IPS Transfers: ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
Andhra Pradesh IPS Transfers: ఏపీలో 16మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. 14మందికి కొత్త పోస్టింగ్ లు ఇవ్వగా, ఇద్దర్ని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేశారు.
AP IPS Transfers: ఏపీలో మరోసారి పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. 16మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 14 మందికి పోస్టింగ్ లు ఇవ్వగా.. ఇద్దర్ని మాత్రం డీజీపీ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న కొందరికి ఈసారి పోస్టింగ్ లు రావడం విశేషం.
బదిలీ జాబితా ప్రకారం కొత్త ర్యాంక్ లు - అధికారుల పేర్లు
సీఐడీ ఐజీ - వినీత్ బ్రిజ్ లాల్
పి అండ్ ఎల్ ఐజీ - రవిప్రకాష్
ఇంటెలిజెన్స్ ఐజీ - PHD రామకృష్ణ
ఇంటెలిజెన్స్ ఎస్పీ - ఫకీరప్ప
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీ - ఆరిఫ్ హఫీజ్
అడ్మినిస్ట్రేషన్ డీఐజీ - అమ్మిరెడ్డి
రోడ్ సేఫ్టీ డీఐజీ - CH విజయరావు
డీజీపీ ఆఫీస్ ఏఐజీ - సిద్ధార్ధ్ కౌశల్
విశాఖ సిటీ డీసీపీ - మేరీ ప్రశాంతి
అనకాపల్లి ఎస్పీ - తుహిన్ సిన్హా
కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ - M దీపిక
ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (PTC) ప్రిన్సిపల్ - GR రాధిక
PTO ఎస్పీ - KSSV సుబ్బారెడ్డి
విజయవాడ క్రైమ్ డీసీపీ - తిరుమలేశ్వర్ రెడ్డి
ఇద్దరు అధికారుల్ని మాత్రం డీజీపీ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు. అట్టాడ బాపూజీ, KV శ్రీనివాసరావుకి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Also Read: బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను శాఖాధిపతులుగా నియమిస్తూ.. జాయింట్ కలెక్టర్లు, ఇతర పోస్టింగ్ ల్లో ఉన్న యంగ్ ఆఫీసర్లను జిల్లాలకు కలెక్టర్లుగా నియమించారు సీఎం చంద్రబాబు. ఇక జిల్లా ఎస్పీలకు కూడా అదే తరహాలో బదిలీలు జరిగాయి. సీనియర్లకు పదోన్నతులు కల్పిస్తూ.. కొత్త బ్యాచ్ ల వారిని జిల్లాలకు ఎస్పీలుగా పంపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో(SEB)ని రద్దు చేశారు. SEB ని ఎక్సైజ్ శాఖలో విలీనం చేశారు. దీంతో SEB బాస్ కి కూడా బదిలీ తప్పలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల్ని ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పటి వరకు పోస్టింగ్ లు ఇవ్వలేదు. పోస్టింగ్ లు ఇవ్వకుండా పక్కనపెట్టిన వారిలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఇటీవల ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి ఇప్పుడు పోస్టింగ్ లు ఇచ్చారు. తాజా బదిలీ ఉత్తర్వుల్లో ఇద్దరిని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేయడం మరో విశేషం.
ఇక ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ వైసీపీ ఆరోపణలు తెలిసిందే. పోలీస్ అధికారుల్ని బదిలీల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేతలంటున్నారు. ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో కూడా ఐపీఎస్ లను ఉద్దేశపూర్వకంగానే ఇప్పంది పెట్టారని, కావాలనే సస్పెండ్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ కేసులో నిందితురాలైన జత్వానీకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని వైసీపీ విమర్శిస్తోంది. ప్రస్తుతానికి ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు పూర్తయినట్టేనా.. మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయా..? వేచి చూడాలి.
Also Read: ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ - మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరికల సంకేతం అదేనా ?