అన్వేషించండి

Manmohan Singh Death: నేనో గురువు, గైడ్‌ని కోల్పోయాను- మన్మోహన్ సింగ్ మృతిపై రాహుల్ గాంధీ ఉద్వేగం

Rahul Gandhi Emotional: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను గర్వంగా స్మరించుకుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మృతి పట్ల భావోద్వేగంగా స్పందించారు.

Rahul Gandhi Gets Emotional On Manmohan Singh's Demise: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రాహుల్ గాంధీ భావోద్వేగమైన పోస్టు రాసుకొచ్చారు. "మన్మోహన్ సింగ్ జీ భారతదేశాన్ని అపారమైన జ్ఞానం, సమగ్రతతో నడిపించారు. ఆయన వినయం, ఆర్థికశాస్త్రంపై లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. కౌర్, ఆమె కుటుంబ సభ్యులకు నా సానుభూతి. నేను ఒక గురువు, మార్గదర్శిని కోల్పోయాను. ఆయనను అభిమానించే మిలియన్ల మందితోపాటు మేం కూడా ఆయనను ఎంతో గర్వంగా గుర్తుంచుకుంటాం."

కోట్లమంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేసిన వ్యక్తి: మల్లికార్జున ఖర్గే 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, మాటల కంటే క్రియాత్మక వ్యక్తి, దేశ నిర్మాణానికి ఆయన చేసిన సాటిలేని కృషి భారతదేశ చరిత్రలో ఎప్పటికీ లిఖించి ఉంటుందన్నారు. ఖర్గే సోషల్ మీడియా వేదికపై ఇలా రాశారు.... నిస్సందేహంగా, చరిత్ర మిమ్మల్ని వినయంతో గౌరవిస్తుంది మన్మోహన్ సింగ్ జీ! మాజీ ప్రధాని మరణంతో, భారతదేశం ఒక దార్శనిక రాజకీయవేత్తను, నిష్కళంకమైన నాయకుడిని, అద్వితీయమైన ఆర్థికవేత్తను కోల్పోయింది. ఆయన ఆర్థిక సరళీకరణ విధానం, హక్కుల ఆధారిత సంక్షేమ నమూనా కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చింది. భారతదేశంలో మధ్యతరగతిని సృష్టించింది. కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసింది.

ప్రియాంక గాంధీ ఏమన్నారంటే?

మన్మోహన్ సింగ్ ఎప్పుడూ తమకు స్ఫూర్తిగా ఉంటారని ఎంపీ ప్రియాంకగాంధీ అన్నారు. ఆయనపై వ్యక్తిగత దాడులు చేసినా దేశం కోసం నిటారుగా నిలబడ్డారని అభిప్రాయపడ్డారు. "సర్దార్ మన్మోహన్ సింగ్ జీ మాదిరి రాజకీయాల్లో చాలా తక్కువ మంది మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారు. ఆయన నిజాయితీ ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా ఉంటుంది. ప్రత్యర్థుల వ్యక్తిగత దాడులకు గురైనప్పటికీ దేశానికి సేవ చేయాలనే నిబద్ధతతో స్థిరంగా ఉన్న వ్యక్తిగా ఈ దేశాన్ని నిజంగా ప్రేమించేవారిలో ఆయన ఎప్పటికీ నిలుస్తారు. ఆయన చివరి వరకు నిజమైన సమతావాదిగా, తెలివైన వ్యక్తిగా, దృఢ సంకల్పం ధైర్యంగా ఉంటూ రాజకీయ ప్రపంచంలో ప్రత్యేకమైన గౌరవప్రదమైన సున్నితమైన వ్యక్తిగా ఉన్నారు."  

రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌ను చించివేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చెప్పారు?

2013లో ‘కళంకిత ఎంపీలు, ఎమ్మెల్యేల’పై యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ‘అసంబద్ధం’ అంటూ చించివేశారు. అప్పుడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ అంశంపై రాహుల్‌ గాంధీతో మాట్లాడి ఆయన కోపానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను.

Also Read: లెక్చరర్‌ నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన మన్మోహన్ సంపాదించిన ఆస్తులెన్ని? ఆయన ఏం చదువుకున్నారు?

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget