News
News
వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: కేసీఆర్ మౌనానికి కారణమేంటి? గుజరాత్ టైటాన్స్‌కు  షాక్‌ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్- నేటి టాప్‌ టెన్ న్యూస్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today: 

మౌనమేలనోయి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలు ప్రారంభించిన కేసీఆర్.. జాతీయ అంశాలపై మాత్రం పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. విపక్ష కూటముల సమావేశాల్లో పాలు పంచుకోవడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు కూడా ప్రకటించలేదు.  గత మూడు, నాలుగు రోజులుగా చాలా అంశాలపై బీజేపీపై పోరాడుతున్న నేతలంతా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం నోరు తెరవడం లేదు. చివరికి ఆప్తమిత్రుడు కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినా మద్దతుగా ఒక్క  ప్రకటన చేయలేదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఉక్కపోత తగ్గేదేలే

ఉత్తర - దక్షిణ ద్రోణి విదర్భ నుండి మరోత్వాడ మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meterology Center) అధికారులు ఓ ప్రకటనలో మంగళవారం (మే 23) తెలిపారు. దీంతో రాగల మూడు రోజులు ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు (Rains in Telangana) అక్కడక్కడ  కురిసే  అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు  41 నుండి 43 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్, చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు  38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ) తో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

విద్యా దీవెన 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. బుధవారం సీఎం పర్యటన కారణంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపుగా రాకపోకల విషయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం కొవ్వూరు రానున్నారు.  ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కే.మాధవీలత సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లును జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. హెలీప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు 2.1 కిలోమీటర్లు వరకు ముఖ్యమంత్రి రోడ్‌షో లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా రూట్‌ మ్యాప్‌ పరిశీలించి ఆ రోడ్డు మార్గాన్ని కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద కూడా మెడికల్‌ క్యాంపులు, తాగునీటి వసతి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం చేయూత

ఎస్సీ విద్యార్దులకు విశాఖలో మరో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలు కాకుండా అదనంగా మరో శిక్షణా కేంద్రాన్ని విశాఖ జిల్లాలోని మధురవాడలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ భ్రమలో ఉండొద్దు

ఈ ప్రపంచంలో మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్నే గడుపుతున్నారని అనుకుంటున్నారా? అయితే, మీరు భ్రమలో ఉన్నట్లే. మనకు చాలా మంచి చేసే అలవాట్లు ఉన్నాయని, ఆరోగ్యవంతమైన అలవాట్లతో జీవిస్తున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ అలవాట్లే మీ ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్నిచూపుతున్నాయన్నా అవగాహన ఉండదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ రాశులవారు ఈరోజు అనుకోని ప్రయోజనం పొందుతారు

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. కొన్ని పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కొత్త వ్యాపార ప్రణాళికను రూపొందించడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. శత్రువులు కొన్ని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు అప్రమత్తంగా ఉండాలి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

వాషింగ్టన్ సుందర్, వర్షిణీ సౌందర్ రాజన్ పై పుకార్లు

హీరోయిన్లతో క్రికెటర్లు ప్రేమలో పడటం కొత్త ఏమీ కాదు. అందులో కొన్ని ప్రేమలు పెళ్లి పీటల వరకు వెళ్లాయి. కొన్ని ప్రేమలు కేవలం పుకార్లుగా మాత్రమే మిగిలాయి. ఇటీవల కాలంలో క్రికెటర్ కె.ఎల్. రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె & హీరోయిన్ అతియా శెట్టి జంట పెళ్లి పీటలు ఎక్కింది. అంతకు ముందు విరాట్ కోహ్లీ & అనుష్కా శర్మ వంటి జంటలు ఉన్నాయి. ఆ జాబితాలోకి యంగ్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, వర్షిణీ సౌందర్ రాజన్ చేరతారో? లేదో? గానీ... వాళ్ళ మీద చాలా కామెంట్స్ వినబడుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గుజరాత్ టైటాన్స్‌కు  చెన్నై సూపర్ కింగ్స్ షాక్‌

ఐపీఎల్-16 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు  చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. స్వంత గ్రౌండ్ (చెపాక్)లో బ్యాటర్లు విఫలమైనా  బౌలర్లు రాణించి  ఆ జట్టును ఈ లీగ్‌లో పదోసారి ఫైనల్స్‌కు చేర్చారు.  చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్.. ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ధోనీ సేన.. 15 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టీమ్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో  42, 4 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30,  3 ఫోర్లు, 2 సిక్సర్లు) భయపెట్టినా చెన్నై విజయాన్ని ఆపలేకపోయారు.  ఈ విజయంతో  ధోనీ సేన ఫైనల్‌కు చేరగా  గుజరాత్ టైటాన్స్..  ముంబై - లక్నో మధ్య జరిగే  మ్యాచ్ లో విజేతతో  రెండో క్వాలిఫయర్ (మే 26) ఆడుతుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మే 25న ఎంసెట్ ఫలితాలు

తెలంగాణలో ఎంసెట్ ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. మే 25న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ డా. బి.డీన్‌ కుమార్‌ మే 23న ఒక ప్రకటనలో తెలిపారు. మే 25న ఉదయం 11 గంటలకు కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

షెడ్యూలు ఇలా!

తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మరో రెండు నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే 23న ప్రకటించింది. వీటిలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ (యూఎల్‌బీ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ నియామక పరీక్షను ఆగస్టు 8న రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అదేవిధంగా జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 10 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో నియామక పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Published at : 24 May 2023 08:09 AM (IST) Tags: AP news today Telangana LAtest News Todays latest news Top 10 headlines today Telugu Top News Website Top Telugu News Website Top 10 Telugu News

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు-  షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు- షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్

Coromandel Train Accident: వెనక నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయ్, కాసేపు స్పృహలోనే ఉన్నాను - కోరమాండల్ డ్రైవర్

Coromandel Train Accident: వెనక నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయ్, కాసేపు స్పృహలోనే ఉన్నాను - కోరమాండల్ డ్రైవర్

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!

AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!