అన్వేషించండి

ICC Womens T20 World Cup 2024: క్రికెట్ ప్రపంచమా సిద్ధమా, మహిళల టీ 20 వరల్డ్ కప్ షురూ!

Womens T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ 20 ప్రపంచ కప్పును కైవసం చేసుకోవడానికి పది జట్లు సిద్ధం అవుతున్నాయి. అక్టోబర్ 3న షార్జా క్రికెట్ స్టేడియంలో స్కాట్లాండ్‌ , బంగ్లాదేశ్‌ తలపడుతుంది.

Women's T20 World Cup 2024 Full schedule and details :
మహిళల టీ 20 ప్రపంచకప్‌కు(Womens T20 World Cup 2024) అంతా సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కప్పును కైవసం చేసుకోవాలని సంకల్పంతో ఉన్న పది జట్లు.. ఉత్కంఠభరిత పోరాటాలకు సిద్ధమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(UAE)లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ అక్టోబర్ 3న షార్జా క్రికెట్ స్టేడియంలో స్కాట్లాండ్‌తో ఆతిథ్య దేశం బంగ్లాదేశ్‌(BAN)తో తలపడుతుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(AUS) మరోసారి కప్పు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉండగా... టీమిండియా(IND) తొలిసారి విశ్వ విజేతలుగా నిలవాలని పట్టుదలతో ఉంది. పూర్వ వైభవం కోసం పాక్.. మరో కప్పు కోసం ఇంగ్లాండ్... ఈసారి కప్పు వదలకూడదనే సంకల్పంతో న్యూజిలాండ్ ఇలా ప్రతీ జట్టు కప్పు పైనే కన్నేసింది.  దీంతో ఈసారి భీకర పోరాటాలు ఖాయంగా కనిపిస్తుంది.   
 
 
భారత జట్టుపై భారీ అంచనాలు
టీ 20 ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఓసారి ఫైనల్ చేరిన భారత జట్టు.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈసారి మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా కప్పు ఒడిసిపట్టాలని కసితో ఉంది. అక్టోబర్ 4న తమ న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్‌తో భారత పోరాటం ప్రారంభం కానుంది.
 
భారత జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధాయాంక పాటిల్,, సజన సజీవన్ 
 
పూర్తి షెడ్యూల్..
అక్టోబర్ 3, మధ్యాహ్నం 3:30: బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్  (షార్జా స్టేడియం)
అక్టోబర్ 3, రాత్రి 7:30: పాకిస్థాన్ vs శ్రీలంక  (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 4, మధ్యాహ్నం 3:30: సౌతాఫ్రికా vs వెస్టిండీస్  (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 4, రాత్రి 7:30  ఇండియా vs న్యూజిలాండ్  ‍‍(దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 5, మధ్యాహ్నం 3:30: ఆస్ట్రేలియా vs శ్రీలంక  (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 5, రాత్రి 7:30: బంగ్లాదేశ్ vs ఇంగ్లండ్   (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 6, మధ్యాహ్నం 3:30: భారత్ vs పాకిస్థాన్  (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 6, రాత్రి 7:30: వెస్టిండీస్ vs స్కాట్లాండ్ - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 7, రాత్రి 7:30: ఇంగ్లాండ్ vs సౌతాఫ్రికా -(షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 8, రాత్రి 7:30: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 9, మధ్యాహ్నం 3:30: దక్షిణాఫ్రికా vs స్కాట్లాండ్ - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 9, రాత్రి 7:30: భారత్ vs శ్రీలంక - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 10, రాత్రి 7:30: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 11, రాత్రి 7:30: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ -  (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 12, మధ్యాహ్నం 3:30: న్యూజిలాండ్ vs శ్రీలంక - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 12, రాత్రి 7:30: బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా -  (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 13, మధ్యాహ్నం 3:30: ఇంగ్లండ్ vs స్కాట్లాండ్ -  (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 13, రాత్రి 7:30: భారత్ vs ఆస్ట్రేలియా -  (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 14, 7:30 pm: పాకిస్తాన్ vs న్యూజిలాండ్ - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 15, రాత్రి 7:30: ఇంగ్లండ్ vs వెస్టిండీస్ -(దుబాయ్ స్టేడియం)
సెమీఫైనల్ 1: గ్రూప్ A విజేత vs గ్రూప్ B రన్నరప్ ((దుబాయ్ స్టేడియం)
సెమీఫైనల్ 2: గ్రూప్ B విజేత vs గ్రూప్ A రన్నరప్ (అక్టోబర్ 18, రాత్రి 7:30--షార్జా క్రికెట్ స్టేడియం)
 
 ఫైనల్: సెమీఫైనల్ 1 విజేత vs సెమీఫైనల్ 2 విజేత (అక్టోబర్ 20, రాత్రి 7:30 - దుబాయ్ స్టేడియం) 
 
 
ఏ ఛానెల్ ప్రసారం చేస్తుంది? 
మహిళల T20 ప్రపంచ కప్ 2024 భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ప్రసారం చేస్తుంది. 
 
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? 
T20 ప్రపంచ కప్ 2024 ప్రత్యక్ష ప్రసారం Disney+ Hotstar యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget