అన్వేషించండి
Advertisement
Morning Headlines: హైడ్రాకు మరింత బలం, జగన్ తిరుమల యాత్రపై వివాదం తప్పదా? ఇలాంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News Today:
1. హైడ్రాకు 169 మంది సిబ్బంది కేటాయింపు
జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు డిప్యుటేషన్‌పై హైడ్రా కోసం పని చేసేలా కేటాయింపు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి: రేవంత్‌రెడ్డి
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని పేర్కొన్నారు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు డ్రగ్స్ విష వలయంలో చిక్కుకుంటున్నారని.. ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదని స్పష్టం చేశారు. అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం మని సీఎం వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3.చంద్రబోస్‌కు సీఎం సత్కారం
టాలీవుడ్ సినీ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. తెలుగు సినిమా పాటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అవార్డు తెచ్చినందుకు చంద్రబోస్‌ను అభినందించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. 28న తిరుమలకు కాలినడకన జగన్
ఈనెల 28వ తేదీన తిరుమల శ్రీవారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దర్శించుకోనున్నారు. కాలి నడకన ఆయన తిరుమలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అదే రోజు పార్టీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్న సమయంలో తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో జగన్ తిరుమలకు వెళ్లడం చర్చనీయాంశమైంది . పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. జగన్ సంతకం పెట్టాలని డిమాండ్
28వతేదీన తిరుమల వెళ్తున్న జగన్.. మెట్ల మార్గంలో వెళ్తే కిందే సంతకం పెట్టాలని జనసేన, టీడీపీ డిమాండ్ చేశాయి. తిరుమల వెళ్లాక 17వ కంపార్ట్ మెంట్ లో రిజిస్టర్ ఉంటుందని... అన్య మతస్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే అందులో సంతకం పెట్టాలని గుర్తు చేశారు. అక్కడ సంతకం పెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగన్ తిరుమల యాత్రపై మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే జగన్ కచ్చితంగా రిజిస్టర్ లో సంతకం పెట్టాల్సిందే అన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. ఏపీలో IPSల బదిలీలు
రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్‌ను నియమించింది. పీ అండ్ ఎల్ ఐజీగా ఎం. రవిప్రకాశ్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, డీజీపీ కార్యాలయం డీఐజీ అడ్మిన్‌గా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ డీఐజీగా విజయరావు, శాంతిభద్రతల ఏఐజీగా సిద్దార్ధ కౌశల్‌ను బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. జనసేనలోకి బొత్స సోదరుడు?
విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. నకిలీ మహిళా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల హల్ చల్
హైదరాబాద్‌లో నకిలీ మహిళా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు హల్ చల్ చేశారు. ప్రముఖ హోటళ్లలో చెకింగ్ పేరుతో యజమానులను బెదిరింపులకు గురిచేసి అందినకాడికి దోచుకున్నారు. ఇద్దరు మహిళలపై అనుమానం వచ్చిన హోటల్ యజమానులు.. జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అసలు నిజం తెలిసి బిత్తరపోయారు. ఈ ఇద్దరు మహిళలను అధికారులు వల వేసి పట్టుకున్నారు. వీరి బాధితుల్లో ప్రముఖ హోటల్ ఉండడం గమనార్హం.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. రేప్ కేసుపై స్పందించిన హర్షసాయి
తనపై నమోదైన రేప్ కేసు వ్యవహారంపై ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి స్పందించారు. డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హర్షసాయి పేర్కొన్నారు. త్వరలో అన్ని నిజాలు బయటకొస్తాయని.. తన అడ్వొకేట్ అన్ని వివరాలూ తెలియజేస్తారని తెలిపారు. తానెంటో తన ఫాలోవర్స్ అందరికీ తెలుసు అని ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. రూ. 2.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఓ కంటైనర్ లో మహారాష్ట్ర కు భారీగా గంజాయిని తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. UK 08CB 5318 నం.గల కంటైనర్ లో 292 ప్యాకెట్లలో దాదాపుగా 900 కేజీల గంజాయి, సుమారుగా 2.25 కోట్ల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రైమ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement