అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sharmila on Kavitha: కవితమ్మా ఢిల్లీలో కాదు, రాష్ట్రంలో సీట్లు ఇచ్చే దమ్ము ఉండాలి: వైఎస్ షర్మిల

Sharmila on Kavitha: కవితమ్మా.. ఢిల్లీలో కాదు రాష్ట్రంలో సీట్లు ఇచ్చే దమ్ము ఉండాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 

Sharmila on Kavitha: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మా.. నీ చిత్తశుద్ధి ఏమైందంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఆకాశం, అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లు అవుతుందా అంటూ అవాకులు చవాకులు పేల్చారు. కవితమ్మా "Be the change you want to see " అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ము ఉండాలి అని ప్రశ్నించారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నా క్యాబినెట్ లోనూ ప్రాధాన్యత దక్కలేదని చెప్పుకొచ్చారు. లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్ లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించమంటూ సూచించారు. 

లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన ఒక్కసారి కూడా స్పందించిన పాపాన పోలేదని వివరించారు. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదంటూ ఫైర్ అయ్యారు. మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదు అంటూ తెలిపారు. నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలన్నారు. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు.

Also Read: Harish Rao: కాంగ్రెస్ పార్టీ సీట్లను అమ్ముకుంటుంది, బీజేపీకి క్యాడర్ లేదు - మంత్రి హరీష్ రావు

నిన్నటికి నిన్న కేసీఆర్ పై ఫైర్ అయిన షర్మిల

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన ఓటమికి భయపడే కామారెడ్డి నుంచి కూడా పోటీకి రెడీ అయ్యారంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుండడంపై స్పందించారు. సీఎంపై సెటైర్లు వేశారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను తన్ని తరిమేస్తారని ఆయనకు అర్థం అయినట్లు ఉందని వైఎస్ షర్మిల అన్నారు. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం ఇదని అన్నారు. రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో కేసీఆర్ గజ్వేల్ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండని ఎద్దేవా చేశారు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాలు విసిరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget