Botcha Lakshman Rao : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Janasena మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. భవిష్యత్ రాజకీయాల కోసం బొత్సనే పంపిస్తున్నారని విజయనగరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
![Botcha Lakshman Rao : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స ! Botcha Satyanarayana family members to join the Jana Sena has become a hot topic Botcha Lakshman Rao : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/25/36d8ce4936a844c1ab750ff1d523ba8c1727257996555228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Botcha Satyanarayana family members to join the Jana Sena: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం జిల్లాలో వైసీపీ తిరుగులేని కుటుంబంగా ఉన్న బొత్స ఫ్యామిలీ నుంచి ఒకరు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణ్ రావు వచ్చే నెల మూడో తేదీన పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవితో ఆయన సమావేశం అయ్యారు. పార్టీలో చేరేందుకు అభ్యంతరాలు చెప్పవద్దని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది.
బొత్సను కాదని తమ్ముడు వేరే పార్టీ వైపు వెళ్తాడా ?
బొత్స కుటుంబం మొత్తం మొదటి నుంచి ఒకే మాట మీద ఉంటుంది. బొత్స సత్యనారాయణ ఏది చెబితే అదే. కుటుంబసభ్యులందరికీ రాజకీయ అవకాశాలు ఇప్పించడంలో ఆయన ముందు ఉంటారు. గత ఎన్నికల్లో ఆయన .. ఆయన భార్య ఝాన్సిలక్ష్మితో పాటు ఇద్దరు సోదరులు, మరో మేనల్లుడు కూడా పోటీ చేశారు. అయితే ఎవరూ విజయం సాధించలేదు.అందరూ ఓడిపోయారు. కానీ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఏకగ్రీనంగా ఎన్నికై.. ఎమ్మెల్సీ అయ్యారు. మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
మోహన్ బాబు ఇంట్లో దొంగతనం... చేసింది ఎవరు? డబ్బులతో ఎక్కడికి పారిపోయాడంటే?
సైలెంట్ గా ఉంటున్న బొత్స సత్యనారాయణ
వైసీపీ ఓడిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ సైలెంట్ గా ఉంటున్నారు. ఎప్పుడో ఓ సారి ప్రెస్మీట్లు పెట్టడం తప్ప పెద్దగా స్పందించడం లేదు. వైఎస్ఆర్‌సీపీకి ఉత్తరాంధ్రలో భవిష్యత్ ఉంటుందో ఉండదోనన్న భయంతో వైసీపీ నేతలు ఉన్నారు. దీనికి కారణం కూటమి నేతలకు వచ్చిన మెజార్టీలే. కనీసం యాభై వేలకు తగ్గకుండా మెజార్టీలు వచ్చాయి. విశాఖ ఎంపీగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్యా ఝాన్సీ లక్ష్మి ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ ఇప్పుడల్లా కోలుకుంటుందన్న నమ్మకం లేకపోవడం వల్ల.. ఇతర పార్టీల్లో ఇప్పటి నుంచి మార్గం సుగమం చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
వైసీపీ పరిస్థితి దిగజారితే ఇక జనసేనలోకే !
బొత్స సత్యనారాయణ సీజనల్ పొలిటిషియన్. ఆయనకు విధేయతలు అంటే.. ఆయన రాజకీయ ప్రయోజనాలను బట్టే ఉంటాయి. కాంగ్రెస్‌లో ఉండి వైఎస్‌కు విధేయంగా ఉన్నా.. సొంత కుటుంబసభ్యుల పదవుల కోసం ఆయన రాజీ పడలేదు. అలాగే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ పై , ఆయన తల్లిపై ఘాటు విమర్శలు చేశారు. తర్వాతవైసీపీలోచేరారు. ఆయన అమరావతిపై, చంద్రబాబుపై విమర్శలు చేశారు. గతంలో ఆయన వచ్చే ఉగాదికి టీడీపీ ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీరాగా ఉగాది వచ్చే సరికి టీడీపీ అధికారంలో ఉంది. ఇలా ఆయన తన రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగానే రాజకీయం చేస్తూంటారు. వైసీపీతో లాభం ఉండదని.. అనకుంటే ఆయన జనసేనలోకి వెళ్లిపోవడానికి రెడీగా ఉంటారని.. భవిష్యత్ రాజకీయాల కోసం సోదరుడ్ని జనసేనలోకి పంపుతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)