AP Graduate MLC Elections 2024: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నేతలు- కూటమికి మేలు చేయడానికా? కీడు చేయడానికా?
AP Graduate MLC Elections : ఉభయగోదావరిజిల్లా పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆసక్తికరమైన అంశం వెలుగు చూస్తోంది. వైసీపీ నేతలు స్వతంత్రులుగా పోటీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

AP Graduate MLC elections : ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల కేంద్రంగా రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉంటున్నట్టు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ లోకల్‌గా ఉన్న లీడర్లు మాత్రం పోటీకి సిద్ధమవుతున్నారు. స్వతంత్రులుగా బరిలో నిలిచి సత్తా చాటేందుకు ఉవ్విలూరుతున్నారు. అయితే ఇది కూటమికి మేలు చేయడానికా లేకా ఓడించడానికా అనే చర్చ ఉభయగోదావరి జిల్లాల్లో నడుస్తోంది.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఏలూరు కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం సాగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. ఇలాంటి ఔత్సాహికుల జాబితా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ముమ్మిడివరం నియోజకవర్గంకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ పేరు అధిష్టానం ఖరారు చేసింది. నాలుగు నెలల నుంచి ప్రచారం దూసుకెళ్తున్నారు. వామపక్షాల నుంచి విశ్రాంత ఉపాధ్యాయుడు గిడ్ల వీరరాఘవులు పేరు వినిపిస్తోంది. వైసీపీ మాత్రం పోటీ చేయడం లేదని ప్రకటించింది. కానీ అనూహ్యంగా స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నామంటూ ముందుకొస్తున్నారు వైసీపీకి చెందిన నేతలు.
అభ్యర్థుల ప్రచారాల్లో నిమగ్నం...
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే పది మంది అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి చంద్రబాబు ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ పేరాబత్తుల రాజశేఖర్ పేరు ఖరారు చేశారు అయిదు జిల్లాల పరిధిలో తన ప్రచారాన్ని చేసుకుపోతున్నారు. వామపక్షాల నుంచి గిడ్ల వీరరాఘవులు ప్రచారం చేస్తున్నారు. వైసీపీకు చెందిన వారే స్వతంత్రులుగా ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నుంచే ముగ్గురు వరకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నట్లు ప్రకటించారు.
సోషల్ మీడియా వేదికగా ప్రచారం..
వైసీపీకు చెందిన నేతలు స్వతంత్య్ర అభ్యర్థులుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అమలాపురం నియోజకర్గ జనసేన ఇంచార్జ్‌గా పని చేసి ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ అయిన శెట్టిబత్తుల రాజాబాబు ఉన్నారు. 5 నెలలుగా సోషల్ మీడియా వేదికగా ప్రచార కొనసాగిస్తున్నారు. పట్టభద్రులమ అభ్యున్నతికి తాను కృషి చేస్తానని గెలిపించాలంటూ ఓటర్లను కలుస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం జోరు పెంచారు. పి.గన్నవరం వైసీపీ నేత మంతెన రవిరాజు స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఒక్క వైసీపీకి చెందిన ఏడుగురు వ్యక్తులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు.
దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. అధినాయకత్వం వద్దన్నప్పటికీ ఇలా స్వతంత్రులుగా పోటీ చేయడంపై వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తే వారికి సపోర్ట్ చేసి టీడీపీ అభ్యర్థిని ఓడించడానికి పని చేయకుండా ఇలా చేయడం ఏంటనే ప్రశ్నించే వాళ్లు ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్న ఏడుగురు కూడా కూటమికి మంచి చేయడానికి పోటీ చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆ పెన్నుతో పరీక్ష రాస్తే పాస్ గ్యారెంటీ- తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకానికి కారణమేంటీ!





















