అన్వేషించండి

Manipur Violence: 80 రోజులుగా మణిపూర్‌లో నో ఇంటర్నెట్- ఆన్‌లైన్ చదువుల్లేవు, ఈ-లావాదేవీల్లేవు

Manipur Violence: మణిపూర్ లో గత 80 రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. త్వరలో ఈ సస్పెన్షన్ ను ఎత్తివేసే ఆలోచనలో కూడా సర్కారు లేదు.

Manipur Violence: హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికిపోతోంది. రోజుకో దారుణమైన ఘటనతో వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడటం, స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను సజీవ దహనం చేయడం లాంటి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో చెలరేగిన ఈ హింసను కట్టడి చేయడంలో భాగంగా మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. గత 80 రోజుల నుంచి మణిపూర్ లో అంతర్జాల సేవలు లేవు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంటర్నెట్ లేకపోవడం అంటే.. ప్రపంచంలో, మన దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అలాంటిది దాదాపు 3 నెలలుగా ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు.

ప్రస్తుతం మణిపూర్ లో పాఠశాలలు, విద్యా సంస్థలు కూడా తెరచుకోకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ చదువులకు విద్యార్థులంతా అలవాటు పడిపోయారు. కానీ అంతర్జాలం లేకపోవడంతో క్లాసులు వినలేని పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్ లేకపోవడంతో రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతర్జాలం లేకపోవడంతో ఆన్‌లైన్ లావాదేవీలు కూడా చేసుకోలేని పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ లేకపోవడంతో ఈ-లావాదేవీలు చేసుకోలేని పరిస్థితి. అలాగే ఏటీఎంలు, బ్యాంకింగ్ సేవలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. 

అందమైన రాష్ట్రంలో అలజడి..

22,327 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 30 లక్షల మంది జనాభా. మూడు తెగల ప్రజలు. ఇదీ క్లుప్తంగా మణిపూర్‌. మణిపూర్ (Manipur) అంటే బంగారు భూమి అని అర్థం. ముత్యాల నేల అని కూడా అంటారు. అంత అందమైందీ ప్రాంతం. ఈ రాష్ట్రంలో మొత్తం 39 తెగలున్నాయి. వీరిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. ఇన్ని తెగలున్నప్పటికీ మెజార్టీ మాత్రం మైతేయి వర్గానిదే. 50%కిపైగా ఈ తెగ వాళ్లే ఉన్నారు. 43% మంది కుకీలు, నాగాలున్నారు. మైతేయిని మెజార్టీ కమ్యూనిటీ కాగా..కుకీలు, నాగాలు మైనార్టీలు. ఇప్పుడు గొడవ జరుగుతోంది మైతేయి, కుకీల మధ్య. మైతేయిలకు షెడ్యూల్ తెగ (ST)హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఎప్పుడైతే ప్రభుత్వానికి సూచించిందో అప్పటి నుంచి నిప్పు రాజుకుంది. అది క్రమంగా రాష్ట్రాన్ని మంటల్లోకి నెట్టేసింది.

ఇప్పుడు ST హోదా అనేది కేవలం ఓ కారణమే అయినా...మైతేయిలకు, కుకీలకు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మైతేయి తెగ అధీనంలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని కుకీలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో నిజానిజాలెంత అన్నది పక్కన పెడితే వాళ్లలో ఈ ఆలోచన బలంగా నాటుకుపోయింది. తమపై వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు కుకీలు. "మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. మమ్మల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారు" అని పలు సందర్భాల్లో కుకీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతంలో కుకీలదే మెజార్టీ. అక్కడ మైతేయి వర్గ ఆధిపత్యాన్ని అసలు సహించరు కుకీలు. మైతేయిలకు ST హోదా వస్తే ఈ కొండ ప్రాంతాల్లోని భూములనూ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అంటే తమ "ఉనికి" కోల్పోతామని కుకీలకు భయం పట్టుకుంది. ఈ భయం నుంచే ఘర్షణ మొదలైంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vontimitta: ఒంటిమిట్ట చెరువులో 600 అడుగుల కోదండ రాముడు! జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి!
ఒంటిమిట్ట చెరువులో 600 అడుగుల కోదండ రాముడు! జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి!
Telangana Local Elections: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
Tirumala Brahmotsavam 2025: ‘ఉంది పాపిలాన్‌.. వద్దు పరేషాన్‌’: తిరుమల బ్రహ్మోత్సవాల్లో దొంగలకు టెక్నాలజీతో చెక్‌  
‘ఉంది పాపిలాన్‌.. వద్దు పరేషాన్‌’: తిరుమల బ్రహ్మోత్సవాల్లో దొంగలకు టెక్నాలజీతో చెక్‌  
Maruti Festive Offers: పండక్కి కారు కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌ - GST తగ్గింపుతో మారుతి కార్లపై ₹1.30 లక్షల వరకు డిస్కౌంట్‌
బైక్‌ వదిలేసి కారు కొనే టైమ్‌ వచ్చింది, కొత్త GSTతో మారుతి ధరలు ₹1.30 లక్షలు డౌన్‌
Advertisement

వీడియోలు

Pakistan vs Sri Lanka Asia Cup 2025 | డూ ఆర్ డై మ్యాచ్ లో స‌త్తా చాటిన పాక్
India vs Bangladesh Preview Asia Cup 2025 | నేడు బాంగ్లాదేశ్ తో తలపడనున్న ఇండియా
Arjun Tendulkar vs Samit Dravid | సమిత్ ద్రవిడ్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్
Abrar Ahmed vs Wanindu Hasaranga Asia Cup 2025 | అహ్మద్ vs హసరంగా
Sports Tales | గ్యాంగ్‌స్టర్స్‌ని జెంటిల్‌మెన్‌గా మార్చిన క్రికెట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vontimitta: ఒంటిమిట్ట చెరువులో 600 అడుగుల కోదండ రాముడు! జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి!
ఒంటిమిట్ట చెరువులో 600 అడుగుల కోదండ రాముడు! జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి!
Telangana Local Elections: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
Tirumala Brahmotsavam 2025: ‘ఉంది పాపిలాన్‌.. వద్దు పరేషాన్‌’: తిరుమల బ్రహ్మోత్సవాల్లో దొంగలకు టెక్నాలజీతో చెక్‌  
‘ఉంది పాపిలాన్‌.. వద్దు పరేషాన్‌’: తిరుమల బ్రహ్మోత్సవాల్లో దొంగలకు టెక్నాలజీతో చెక్‌  
Maruti Festive Offers: పండక్కి కారు కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌ - GST తగ్గింపుతో మారుతి కార్లపై ₹1.30 లక్షల వరకు డిస్కౌంట్‌
బైక్‌ వదిలేసి కారు కొనే టైమ్‌ వచ్చింది, కొత్త GSTతో మారుతి ధరలు ₹1.30 లక్షలు డౌన్‌
AP DSC Recruitment: పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
Asia Cup 2025 Team India In Final: ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
OG Yakuza Gangs: ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది.  ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది. ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
OG Movie Review - 'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?
'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget