అన్వేషించండి

Ananya Nagalla - Tantra Movie : 'తంత్ర' శాస్త్రం గుట్టు విప్పే హారర్ థ్రిలర్ - హీరోగా శ్రీహరి సోదరుని కుమారుడు

తెలుగమ్మాయి అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా 'తంత్ర'. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా సినిమా జానర్ రివీల్ చేశారు.

'మల్లేశం' సినిమాతో తెలుగు చిత్రసీమలో మెరిగిన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల (Ananya Nagalla). ఆ తర్వాత ఆమె నటించిన 'ప్లే బ్యాక్' కూడా హిట్టే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్‌ సాబ్‌'లో చేసిన కీలక పాత్ర కూడా అనన్యా నాగళ్లకు మంచి పేరు తీసుకు వచ్చింది. ఇటీవల 'మళ్ళీ పెళ్లి'లో యంగ్ పవిత్ర పాత్రలో అందంగా కనిపించారు. ఇప్పుడు అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలో ఓ హారర్ సినిమా రూపొందుతోంది. 

తొలిసారి హారర్ థ్రిల్లర్ చేస్తున్న అనన్య!
Ananya Nagalla New Movie : అనన్యా ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'తంత్ర' (Tantra Movie). దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. 'మర్యాద రామన్న'లో కథానాయికగా, అంతకు ముందు ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసిన సలోని 'తంత్ర'తో తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర. శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక హారర్‌ థ్రిల్లర్‌. అనన్యా నాగళ్ల ఈ జానర్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. 

పురాణ గాథల నేపథ్యంలో 'తంత్ర'
Tantra Movie First Look : 'తంత్ర' ఫస్ట్ లుక్ వైవిధ్యంగా ఉంది. అందులో అనన్యా నాగళ్ల కన్ను ఒక్కటే కనబడుతోంది. కొన్ని చేతులు ఆమె ముఖాన్ని పట్టుకున్నట్లు ఉంది. మన 'తంత్ర' శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

Also Read : 'భోళా శంకర్'తో ఆ లోటు తీరింది - తమన్నా ఇంటర్వ్యూ

''మహిళా ప్రాధాన్య చిత్రమిది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్‌. పురాణ  గాథలు, భారతీయ తాంత్రిక శాస్త్రం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. అనన్యా నాగళ్ల పాత్ర, ఆమె నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటి వరకు తెలుగు తెరపై వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది'' అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Read 'లెట్స్ గెట్ మ్యారీడ్' రివ్యూ : ఎంఎస్‌ ధోనీ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

'తంత్ర' సినిమాలో అనన్యా నాగళ్ల, ధనుష్‌, సలోని, 'టెంపర్‌' వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ఎస్‌.బి. ఉద్దవ్‌ (భలే భలే మగాడివోయ్‌, మిథునం),  ఛాయాగ్రహణం : సాయి రామ్ ఉదయ్‌ (రాజు యాదవ్‌ ఫేం) - విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌ (క్రేజీ ఫెలో, మైల్స్‌ ఆఫ్‌ లవ్‌), నిర్మాణ సంస్థలు : ఫస్ట్‌ కాపీ మూవీస్‌ - బి ద వే ఫిల్మ్స్‌ - వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, నిర్మాతలు : నరేష్ బాబు పి - రవి చైతన్య, దర్శకత్వం: శ్రీనివాస్‌ గోపిశెట్టి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget