అన్వేషించండి

YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్

Tirumala Laddu Controversy | ఏపీలో మొదలైన తిరుమల లడ్డూ వివాదం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

YS Jagan Mohan Reddy likely to visit Tirumala soon| లడ్డూ వివాదం దుమారం రేపుతున్న సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శంచుకోనున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఆలయాల శుద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ సెప్టెంబర్ 28న పాప ప్రక్షాళణ పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల అంశంలో చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళణగా పూజలు చేస్తామని జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తిరుమల అంశంపై ప్రజల్లో తమపై వ్యతిరేకత వస్తున్నందున, హిందూ సాంప్రదాయాలకు తాము వ్యతిరేకం కాదని నిరూపించేందుకు కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీయాలని ఏపీ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ (TTD) పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అభిప్రాయపడ్డారు. తిరుమల వెంకటేశ్వరస్వామిపై, పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారంతో శ్రీవారి విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు.. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు సెప్టెంబరు 28న ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొనాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తుండగా.. వైసీపీ శ్రేణులు పాప ప్రక్షాళన పూజలు చేయాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఈనెల 28న తిరుమలకు మాజీ సీఎం జగన్‌

తాడేపల్లి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. సెప్టెంబర్ 27న శుక్రవారం రాత్రికి జగన్ తిరుమలకు చేరుకుంటున్నారు. సెప్టెంబరు 28న శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Also Read: Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Hyundai Discount: హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Hyundai Discount: హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
NASA: ఐడియా చెప్పండి, రూ.16 లక్షలు పట్టుకెళ్లండి - వారికి నాసా బంపరాఫర్
ఐడియా చెప్పండి, రూ.16 లక్షలు పట్టుకెళ్లండి - వారికి నాసా బంపరాఫర్
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Embed widget