News
News
వీడియోలు ఆటలు
X

Sreeleela : హీరోల స్టార్‌డమ్, హీరోయిన్ రోల్స్‌పై శ్రీలీల ఓపెన్ కామెంట్స్

ఒకట్రెండు కాదు, ఇప్పుడు శ్రీలీల ఏకంగా 8 తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ టైంలో ఎటువంటి వివాదాల జోలీకి ఆమె వెళ్లదలుచుకున్నట్లు లేరు. హీరోల స్టార్‌డమ్, హీరోయిన్ రోల్స్ మీద ఓపెన్ కామెంట్స్ చేశారు.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీ లీల (Sreeleela). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? పూజా హెగ్డేతో పాటు శ్రీలీలదీ సమానమైన పాత్ర అని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ రెండూ మాత్రమే కాదు... బాలకృష్ణ 108వ సినిమాలో కీలక పాత్రతో పాటు రామ్ - బోయపాటి శ్రీను సినిమా, విజయ్ దేవరకొండ కొత్త సినిమా, పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', నితిన్ కొత్త సినిమాలు చేస్తున్నారు శ్రీ లీల. 

ఇప్పుడు తెలుగులో శ్రీ లీల క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అందరి సినిమాల్లోనూ ఆమె కనబడుతోంది. ఇంకా బోలెడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ సమయంలో శ్రీ లీల ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదని భావిస్తున్నట్లు ఉన్నారు. ఆచి తూచి మాట్లాడుతున్నారు. కమర్షియల్ సినిమాల్లో కథానాయికలకు ప్రాముఖ్యం చాలా తక్కువ ఉంటుందని కొంత మంది నుంచి ఎప్పుడూ వినిపించే విమర్శ. ఈ ప్రస్తావన శ్రీ లీల దగ్గర తీసుకు రాగా...

హీరోలను చూసే టికెట్స్ కొంటున్నారు - శ్రీ లీల
''మనమంతా నిజాయతీగా మాట్లాడుకుందాం! ఇవాళ్టికి, ఈ రోజుకూ హీరోలను చూసే ప్రేక్షకులు రిలీజ్ డే టికెట్స్ కొంటున్నారు. చిత్రసీమలో నేను కొత్తగా అడుగు పెట్టిన కథానాయికని. సినిమా అంతా నేనే కనిపించాలని, నేను స్పాట్‌లైట్‌లో ఉండాలని చెప్పలేను. సినిమాకు వేల్యూ యాడ్ చేసే క్యారెక్టర్స్, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే రోల్స్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు'' అని శ్రీ లీల చెప్పారు. పరోక్షంగా కమర్షియల్ సినిమాల్లో కథానాయిక పాత్రలు తనకు ఇష్టమేనని ఇండస్ట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఆ జాగ్రత్త తీసుకుంటున్నా... - శ్రీ లీల
కమర్షియల్ కథానాయకులతో సినిమాలు చేస్తున్న శ్రీ లీల... ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నానని చెప్పారు. లుక్స్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు డిఫరెన్స్ చూపించాలని ట్రై చేస్తున్నట్లు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ లీల తెలిపారు. నిజం చెప్పాలంటే... ఇప్పుడు ఆమె ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండటం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో కంటే సెట్స్, షూటింగ్ లొకేషన్లలో ఎక్కువ సేపు ఉంటున్నారు. ఈ విధంగా షూటింగ్ చేయడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నాని, కెమెరా ముందు ఉండటం తనకు ఇష్టమేనని శ్రీ లీల తెలిపారు. 

Also Read : కన్నడ దర్శకుడితో బాలకృష్ణ, రజనీకాంత్ పాన్ ఇండియా మల్టీస్టారర్!?

ఎంబీబీస్ చేస్తున్న అందాల భామ
సినిమాల్లో ఫుల్ బిజీ కావడానికి ముందు శ్రీ లీల ఎంబీబీస్ జాయిన్ అయ్యారు. అది పూర్తి చేయాలని ఇంట్లో తనను ఏమీ ఫోర్స్ చేయడం లేదని ఆమె వివరించారు. ఓ వైపు సినిమా షూటింగులు, మరో వైపు కాలేజ్ అటెండ్ కావడం కష్టమని ఆమె తెలిపారు. తన తల్లి డాక్టర్ కాబట్టి తాను ఏమీ ఎంబీబీస్ జాయిన్ కాలేదని శ్రీ లీల చెప్పారు. త్వరలో చదువును, సినిమాలను బ్యాలన్స్ చేస్తానని అన్నారు.   

Also Read : రంగమ్మత్తను మర్చిపోయేలా సుమతి క్యారెక్టర్ - అనసూయ మామూలుగా ఏడిపించదు!

Published at : 23 May 2023 02:13 PM (IST) Tags: NBK 108 Movie ustaad bhagat singh Sreeleela Sreeleela upcoming movies Commercial Movies Heroine Roles Sreeleela New Movie Sreeleela Next Movie

సంబంధిత కథనాలు

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్