TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ జేఎల్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల తేదీలు వెల్లడి! షెడ్యూలు ఇలా!
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మరో రెండు నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ మే 23న ప్రకటించింది. అకౌంట్స్ ఆఫీసర్స్, జూనియర్ లెక్చరర్ పరీక్షల తేదీలను వెల్లడించింది.
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మరో రెండు నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 23న ప్రకటించింది. వీటిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్ (యూఎల్‌బీ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ నియామక పరీక్షను ఆగస్టు 8న రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టులకు సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 10 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో నియామక పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 78
1) అకౌంట్స్ ఆఫీసర్: 01
2) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 13
3) సీనియర్ అకౌంటెంట్: 64
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (కామర్స్ - డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
జూనియర్ లెక్చరర్ పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 1392
మల్టీ జోన్-1: 724 పోస్టులు
- ఆసిఫాబాద్-కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
- కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
- కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూలర్)
మల్టీ జోన్-2: 668 పోస్టులు
- సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి-యాదాద్రి, జనగామ
- మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
- మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
Also Read:
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ పిటిషన్లు, విచారణకు స్వీకరించిన హైకోర్టు
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన పరీక్షను పేపర్ లీక్ కారణాలతో ఫలితాల అనంతరం రద్దు చేయగా.. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడానికి టీఎస్ పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. రెండు నెలల పాటు గ్రూప్ 1 వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు మే 25న విచారణ చేపట్టనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..