అన్వేషించండి

Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన బుమ్రా, అశ్విన్ - తొలి 2 స్థానాలు భారత బౌలర్లవే

Jasprit Bumrah Number 1 bowler | టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ర్యాంకుకు ఎగబాకాడు. అశ్విన్ ను వెనక్కి నెడుతూ బుమ్రా తాజా ర్యాంకింగ్స్ లో నెంబర్ 1గా నిలిచాడు.

ICC Test Rankings: హైదరాబాద్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. మరో భారత బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ashwin)ను వెనక్కి నెడుతూ.. 870 రేటింగ్ పాయింట్లతో పేసర్ బుమ్రా మరోసారి నెంబర్ 1గా నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (869 రేటింగ్ పాయింట్లు) ఒక్క పాయింట్ తేడాతో రెండో ర్యాంకులో నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ కోసం భారత బౌలర్ల మధ్య పోటీ నెలకొంది. 

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టిన అశ్విన్, బుమ్రా

ఇటీవల జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై భారత బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, అశ్విన్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే బంగ్లాతో టెస్ట్ సిరీస్ లో అశ్విన్, బుమ్రాలు చెరో 11 వికెట్లతో రాణించారు. అదే సమయంలో అశ్విన్‌ కంటే బుమ్రా తక్కువ పరుగులు ఇస్తూ, పొదుపుగా బౌలింగ్ చేశాడు. సిరీస్ లో బుమ్రా బౌలింగ్ యావరేజ్ 12.82గా ఉంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బుమ్రా, రెండో స్థానంలో అశ్విన్ నిలవగా.. ఆసీస్ కు చెందిన బౌలర్లు జోష్‌ హేజిల్‌ వుడ్, పాట్ కమిన్స్‌ లు వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ టాప్ 5గా నిలిచాడు. టీమిండియా ఆల్ రౌండర్ జడేజా 6వ స్థానం దక్కించుకున్నాడు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ టెస్టు ర్యాంకింగ్స్ లో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన బుమ్రా.. ఆ సమయంలో మూడు స్థానాలు మెరుగు పరుచుకుంటూ మరో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కినెట్టాడు. బుమ్రా, అశ్విన్ లు ఒకరితో ఒకరు పోటీపడి మరీ వికెట్లు తీసి భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక తీసిన బౌలర్‌ కూడా బ్రుమానే కావడం విశేషం. బుమ్రా కంటే ముందు భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మెరుగైన ర్యాంకు (2) సాధించిన బౌలర్ గా నిలిచారు. 1979 డిసెంబర్ నుంచి 1980 ఫిబ్రవరి వరకు టెస్టుల్లో 2వ ర్యాంకులో కపిల్ దేవ్ కొనసాగారు.

3వ ర్యాంకుకు చేరుకున్న యశస్వీ జైస్వాల్
ఇంగ్లాంట్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ లో టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు.  యశస్వి రెండు స్థానాలు మెరుగు చేసుకున్నాడు.  మూడో స్థానానికి చేరాడు. విరాట్ కోహ్లీ మరోసారి టాప్ 10లోకి వచ్చాడు. కోహ్లీ ఆరు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకులో నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్  రిషబ్ పంత్ 9వ స్థానానికి పడిపోయాడు. గత ర్యాంకుల్లో ఆరో స్థానంలో ఉన్న పంత్ ర్యాంకులో డౌన్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్‌ 10లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐదు స్థానాలు దిగజారి రోహిత్ శర్మ 15వ స్థానంలో నిలిచాడు. 

Also Read: Babar Azam: అనుభవం బాగుందట, కానీ కెప్టెన్సీ వద్దట- బాబర్ ఆజం సంచలన ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget