అన్వేషించండి
Advertisement
Morning Top News: విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్, జనం బాట పట్టనున్న జగన్, కేసీఆర్ వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు, వైసీపీ సోషల్ మీడియా పూర్వ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు వంటి మార్నింగ్ న్యూస్.
Top 10 News Today:
జగన్, కేసీఆర్‌ల జనం బాట
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష నేతలు కేసీఆర్, జగన్ లు సంక్రాంతి నుండి జనం బాట పట్టనున్నారు. అధికార పార్టీల తప్పులను ఎండ గడుతూ సమస్యలపై పోరాడుతాం అంటున్నారు. దీనితో పొలిటికల్ గా రెండు తెలుగు రాష్ట్రాల నేతలు సంక్రాంతి వైపు చూస్తున్నారు. స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ కావాలని జనంలో పట్టు సాధించాలని చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలిదశ డీపీఆర్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో46.23 కి. మీ. మేర 3 కారిడార్ ను నిర్మించనున్నారు. విశాఖ-స్టీల్ ప్లాంట్, కొమ్మది వరకు 34.4మీ మేర కారిడార్ -1, గురుద్వార్-పాత పోస్ట్ ఆఫీస్, వరకు 5.08 కి. మీ మేర కారిడార్ -2, తాటిచెట్ల పాలెం-చినవాల్తేర్ వరకు 6.75కిమీ, కారిడార్ -3, నిర్మించనున్నారు. రెండోదశలో కొమ్మాది-బోగాపురం విమానాశ్రయoకు వరకు30.67కిమీ, కారిడార్4 నిర్మించాలి. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 66.15 కిలోమీటర్ల దూరంతో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు
అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాల అజెండాగా చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి మంత్రి నారాయణ హాజరయ్యారు. రాజధానిలో సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు భవనాల నిర్మాణం చేపడతామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
వైసీపీ సోషల్ మీడియా పూర్వ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ధర్మాసనం నిరాకరించింది. భార్గవరెడ్డి పెట్టిన సోషల్ మీడియా పోస్టులన్నీ అమోదయోగ్యంగా ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు
ఏపీ సర్కార్.. పుష్ప-2 మూవీ బృందానికి గుడ్ న్యూస్ చెప్పింది. పుష్ప-2 సినిమా టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రాత్రి. 9.30 గంటలకు ఒక టికెట్‌పై రూ.800 అదనంగా పెంచుకొనేందుకు అవకాశం కల్పించింది. డిసెంబర్ 5, 6 తేదీల షోలకు గరిష్టంగా రూ.200 పెంచుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం తీరును సాధారణ ప్రజలు తప్పుపడుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపల్ పై దాడి
మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న తనుష్ నాయక్ బాత్రూంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. లెక్చరర్ వేధింపుల వల్లే తమ బిడ్డ సూసైడ్ చేసుకున్నాడని తండ్రి ఆరోపించారు. కాలేజీకి వెళ్లి గేట్ తాళం విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లి ఆందోళన చేశారు. ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలుగు రాష్ట్రాలపై తగ్గని ఫెంగల్ ప్రభావం
ఫెంగల్ తుపాను తీరం దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. చలి తీవ్రత తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వాతావరణంవాతావరణం కూడా అలానే ఉంటుందని వాతావరణశాఖాధికారులు తెలియజేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహా ఉత్కంఠకు తెరపడేదెప్పుడు..?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 4న లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి సిద్ధమైంది. ఈ సమావేశానికి బీజేపీ శాసన సభా పక్ష సభ్యులు అందరూ హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమావేశంలోనే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేయనున్నారు. 4వ తేదీ శాసన సభా పభ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారమే ఎమ్మెల్యేలందరూ ముంబై రావాలని పార్టీ ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కొండచరియలు విరిగిపడి ఐదుగురి మృతి
ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు తిరువణ్ణామలైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నామలైయార్ కొండ వద్ద కొండచరియలు విరిగిపడి అయిదుగురు మరణించారు. శిథిలాల నుంచి రాజ్ కుమార్, మీనా, ఇనియా, గౌతమ్, వినోద్ మృతదేహాలను వెలికి తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు సహాయక చర్యలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సుందర్ పిచాయ్‌కు ముంబై కోర్టు నోటీసులు
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు షాకిచ్చింది. ఓ కేసుకు సంబంధించి సుందర్ పిచాయ్‌కు ముంబై కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ‘పఖండి బాబా కి కర్తుట్’ అనే వీడియోను తొలగించాలన్న కోర్టు ఆదేశాలను యూట్యూబ్ ఉల్లంఘించింది. యూట్యూబ్ వీడియో తొలగించకపోవడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పును ధిక్కరించడంపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఆట
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement