Ajith Kumar : 'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్
Karur Stampede Incident : తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన కోలీవుడ్ స్టార్ అజిత్ స్పందించారు. ఈ ఘటనకు విజయ్‌ది మాత్రమే తప్పు కాదని మనందరం బాధ్యులమేనని అన్నారు.

Ajith Reaction On Karur Stampede Incident : తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనకు 'విజయ్' ఒక్కరిదే బాధ్యత కాదని... దీనికి మనందరం బాధ్యులమేనని అన్నారు కోలీవుడ్ స్టార్ అజిత్. రీసెంట్‌గా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఈ ఘటనపై స్పందించారు.
'ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది'
కరూర్ వంటి రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలని అజిత్ అన్నారు. 'దేశవ్యాప్తంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనకు విజయ్‌ది మాత్రమే బాధ్యత కాదు. మనందరిదీ కూడా. ఎవరినీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ముఖ్యంగా మీడియా ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాలి. ఇలాంటి గందరగోళ పరిస్థితులు కేవలం సినీతారల సభల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం లక్షల మంది వెళ్తారు.
వాళ్లంతా సురక్షితంగా బయటకు వస్తారు. కానీ, థియేటర్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దీని వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది.' అని అజిత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
#Ajithkumar about KARUR STAMPEDE:
— AmuthaBharathi (@CinemaWithAB) October 31, 2025
"There are so much happening in TN because of the stampede. That individual (@actorvijay) itself is not responsible. We all are responsible. We become so obsessed with crowd. It projects whole film industry in Bad light"pic.twitter.com/72idEuXJPe
కాగా... కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్ 27న కరూర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై టీవీకే అధినేత విజయ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధితులను ఆయన పరామర్శించలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత బాధితులను ఒక్కొక్కరినీ కలిసిన విజయ్ తన తరఫు నుంచి రూ.20 లక్షల పరిహారం అందించారు. అయితే, ఈ పరిహారాన్ని ఓ బాధితురాలు తిప్పి పంపించడం చర్చనీయాంశమైంది.
Also Read : 'మాస్ జాతర' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - మాస్ మహారాజ మూవీ ఏ ప్లాట్ ఫామ్‌లోకి వస్తుందంటే?





















