Today Weather: తెలుగు రాష్ట్రాలపై తగ్గని ఫెంగల్ ప్రభావం-నాలుగు రోజుల పాటు వర్షాలు
Weather Today: ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షావరణం ఏర్పడింది. చలి తీవ్రత బాగా తగ్గింది. మరో నాలుగు రోజులు ఇలాంటి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.

Today Weather Report In Andhra Pradesh And Telangana :ఫెంగల్ తుపాను తీరం దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. చలి తీవ్రత తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ్టి వాతావరణం కూడా అలానే ఉంటుందని వాతావరణశాఖాధికారులు తెలియజేశారు.
తెలంగాణలో వాతావరణం (Telangana Weather updates)
తెలంగాణలో ఐదు రోజుల పాటు వాతావరణం ఇదే మాదిరిగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని చెబుతోంది. ఏడో తేదీ వరకు ఇలాంటి వాతావరణం ఉంటుందని చెబుతోంది. ఎనిమిదో తేదీ నుంచి వాతావరణంలో మార్పులు వస్తాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగానే నమోదు అవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 32.9 డిగ్రీలు నిజామాబాద్ జిల్లాలో నమోదు అయింది. అత్యల్ప ఉష్ణోగ్రత మెదక్‌లో 16.3 డిగ్రీలు రిజిస్టర్ అయింది. సాధారణంగా ఈ సీజన్‌లో నమోదు అయ్యే ఉష్ణోగ్రత కంటే దాదాపు ఐదు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదు అయ్యాయి. అవి ఆదిలాబాద్, భద్రచాలం, హకీంపేట్, దుండిగల్, హైదరరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, హయత్‌నగర్. మిగతా ప్రాంతాల్లో నమోదు అయిన కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
| ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
| 1 | ఆదిలాబాద్ | 29.0 | 21.2 | 88 |
| 2 | భద్రాచలం | 31.0 | 24.2 | 90 |
| 3 | హకీంపేట | 28.2 | 21.4 | 97 |
| 4 | దుండిగల్ | 29.5 | 21.8 | 98 |
| 5 | హన్మకొండ | 30.5 | 22.0 | 95 |
| 6 | హైదరాబాద్ | 28.0 | 22.0 | 91 |
| 7 | ఖమ్మం | 31.4 | 23.4 | 90 |
| 8 | మహబూబ్‌నగర్ | 28.1 | 23.6 | 85 |
| 9 | మెదక్ | 29.2 | 16.3 | 76 |
| 10 | నల్గొండ | 27.0 | 20.0 | 79 |
| 11 | నిజామాబాద్ | 32.9 | 22.1 | 84 |
| 12 | రామగుండం | 30.2 | 21.2 | 89 |
| 13 | పటాన్‌చెరు | 29.0 | 20.4 | 91 |
| 14 | రాజేంద్రనగర్ | 28.0 | 21.5 | 96 |
| 15 | హయత్‌నగర్ | 28.0 | 21 | 93 |
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(andhra Pradesh Weather Updates)
ఫెంగల్ తుపాను ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదు అయింది. ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. గత 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 ఎంఎం వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం ఇంకా పోలేదని అంటున్నారు. ఇవాళ కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు, తిరుపతిజిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు.
| ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
| 1 | కళింగపట్నం | 25.9 | 21 | 93 |
| 2 | విశాఖపట్నం | 26 | 22.7 | 93 |
| 3 | తుని | 28.2 | 24.1 | 84 |
| 4 | కాకినాడ | 27 | 23.2 | 85 |
| 5 | నర్సాపురం | 27 | 24.2 | 79 |
| 6 | మచిలీపట్నం | 28.6 | 23.8 | 91 |
| 7 | నందిగామ | 30.6 | 22 | 88 |
| 8 | గన్నవరం | 29.4 | 23.9 | 88 |
| 9 | అమరావతి | 29.4 | 23.8 | 82 |
| 10 | జంగమేశ్వరపురం | 30 | 22.5 | 96 |
| 11 | బాపట్ల | 28.5 | 23 | 93 |
| 12 | ఒంగోలు | 29.1 | 24.5 | 96 |
| 13 | కావలి | 26.5 | 24.6 | 91 |
| 14 | నెల్లూరు | 28 | 25 | 98 |
| 15 | నంద్యాల | 30 | 24 | 91 |
| 16 | కర్నూలు | 30.5 | 24.2 | 83 |
| 17 | కడప | 26.5 | 24.3 5 | 98 |
| 18 | అనంతపురం | 27.9 - | 23.6 | 88 |
| 19 | ఆరోగ్యవరం | 22.5 | 20 | 91 |
| 20 | తిరుపతి | 26.8 | 24 | 95 |





















