అన్వేషించండి
Morning Headlines: దుమారం రేపుతున్న కొండా సురేఖ వ్యాఖ్యలు, నేటి నుంచి మహిళల టీ20 ప్రాపంచకప్ వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Todays Top 10 News:
1. టీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని మంత్రి కొండా సురేఖ వాపోయారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని BRS నేత కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లుందని ఆరోపించారు. ‘‘మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు BRSలో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు’’ అని చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. సమంతకు మంత్రి సురేఖ క్షమాపణ
చైతూ-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమంతకు మంత్రి క్షమాపణ చెప్పారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. మీరంటే నాకు అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. రాజకీయాలకు నా పేరు దూరం పెట్టండి: సమంత
తమ విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు హీరోయిన్ సమంత స్పందించారు. 'మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమల్లో పనిచెయ్యడం, ప్రేమలో పడడం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడకండి. ఇక విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగతం. ఇద్దరి అంగీకారంతో ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి రాజకీయాలకు నా పేరు దూరంగా పెట్టండి' అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగర్జున స్పందించారు. 'రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉండి మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను' అని నాగ్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. బందరు పోర్టు పనులు 2025 నాటికి పూర్తి
బందర్ పోర్టు పనులను 2025 నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో బందర్ పోర్టు పనులు 24 శాతం మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. రూ.3,669 కోట్ల అంచనాతో ప్రాజెక్టు బందర్ పోర్ట్ చేపట్టామని తెలిపారు. పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామని చెప్పారు. బందర్ పోర్టు పనులు పూర్తైతే మొదట 4 బెర్త్ లు ఏర్పాటు అవుతాయన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్త్ ల దాకా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. పవన్ "సనాతన" ప్రకటనపై విస్తృత చర్చ
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసమే వారాహి యాత్ర చేపడుతున్నట్టు పవన్ స్పష్టం చేయడంతో ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుందో అనే చర్చ ఆరంభమైంది. వారాహి చాలా పెద్ద లక్ష్యం కోసం తిరిగి వచ్చిందని.. సనాతన ధర్మ రక్ష బోర్డుకు జీవం పోయాలనుకునే లక్షలాది మంది స్వరాన్ని ప్రతిధ్వనించడమే దాని లక్ష్యమని పవన్ అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కుమార్తె
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. తితిదే ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. నాలుగు నెలల్లోనే సర్కారుపై వ్యతిరేకత: జగన్
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై కీలక విమర్శలు చేశారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, పారదర్శకత కొరవడిందని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు (గురువారం) అంకురార్పణ జరగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తా రు. అనంతరం రాత్రి 7 గంటలకు మాడవీధులగుండా ఊరేగింపు నిర్వహిస్తా రు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చకస్వాములు కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ(బీజవాపం) నిర్వహిస్తా రు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. నేటి నుంచి మహిళల టీ20 WC
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో చూడవచ్చు. కాగా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
పాలిటిక్స్
నిజామాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion