Morning Top News: మన్మోహన్ మృతికి తెలుగు సీఎంల సంతాపం, వైసీపీకి కొత్త వెలుగు తెచ్చిన క్రిస్మస్ వంటి టాప్ న్యూస్
Top 10 Headlines Today: గ్రామం నుంచి ఎర్రకోట వరకు మన్మోహన్ సింగ్ ప్రయాణం, ఆత్మహత్యలకు కారణం వివాహేతర సంబంధంమే వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
ఆర్థిక సంస్కరణల ఆద్యుడు కన్నుమూత
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో గురువారం (26 డిసెంబర్ 2024) మృతి చెందారు. కాసేపటి క్రితమే ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనికి ముందు, ఆయన భారతదేశానికి ఆర్థిక మంత్రి , ఆర్థిక కార్యదర్శిగా కూడా ఉన్నారు. నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గ్రామం నుంచి ఎర్రకోట వరకు.. ప్రయాణం
డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తదుపరి విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. తరువాత 1962లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో డి.ఫిల్ చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్‌లకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మన్మోహన్ మృతిపై రాహుల్ భావోద్వేగం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రాహుల్ గాంధీ భావోద్వేగమైన పోస్టు రాసుకొచ్చారు. "మన్మోహన్ సింగ్ జీ భారత అపారమైన జ్ఞానం, సమగ్రతతో నడిపించారు. ఆయన వినయం, ఆర్థికశాస్త్రంపై లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. కౌర్, ఆమె కుటుంబ సభ్యులకు నా సానుభూతి. నేను ఒక గురువు, మార్గదర్శిని కోల్పోయాను. ఆయనను అభిమానించే మిలియన్ల మందితోపాటు మేం కూడా ఆయనను ఎంతో గర్వంగా గుర్తుంచుకుంటాం." అని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు, నాయకులు, సంస్కర్త, అన్నింటికంటే మించి మన కాలంలోని మానవతావాది మన్మోహన్ సింగ్ జీ ఇక లేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల తీవ్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మేధావి రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం, కలగలిపిన వ్యక్తి మన్మోహన్ అని చంద్రబాబు అన్నారు. తెలంగాణాలో నేడు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏడు రోజులు సంతాప దినాలు
మన్మోహన్ సింగ్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో దేశ వ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వివాహేతర సంబంధం వల్లే.. ఆత్మహత్యలు
కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు మరో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర బంధం కారణంగానే ఈ మూడు ప్రాణాలు కడతేరిపోయినట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో జగన్ కలసిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థనలు చేయడంతో త్వరలోనే అంతా కలిసిపోతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా జగన్ ఫ్యామిలీతో గ్రూప్ ఫోటో దిగారు. షర్మిల ఈ సారి క్రిస్మస్ కోసం పులివెందుల వెళ్లలేదు. ఆమె అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. షర్మిల కుమారుడు , కోడలు మాత్రం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బెనిఫిట్ షోలు లేవు.. రేవంత్ స్పష్టీకరణ
టాలీవుడ్ ఇకపై బెనిఫిట్ షోల్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు చిత్రసీమ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటిలో బెనిఫిట్ షోల గురించి చర్చకు రాగా... తన వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సూటిగా స్పష్టంగా చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బీజేవీకి విరాళాలే విరాళాలు...
గెలిచే పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీ అందరూ విరాళాలు ఇవ్వాలనకుంటారు. అందుకే బీజేపీకి పంట పండుతోంది. 2023-24లో ఆ పార్టీకీ రూ .2,244 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎన్నికల ఏడాది కావడంతో పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. అంతకు ముందు ఏడాది 2022-23లో రూ .700 కోట్లు మాత్రమే విరాళాలు వచ్చాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 2023-24లో బీజేపీ విరాళాలు 212 శాతం పెరిగాయి. ఎన్నికల కమిషన్ కు రాజకీయ పార్టీలు సమాచారాన్ని ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్మిత్ సెంచరీ.. దిగ్గజాల సరసన స్టార్
బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 167 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి వేసి ఇన్నింగ్స్ 101వ ఓవర్లో చివరి బంతిని మిడాఫ్, ఎక్స్‌ట్రా కవర్ మధ్యలో బౌండరీకి తరలించడంతో స్టీవ్ స్మిత్ శతకం పూర్తయింది. కాగా, టెస్టు కెరీర్‌లో అతడికిది 34వ సెంచరీ.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..