అన్వేషించండి

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు- తెలంగాణలో కాంగ్రెస్‌ నయా నినాదం

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

తలనొప్పిగా కుమ్ములాటలు

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీలో వర్గ విబేధాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలోనే సీఎం జగన్ సీటు ఫలానా వారికేనని తేల్చేసి అందరిముందూ సమస్యకూ పరిష్కారం చూపించేసినా ఇప్పుడు కొంత మంది నేతలు తెరపైకి వస్తున్నారు. అవసరమైతే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటున్నారు కానీ తగ్గడం లేదు. ఇలాంటివి చాలా నియోజకవకర్గాల్లో ప్రారంభమయ్యాయి. వీటికి మొదట్లోనే చెక్ పెట్టాలని వైసీపీ వ్యూహకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటివి పెరిగిపోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

భారీ వర్ష సూచన

ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

కాంగ్రెస్‌ బీసీ వ్యూహం

తెలంగాణలో సానుకూల వాతావరణం ఉందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ముఖ్యంగా సామాజికవర్గ సమీకరణాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది.   బీసీ ఓట్ బ్యాంక్‌పై కాంగ్రెస్  గురి పెట్టింది. ఇందుకోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 30న పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ  తెలంగాణలో పర్యటించనున్నారు. ఆమెతో బీసీ డిక్లరేషన్ ప్రియాంక ప్రకటింపచేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

హైదరాబాద్‌లో కుండపోత 

కుండపోత వర్షం హైదరాబాద్‌ వాసులకు చుక్కలు చూపించింది. సాయంత్రం చాలా మంది పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే టైంలో పడిన వర్షంతో నగర ప్రజలు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎటు చూసిన వర్షపు నీరు, వాహనాల బారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పు

బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం తెలంగాణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల స్కూళ్లకు సెలవు సైతం ఇచ్చారు. తాజాగా విద్యా సంస్థల పనివేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రైమరీ స్కూల్ వాళ్లకు (1 నుండి 5వ తరగతి వరకు) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల స్కూల్ టైమ్ నిర్ణయించారు. ఉన్నత ప్రాథమిక పాఠశాల అంటే 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల స్కూల్ టైమింగ్స్ ను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటలుగా నిర్ణయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పనివేళల్లో మార్పులు అమలులోకి వస్తాయని రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

అప్పుల్లో ఏపీ టాప్

తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తూనే ఉంటారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు కేసీఆర్ అని సెటైర్లు వేస్తుంటారు. అయితే తెలంగాణ అప్పుల వివరాలను లోక్​సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ లిఖిత పూర్వకంగా తెలిపారు. మార్చి 2023 నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ మొత్తం అప్పులు రూ 3,66,306 కోట్లు (3 లక్షల 66 వేల 3 వందల 6 కోట్ల రూపాయలు) ఉన్నట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

వర్షార్పణం

సోమవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆఖరి రోజులు ఎనిమిది వికెట్లు తీసి విజయం సాధించాలనుకున్న టీమిండియా వ్యూహాన్ని వరుణుడు దెబ్బతీశాడు. 2-0తో సిరీస్ వైట్‌వాష్‌ చేయాలనుకున్న రోహిత్‌ ప్రయత్నానికి కుండపోత వర్షం అడ్డుకట్ట వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

నెట్‌ లేక యాతన
హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికిపోతోంది. రోజుకో దారుణమైన ఘటనతో వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడటం, స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను సజీవ దహనం చేయడం లాంటి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో చెలరేగిన ఈ హింసను కట్టడి చేయడంలో భాగంగా మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. గత 80 రోజుల నుంచి మణిపూర్ లో అంతర్జాల సేవలు లేవు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంటర్నెట్ లేకపోవడం అంటే.. ప్రపంచంలో, మన దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అలాంటిది దాదాపు 3 నెలలుగా ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

చంద్రయాన్ లేటెస్ట్ అప్‌డేట్

భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ- ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-3. జులై 14వ తేదీన శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్-3. జులై 20, 2023 న 4వ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం భూమి చుట్టూ 71351కి.మీ X 233 కి.మీ కక్ష్యలో చంద్రయాన్ -3 పరిభ్రమిస్తున్నట్లు ఇస్రో ధృవీకరించింది. క్రమంగా కక్ష్యను పెంచుకుంటూ ప్రణాళికాబద్ధంగా ప్రయోగం సాగుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. జులై 14వ తేదీన ప్రయోగం చేపట్టగా.. జులై 15వ తేదీన మొదటి కక్ష్యలోకి చేరుకుంది. జులై 16వ తేదీన రెండో కక్ష్యలోకి ప్రవేశించింది. జులై 18వ తేదీన మూడోది, జులై 20వ తేదీన 4వ కక్ష్యలోకి ప్రవేశించి భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది చంద్రయాన్-3. ఒక్కో కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో ఇంజిన్ ను కాస్తంత ఎక్కువగా మండించి క్రమంగా భూమి నుంచి దూరం జరుగుతూ వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

పాన్‌ ఇండియా స్టార్లకు టెన్షన్

ఇటీవల కాలంలో దక్షిణాది చిత్రాలు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. మన సినిమాల దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ నిలబడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ సౌత్ హీరో కూడా తమ సినిమాలను అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేసి మార్కెట్ విస్తరించుకోవాలని చూస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే అలాంటి స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న హీరోలు మాత్రం కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Embed widget