GT vs CSK, Match Highlights: గుజరాత్‌కు షాకిచ్చిన చెన్నై - చెపాక్‌లో ధోనీ సేనదే గెలుపు
IPL 2023 Qualifier 1, GT vs CSK: ఐపీఎల్‌లో మెస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్.. క్వాలిఫయర్ - 1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి పదోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.
GT vs CSK, Match Highlights: ఐపీఎల్-16 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. స్వంత గ్రౌండ్ (చెపాక్)లో బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు రాణించి ఆ జట్టును ఈ లీగ్‌లో పదోసారి ఫైనల్స్‌కు చేర్చారు. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్.. ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ధోనీ సేన.. 15 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టీమ్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42, 4 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భయపెట్టినా చెన్నై విజయాన్ని ఆపలేకపోయారు. ఈ విజయంతో ధోనీ సేన ఫైనల్‌కు చేరగా గుజరాత్ టైటాన్స్.. ముంబై - లక్నో మధ్య జరిగే మ్యాచ్ లో విజేతతో రెండో క్వాలిఫయర్ (మే 26) ఆడుతుంది.
గుజరాత్ ఆది నుంచి తడబాటు..
మోస్తారు లక్ష్య ఛేదనను గుజరాత్ రెండో ఓవర్లోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12) వికెట్‌ను కోల్పోయింది. చాహర్ వేసిన రెండో ఓవర్లో ఐదో బాల్‌కు బౌండరీ కొట్టిన సాహా.. ఆ తర్వాతి బంతికే పుల్ షాట్ ఆడబోయి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న పతిరానకు క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్‌లో వచ్చిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (8) కూడా తీక్షణ వేసిన ఆరో ఓవర్లో జడేజా చేతికి చిక్కాడు.
వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో పాటు స్పిన్నర్లు జడేజా, తీక్షణ రంగప్రవేశంతో గుజరాత్ స్కోరు వేగం తగ్గింది. తీక్షణ వేసిన పదో ఓవర్లో 4, 6 కొట్టిన దసున్ శనక (16 బంతుల్లో 17, 1 ఫోర్, 1 సిక్స్)ను రవీంద్ర జడేజా 11వ ఓవర్లో మూడో బాల్‌కు తీక్షణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జడ్డూ తన తర్వాతి ఓవర్లో ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (4) ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు.
పవర్ ప్లేలో ధాటిగా ఆడినా తర్వాత నెమ్మదించిన శుభ్‌మన్ గిల్ కూడా దీపక్ చాహర్ వేసిన 14వ ఓవర్లో ఫస్ట్ బాల్‌కే డెవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరుసటి ఓవర్లో గుజరాత్ భారీ ఆశలు పెట్టుకున్న రాహుల్ తెవాటియా (3) ను తీక్షణ బౌల్డ్ చేశాడు.
రషీద్ ఖాన్ భయపెట్టినా..
98కే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ మరోసారి భయపెట్టాడు. ముంబైతో మ్యాచ్ లో మాదిరిగానే ధాటిగా ఆడేందుకు యత్నించాడు. పతిరాన వేసిన 16వ ఓవర్లో 6, 4 కొట్టాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన 17వ ఓవర్లో ఫస్ట్ బాల్‌కు విజయ్ శంకర్ (14) సిక్స్ కొట్టగా రషీద్ మరోసారి 6,4తో విరుచుకుపడ్డాడు. అయితే మరుసటి ఓవర్లో పతిరాన గుజరాత్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడో బాల్‌కు శంకర్.. గైక్వాడ్‌కు క్యాచ్ ఇవ్వగా తర్వాతి బంతికే దర్శన్ నల్కండే రనౌట్ అయ్యాడు.
𝗡𝗲𝘅𝘁 𝗗𝗲𝘀𝘁𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻: 𝗙𝗜𝗡𝗔𝗟 ✈️😉
— IndianPremierLeague (@IPL) May 23, 2023
Congratulations 🥳 to 𝗖𝗛𝗘𝗡𝗡𝗔𝗜 𝗦𝗨𝗣𝗘𝗥 𝗞𝗜𝗡𝗚𝗦, the first team to qualify for #TATAIPL 2023 Final 💛#Qualifier1 | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/LgtrhwjBxH
అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60, 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40, 4 ఫోర్లు) రాణించినప్పటికీ మిడిలార్డర్ వైపల్యంతో ఆ జట్టు 172 కే పరిమితమైంది.