Varshini - Washington Sundar : వర్షిణి ప్రేమలో సుందర్! - తన కంటే ఆరేళ్లు చిన్నోడితో డేటింగ్?
క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, హీరోయిన్ వర్షిణి డేటింగులో ఉన్నారా? అంటే... సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ చూస్తే ఆ విధంగా ఉన్నాయి.
హీరోయిన్లతో క్రికెటర్లు ప్రేమలో పడటం కొత్త ఏమీ కాదు. అందులో కొన్ని ప్రేమలు పెళ్లి పీటల వరకు వెళ్లాయి. కొన్ని ప్రేమలు కేవలం పుకార్లుగా మాత్రమే మిగిలాయి. ఇటీవల కాలంలో క్రికెటర్ కె.ఎల్. రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె & హీరోయిన్ అతియా శెట్టి జంట పెళ్లి పీటలు ఎక్కింది. అంతకు ముందు విరాట్ కోహ్లీ & అనుష్కా శర్మ వంటి జంటలు ఉన్నాయి. ఆ జాబితాలోకి యంగ్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, వర్షిణీ సౌందర్ రాజన్ చేరతారో? లేదో? గానీ... వాళ్ళ మీద చాలా కామెంట్స్ వినబడుతున్నాయి.
వర్షిణీ ప్రేమలో సుందర్!?
తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్, ఐపీఎల్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), తెలుగు టీవీ షోలు & సినిమాలతో పేరు తెచ్చుకున్న వర్షిణీ సౌందర్ రాజన్ (Varshini Sounderajan) ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ఖబర్!
సోషల్ మీడియాలో వర్షిణి ఫోటోలు పోస్ట్ చేయడమే ఆలస్యం... సుందర్ గురించి వెంటనే ఒక్క కామెంట్ అయినా ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు కొన్నిటికి వర్షిణి అటెండ్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ కోసమే ఆమె స్టేడియంకు వెళ్ళారని కామెంట్లు వినబడుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే... వర్షిణి హాజరైన ప్రతి మ్యాచ్ కూడా సన్ రైజర్స్ ఓటమి చెందింది. దాంతో ఆమెది ఐరన్ లెగ్ అని కొందరు ఆమెను ఆడిపోసుకుంటున్నారు. 'సుందర్ ని బాగా పట్టావ్', 'మొత్తానికి డైలీ స్టేడియంకి వెళ్లి సుందర్ మావని పట్టావ్ గా' అని కొందరు కామెంట్ చేశారు.
వర్షిణి కంటే ఆరేళ్ళు చిన్న!
ఇటు వర్షిణి, అటు సుందర్... ఇద్దరి మూలాలు తమిళనాడులో ఉన్నాయి. వాళ్ళు ఇద్దరూ తమిళ కుటుంబాల్లో జన్మించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... వయసు చూస్తే, వర్షిణి కంటే సుందర్ చాలా చిన్నవాడు. ఇప్పుడు అతని వయసు 23 ఏళ్ళు. గూగుల్ ప్రకారం వర్షిణి వయసు 29 ఏళ్ళు. ప్రేమకు వయసుతో సంబంధం ఏం ఉంది చెప్పండి? ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ తన కంటే వయసులో ఐదేళ్లు పెద్దైన అంజలిని చేసుకున్నారు కదా! ఇండియన్ క్రికెట్ దేవుడిని సుందర్ ఫాలో అవుతున్నారేమో!?
ఆల్రెడీ వర్షిణికి ఓ బ్రేకప్ స్టోరీ ఉందండోయ్!
ఇప్పుడు వర్షిణి పేరు చెబితే తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలా మంది గుర్తు పడతారు. డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఇంకొన్ని షోస్ కూడా చేశారు. అయితే... టీవీ షోస్ కంటే ముందు షామిలి పేరుతో సినిమాలు చేశారు. 'బెస్ట్ యాక్టర్స్' చేసినప్పుడు, ఆ సినిమా దర్శకుడు అరుణ్ పవర్ ప్రేమలో ఉన్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కుతారని కూడా వినిపించింది. ఏమైందో ఏమో? కొన్నాళ్ళకు ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పారు. సినిమాలపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు.
Also Read : హీరోల స్టార్‌డమ్, హీరోయిన్ రోల్స్‌పై శ్రీలీల ఓపెన్ కామెంట్స్
టీవీ షోలకు యాంకరింగ్ మానేసిన తర్వాత సుమంత్ 'మళ్ళీ మొదలైంది' సినిమా చేశారు వర్షిణి. సమంత 'శాకుంతలం' సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించారు. సినిమాలతో కంటే డేటింగ్ పుణ్యమా అంటూ ఎక్కువసేపు వార్తల్లో ఉంటున్నారు. ఎంత మంది కామెంట్ చేస్తున్నా సరే... అవును అని గానీ, కాదు అని గానీ వర్షిణి రిప్లై ఇవ్వడం లేదు. మౌనంగా ఉంటున్నారు.
Also Read : రంగమ్మత్తను మర్చిపోయేలా సుమతి క్యారెక్టర్ - అనసూయ మామూలుగా ఏడిపించదు!