అన్వేషించండి

TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత, పేపర్లవారీగా ఉత్తీర్ణత ఇలా

TET 2024 results: తెలంగాణలో టెట్ ఫలితాలు వెలువడ్డాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాల్లో 42,384 మంది ఉత్తీర్ణత సాధించారు.  

Telangana TET 2024 Results: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET Result) 2024 ఫలితాలు ఫిబ్రవరి 5న వెలువడ్డాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డొస్తుందని మొదట భావించినప్పటికీ.. ఇప్పటికే పరీక్ష పూర్తయినందున ఎలాంటి అడ్డంకులు లేవని భావించిన విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు లేదా హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, పరీక్ష పేపరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.  

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో పేపర్-1లో 69,476 మంది అభ్యర్థులకుగాను 41,327 (59.48 %) మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్-2లో మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 69,390 మంది పరీక్షకు హాజరుకాగా.. 23,755 (34.24 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్‌లో 66,412 మందికిగాను.. 18,629 (28.205 %) మంది అర్హత సాధించారు. మొత్తానికి పేపర్-1, పేపర్-2 రెండూ కలిపి 2,05,278 మంది పరీక్షలకు హాజరుకాగా.. 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు.  

తెలంగాణ టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఫైనల్ కీ అందుబాటులో..
తెలంగాణలో టెట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్ కీని విద్యాశాఖ విడుదల చేసింది. పేపర్లు, సబ్జెక్టులవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయి. టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ జనవరి 24న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 25 నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించింది.   

తెలంగాణ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి.. 

అర్హత మార్కులు..
టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీలకు 90గా,  బీసీలకు 75గా,  ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 60గా నిర్ణయించారు.

ALSO READ: 

టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్(TG EAPCET Schedule), పీజీ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. త్వరలోనే దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటించనున్నారు. టీజీ ఎప్‌సెట్-2025 (TG EAPCET Notification) ఫిబ్రవరి 20న, పీజీఈసెట్ నోటిఫికేషన్‌ మార్చి 12న విడుదల కానుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget