలోనే కాదు.. రాజకీయ దాడుల విషయంలో. వైఎస్ఆర్‌సీపీ నేతలు కాకుండా మరే పార్టీ నేత అయినా సరే అక్కడ భయంతో బతకాల్సిందేనన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన నేతల్ని మాత్రమే కాదు ఇటీవల కొత్తగా పార్టీ పెట్టుకున్న రామచంద్ర యాదవ్ అనే నేతనూ పుంగనూరులో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు వదల్దేదు. మాట్లాడితే ఇళ్లపై దాడులు చేస్తారు. ఆస్తులు ధ్వంసం చేస్తారు. ఊళ్లలోకి అడుగులు పెట్టనీయరు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన విషయంలోనూ అదే జరిగింది. పుంగనూరులోకి చంద్రబాబును అడుగుపెట్టనీయలేదు. తవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఇంకా పరిస్థితి ముదరకుండా ఆయన వెళ్లిపోయారు. చంద్రబాబు పుంగనూరులోకి రానివ్వకుండా చేయడానకే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వైసీపీ బంద్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పుంగనూరులో పర్యటించారు. అయితే చంద్రబాబు పర్యటనలో టీడీపీ, అధికార వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నాయి. పోలీసులపై, పోలీస్ వాహనాలపై సైతం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది వరకు పోలీసులు సైతం గాయపడ్డారు. అయితే పుంగనూరులో శుక్రవారం చంద్రబాబు విధ్వంసం సృష్టించారని, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ.. నేడు (ఆగస్టు 5న) చిత్తూరు జిల్లా బందు కు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బందు ను విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేఆర్‌జే భరత్ కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆసరా పెన్షన్లు పది రకాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న పథకం ‘ఆసరా పింఛను’. అయితే శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆసరా పెన్షన్లపై MS ప్రభాకర్ రావు, ఎగ్గే మలేశం, తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పెన్షన్లపై ప్రశ్నలు అడిగారు. రాష్ట్రంలో 43 లక్షల 68 వేల 784 మంది ఆసరా పింఛన్ లబ్దిదారులు ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు. కేటగిరీల వారీగా తెలంగాణలో ఇస్తున్న మొత్తం 10 రకాల ఆసరా పెన్షన్ల వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 2014, అక్టోబర్ 1 నుంచి ‘ఆసరా పింఛను’ పథకాన్ని ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మెక్‌గ్రాత్ జోస్యం
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి భారతదేశంలో ప్రారంభం అవుతుంది. ఇది 13వ వన్డే వరల్డ్ కప్. మొదటి సారి భారతదేశం వన్డే ప్రపంచ కప్‌కు పూర్తిగా ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిలో దేశంలోని 10 నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కావడానికి కేవలం రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ట్రయంఫ్ స్పీడ్ 400 స్పీడ్
ఈ ఏడాది దేశంలో విడుదల అయిన బైక్‌ల్లో ట్రయంఫ్ స్పీడ్ 400 చాలా ప్రజాదరణ పొందింది. కేవలం నెల రోజుల్లోనే ఈ బైక్ 15,000కు పైగా బుకింగ్స్‌ను అందుకుంది. ముంబై, పుణే, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ మోటార్‌సైకిల్ డెలివరీని కంపెనీ ప్రారంభించింది. ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ. 2.23 లక్షల నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆపిల్ సంస్థ రికార్డు
భారత్ లో ఆపిల్ సంస్థ రికార్డు నమోదు చేసింది. జూన్ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాల్లో ఏకంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న భారత్ లో.. పాగా వేయడానికి ఆపిల్ వేసిన అడుగులు అదిరిపోయే ఫలితాన్ని ఇచ్చాయి. ఆపిల్ సంస్థ ఇటీవల ఢిల్లీ, ముంబైలలో రెండు ఔట్ లెట్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత్ లో అమ్మకాల వృద్ధి పట్ల కంపెనీ సంతోషంగా ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఆపిల్ సంస్థ తాజా ఆదాయాల ప్రకటనలో భారత్ ను ప్రముఖంగా గుర్తించడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అత్యంత పురాతనమైన యుద్ధకళ
బహుశా కలరిపయట్టు ఈ భూమ్మీదనే అత్యంత పురాతనమైన యుద్ధకళ కావచ్చు. దీనిని తొలిసారి అగస్త్య ముని ప్రపంచానికి పరిచయం చేశారు. యుద్ధకళ అంటే కేవలం తన్నుకోవడమో లేదా కొట్టుకోవడమో కాదు. ఇందులో సాధ్యమైనంత వరకు మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాం. అయితే, ఇది వ్యాయామం కోసమే కాదు. ఇది మన శరీరంలో ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోడానికీ ఉపయోగపడుతుంది. ఇందులో కలరి చికిత్స, కలరి మర్మ అనే రెండు కళలు ఉన్నాయి. వీటి ద్వారా శరీర రహస్యాలు తెలుసుకొని, త్వరగా కోలుకొని, శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కలరి అభ్యాసకులు చాలా తక్కువ మంది ఉండచ్చు. అయితే, ఈ కళలో ఆరితేరిన వాళ్లు యోగా వైపూ మళ్లుతారు. ఎందుకంటే ఈ కళలోనూ ఆధ్యాత్మికత ఉంది కాబట్టి. ఆ ఆధ్యాత్మిక అన్వేషణకు అగస్త్య ముని దారి చూపించారు. కానీ మన శరీరంలో మనం ఇంకా అన్వేషించని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఊరికే అలా మిమ్మల్ని తాకి, మిమ్మల్ని చంపగల కరాటే మాస్టర్లు ఉన్నారు. కేవలం తాకి చంపగలగడంలో పెద్దగా చెప్పుకోదగినది ఏమీ లేదు. అదే మిమ్మల్ని తాకి మీలో చైతన్యం నింపడం చాలా గొప్ప విషయం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బ్యాన్ చేసిన ల్యాప్‌టాప్‌లు ఇవే
కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు (Laptops), ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ క్షణం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయయని ప్రకటించింది. భద్రతా కారణాలు, స్థానిక తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో భద్రతకు ముప్పు నెలకొందని కేంద్రం భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అనన్యా హర్రర్ సినిమా
'మల్లేశం' సినిమాతో తెలుగు చిత్రసీమలో మెరిగిన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల (Ananya Nagalla). ఆ తర్వాత ఆమె నటించిన 'ప్లే బ్యాక్' కూడా హిట్టే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో చేసిన కీలక పాత్ర కూడా అనన్యా నాగళ్లకు మంచి పేరు తీసుకు వచ్చింది. ఇటీవల 'మళ్ళీ పెళ్లి'లో యంగ్ పవిత్ర పాత్రలో అందంగా కనిపించారు. ఇప్పుడు అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలో ఓ హారర్ సినిమా రూపొందుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టింగ్లీష్ పేర్లతో తంటా
తెలుగు సినిమాలకు అచ్చమైన తెలుగు టైటిల్ ఉంటే ఆ అందమే వేరుగా ఉంటుంది. అప్పట్లో సినిమా నేపథ్యాన్ని తగ్గట్టుగా మంచి తెలుగు పేరునే టైటిల్ గా పెట్టేవారు. ఆధునిక పోకడల వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాక, నేటి తరాన్ని ఆకర్షించే ఇంగ్లీష్, హిందీ పదాలను పేర్లుగా పెట్టారు. రాను రాను ఇంగ్లీష్ - తెలుగు కలబోసిన 'టింగ్లిష్' టైటిల్స్ ను పెట్టడం మొదలెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ చిత్రసీమలో మునుపటి తెలుగు వెలుగులు కనిపిస్తున్నాయి. చాలా వరకు మన దర్శక నిర్మాతలు స్వచ్ఛమైన తెలుగు పేర్లను పెడుతూ భాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. కాకపోతే పాన్ ఇండియా సినిమాలకు వచ్చే సరికి యూనివర్సల్ అప్పీల్ కోసం ఎక్కువగా ఇంగ్లీష్ పేర్లను ఆశ్రయిస్తున్నారు. ఇది కూడా కొంత వరకు ఓకే కానీ, ఇతర భాషల చిత్రాల తెలుగు వెర్షన్ కు పెట్టే టైటిల్స్ తోనే ఇబ్బందులు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి