Hrithik Roshan: ఇదన్యాయం హృతిక్ - అందరూ జనవరి1న ప్రారంభించారు - నువ్వు పూర్తి చేస్తావా ?
Fitness: జిమ్‌కు వెళ్లాలి పొట్ట తగ్గించాలని అని అందరూ జనవరి ఒకటిని అనుకుని డబ్బులు కడతారు.కానీ హృతిక్ మాత్రం జనవరి ఒకటికే తనకు కావాల్సిన ఆకృతి తెచ్చేసుకున్నాడు. అది చూస్తే ...
Hrithik Roshans Fitness At 50 In His Recent Workout Video: కహోనా ప్యార్ హై అంటూ బాలీవుడ్ లో ఎంట్రీతోనే దుమ్ము రేపిన హృతిక్ రోషన్ ఫిట్ నెస్‌కు రోల్ మోడల్ కూడా. ఆయన హెచ్‌ఆర్ఎక్స్ బ్రాండ్ పేరుతో జిమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. అయితే సినిమాల్లో పాత్రకు తగ్గట్లుగా శరీరాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. గతంలో సూపర్ 30 అనే సినిమా కోసం శరీరంలో కొవ్వును పెంచి మధ్యతరగతి వ్యక్తిలా మారిపోయాడు. ఇప్పుడు తన వార్ సినిమాకు పూర్తిగా మారిపోయారు. ఎంతగా అంటే.. శరీరంలో కొవ్వు అనేది లేదు. కండలు మాత్రమే ఉన్నాయి. ఆ ఫోటోలను ఇన్ స్టాలో పంచుకున్నారు.
View this post on Instagram
అంతే కాదు తాను చేస్తున్న వర్కవుట్ వీడియోను కూడా షేర్ చేశాడు. ఇది క్షణాల్లో వైరల్ అయిపోయింది. హృతిక్ రోషన్ కష్టం చూస్తే.. చాలా మంది జిమ్ముకు వెళ్లాలంటే చాలా కష్టపడాలి గురూ అనుకుంటారు.
Also Read: Go Goa Gone: టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?
ప్రతి ఏడాది డిసెంబర్ 31న మన లాంటి మధ్య తరగతి కుర్రాళ్లు.. ఒంట్లో పెరిగిపోతున్న కొవ్వును చూసుకుని చాలా బాధపడిపోతాం. కొొత్త ఏడాది నుంచి అసలు వెనక్కి తగ్గకూడదని జిమ్ముకు వెళ్లాల్సిందేనని అనుకుని సబ్ స్క్రిప్షన్ కూడా కట్టేసి వస్తాం. కానీ వారం రోజుల తర్వాత వేరే పనులు పడతాయి. ఇక మర్చిపోతాం. పట్టుదల ఉంటే మాత్రం హృతిక్ లా బాడీ తీరును మార్చుకోవడం పెద్ద విషయం కాదు.
ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ 2లో నటిస్తున్నాడు. ఆయనకు పోటీగా తెలుగు హీరో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇద్దరూ కండలు తిరిగిన శరీరాలతో హోరాహోరీగా ఈ సినిమాలో తలపడనున్నారు. వార్ వన్ సిరీస్‌లో హిందీ లో మరో కండల వీరుడు జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్నారు. వార్ సీరిస్‌లో హృతిక్ విలన్ గా ఉంటారు. హీరోలు మారుతూంటారు. థూమ్ సీరిస్‌లోనూ అంతే. విలన్ పాత్రలతో పాటు హీరో పాత్రలకూ ఇందులో విలువ ఎక్కువగా ఉంటుంది.