Top 10 Headlines Today: నేడే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్- వామపక్షాల తక్షణ కర్తవ్యం ఏంటీ? పవన్ చిన్న బ్రేక్ తీసుకున్నారా?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
నేడే సాఫ్ట్ ల్యాండింగ్
చంద్రుడిపై ప్రయోగాలకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రయాన్-3 జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట రేంజ్ లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు భారత శాస్త్రవేత్తలు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ మాడ్యుల్ సాఫ్ట్ ల్యాండ్ జరగనుంది. అయితే కీలకమైన సాఫ్ట్ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కదలికల్ని జాగ్రత్తగా నిర్వహించాలి. అందుకోసం సిగ్నల్స్ ను నిర్వహించేందుకు ఇస్రోకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సహకరిస్తామని ప్రకటించాయి. ఆస్ట్రేలియాలోని న్యూ నోర్సియా అనే గ్రౌండ్ స్టేషన్ సైతం నేడు చంద్రుడిపై కీలకమైన ల్యాండింగ్ ప్రాసెస్ లో ఇస్రోకు సహకారం అందిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రగిలిపోతున్న వామపక్షాలు
తెలంగాణలో వామపక్ష పార్టీలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ ఘోరంగా అవమానించారని .. వాడుకుని వదిలేశారని.. అమాయకంగా మోసపోయామని వారు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్‌కు తామేంటో చూపించాలని అనుకుంటున్నారు. హైదరాబాద్‌లో రెండు వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలపై చర్చించాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చిన్న విరామం
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వారాహి యాత్ర విశాఖ టౌన్ లో ముగిసింది. దాదాపుగా పది రోజుల పాటు యాత్ర చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ తర్వాత ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. వారాహియాత్ర జోరుగా సాగించడానికి కారణం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశమే. కానీ ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే ఆలోచన చేయకపోవడంతో... పవన్ ఇప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన సినిమా షూటింగ్‌లు చాలా వరకూ పెండింగ్ లో ఉన్నాయి. వాటికి డేట్లు సర్దుబాటు చేస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… వచ్చే మూడు నెలల పాటు కొంత కాలం షూటింగ్‌లకు కాల్ షీట్లు కేటాయించారు. ఈ కారణంగా వారాహి యాత్రకు కొంత గ్యాప్ రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మోస్తర వర్షాలు
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 22) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జగన్‌పై లోకేష్ సెటైర్లు
సీఎం నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఓ పులిని వదిలి, ముఖ్యమంత్రి జగన్ చేతికి కర్ర ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇటీవల తిరుమల మెట్ల గుండా వెళ్లే భక్తులకు కర్ర ఇచ్చి పంపిస్తుండడంపై నారా లోకేశ్ ఈ మేరకు స్పందించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. తన యువగళం పాదయాత్ర సజావుగా సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రే అవుతుందని నారా లోకేశ్ హెచ్చరించారు. యువగళం ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్ సీపీకి భయం పట్టుకుందని, తాను పాదయాత్ర చేస్తుంటే జగన్‌కు కాళ్లు నొప్పిపెడుతున్నాయని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. నందిగామలో ఓ ప్రైవేటు స్కూల్ కార్యక్రమంలో పాల్గన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు, కులాల కంటే పోటీ చేసే అభ్యర్థులను చూసే ప్రతి ఒక్కరు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకోకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే సానుకూల ఫలితం రాలేదు. తర్వాత విశాఖ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ జనసేన పార్టీలో చేరలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కవితను టార్గెట్ చేసిన షర్మిల
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మా.. నీ చిత్తశుద్ధి ఏమైందంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఆకాశం, అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లు అవుతుందా అంటూ అవాకులు చవాకులు పేల్చారు. కవితమ్మా "Be the change you want to see " అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చరిత్రకు అడుగు దూరంలో ప్రజ్ఞానంద
భారత టీనేజ్ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫస్ట్ గేమ్ డ్రా అయింది. భారత్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, నార్వే దేశానికి చెందిన అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్ సన్ తొలి గేమ్ ను 35 ఎత్తుల తరువాత డ్రా చేసుకున్నారు. వీరి మధ్య ఫైనల్ రెండో గేమ్ బుధవారం జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కాపీయింగ్‌లో మాస్టర్స్ వీళ్లు
ఒకప్పుడు కాపీయింగ్ అంటే పేపర్లలో రాసుకెళ్లేవారు. కాలం మారే కొద్ది కాపీయింగ్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. మైక్రోఫోన్లు, రిసీవర్లతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడేవారు. ఆ తరువాత పెన్ కెమరాలతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పతున్నారు. తాజాగా ఇస్రోలోని ఓ సంస్థ చేపట్టిన పరీక్షల్లో అత్యాధునిక సాంకేతికత సహాయంతో కొందరు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు కెమెరాలు కనిపించకుండా ప్రత్యేకంగా దుస్తులను తయారు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేషనల్ ఐకాన్
భారత ఎన్నికల సంఘం ‘నేషనల్ ఐకాన్’ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్, సచిన్ టెండూల్కర్‌కు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం జరుగనుంది. ఎన్నికల పక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సచిన్ ఓటర్లు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి