అన్వేషించండి

Morning News Today: పవన్‌కు కోర్టు సమన్లు- కెనడాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Top 10News Today:

దీపావళి కానుక ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి దీపావళి సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ ఏర్పాట్లు చేయాలని.. 31 నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
 
జగన్‌-షర్మిల రాజీ చర్చలు 
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమని వైసీపీ కోసం ప్రచారం చేసిన షర్మిల తర్వాత సొంత రాజకీయం ప్రారంభించారు. ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణంగా నిలిచింది. దీంతో జగన్ రాజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
వైఎస్‌ పేరు తొలగించి పింగళి వెంకయ్య పేరు 
మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, 'పింగళి వెంకయ్య మెడికల్ కాలేజీ'గా ఏపీ ప్రభుత్వం  పేరు మార్చింది. బీజేపీ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పలు విద్యాసంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టుకుంటే.. తాము మాత్రం దేశ నాయకుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
 
అప్పటికల్లా పోర్టు పనులు పూర్తి : మంత్రి అచ్చెన్న
శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణం జిల్లా ప్రజల చిరకాల కోరిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాలి మండలం మూలపేటలో సోమవారం పోర్టు పనుల పరిశీలన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పోర్టు పనులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 2025 జూన్ 12వ తేదీలోగా పోర్టు పనులు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
 
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప - చిత్తూరు హైవేలో కలకడ వద్ద ఓ ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
పవన్ కల్యాణ్‌కు కోర్టు సమన్లు
 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సివిల్ కోర్టులో రామారావు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు పవన్‌‌కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
 
కెనడాతో సంబంధాలపై జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు
కెనడాతో సంబంధాలపై ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం కష్టమేనని విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. 1945తర్వాత ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువగా ఉండేదని, గడిచిన 20-25 ఏళ్లలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. పాశ్చాత్యేతర దేశాల వాటా, భాగస్వామ్యం, ప్రభావం పెరిగిందన్నారు. వివాదాలు, ఘర్షణలు, వాదనలు సహజమేనని, ఈక్రమంలో కొన్నిదేశాల మధ్య సంబంధాలు అంత సాఫీగా ఉండవని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
 
తుఫాను ముప్పు.. భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తుఫాను ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీలలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
 
కేసీఆర్ ప్రస్తావన లేకుండానే తెలంగాణ రాజకీయాలు
బీఆర్‌ఎస్ బాధ్యతలు పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అధ్యక్షుడు కేసీఆర్‌ అప్పగించినట్టు కనిపిస్తోంది. ఎక్కువ వ్యవసాయం చేసుకుంటూ ఫామ్‌ హాస్‌లోనే గడిపేస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేనట్టు కనిపిస్తోంది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
BRS Politics : కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
Rains Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్యాడ్స్ కోసం వేల కోట్ల ఖర్చు, ట్రంప్‌ని వెనక్కి నెట్టి కమలా హారిస్వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
BRS Politics : కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
Rains Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
Actress Gautami: పార్టీలో చేరిన నటి గౌతమికి కీలక బాధ్యతలు అప్పగించిన అన్నాడీఎంకే
పార్టీలో చేరిన నటి గౌతమికి కీలక బాధ్యతలు అప్పగించిన అన్నాడీఎంకే
Nara Lokesh: 'ఇతర రాష్ట్రాలతో కాదు దేశాలతోనే మాకు పోటీ' - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్‌లో కీలక భేటీ
'ఇతర రాష్ట్రాలతో కాదు దేశాలతోనే మాకు పోటీ' - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్‌లో కీలక భేటీ
Jaishankar: ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
Embed widget