అన్వేషించండి

TG EAPCET: టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?

TG EAPCET 2025: తెలంగాణలో అగ్రికల్చర్, ఫార్మా, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీఎప్‌సెట్ 2025 నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

TG EAPCET 2025 Schedule: తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్(TG EAPCET Schedule) ఖరారైంది. అయితే ఎప్‌సెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఉన్నత విద్యామండలి వెల్లడించింది. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్ ప్రకటిస్తారు. టీజీ ఎప్‌సెట్-2025 (TG EAPCET Notification) ఫిబ్రవరి 20న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

తెలంగాణ ఎప్‌సెట్ షెడ్యూలు ఇదే..
ఈ షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 22 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు  టీజీఎప్‌సెట్ (TG EAPCET 2025) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు; మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టంది. ఈఏపీసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ వ్యవహిరించనున్నారు. 

TG EAPCET: టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?

పీజీ ఈసెట్ షెడ్యూల్ ప్రకారం..
తెలంగాణ పీజీ ఈసెట్- 2025 షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ (PG ECET) నిర్వహించనున్నారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ.అరుణ కుమారి వ్యవహరించనున్నారు.

TG EAPCET: టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?

ముఖ్యమైన తేదీలు..

✦ టీజీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి: 20.02.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.02.2025. 

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.04.2025. 

పరీక్ష తేదీలు..

✦ అగ్రికల్చర్ & ఫార్మసీ:  29.04,2025 &30.04,2025.

✦ ఇంజినీరింగ్‌: 02.05.2025 నుంచి 05.05.2025 వరకు.

తెలంగాణ ఐసెట్-2025 షెడ్యూలు ఇలా..
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ (TG ICET) పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్‌ను నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఐసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అలువాల రవి వ్యవహరించనున్నారు.


TG EAPCET: టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?

తెలంగాణలో ఇతర పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ బీఈడీ ప్రవేశాల కోసం జూన్ 1న ఎడ్ సెట్ జరగనుంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్ (TG EDCET) కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి వ్యవహరించనున్నారు.

➥ ఎల్‌ఎల్‌బీ ప్రవేశాల కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. లాసెట్, పీజీఎల్ సెట్  (TG LAWCET/ PGLCET)నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించి.. కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి వ్యవహరించనున్నారు.

➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ (PG ECET) నిర్వహించనున్నారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ.అరుణ కుమారి వ్యవహరించనున్నారు.

➥ వ్యాయామ విద్య(ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సులు డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ (TG PECET) నిర్వహిస్తారు. పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎన్.ఎస్.దిలీప్ ఉన్నారు. పీఈసెట్ మినహా మిగతా ఎంట్రన్స్‌లన్నింటినీ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 

ప్రవేశ పరీక్ష పరీక్ష తేదీ కన్వీనర్ యూనివర్సిటీ
ఈఏపీసెట్ ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు   బి. డీన్ కుమార్  జేఎన్‌టీయూహెచ్
ఈసెట్ మే 12 చంద్రశేఖర్  ఉస్మానియా యూనివర్సిటీ 
ఎడ్‌సెట్ జూన్ 1న  బి.వెంకట్రామిరెడ్డి  కాకతీయ యూనివర్సిటీ 
లాసెట్, పీజీఎల్ సెట్  జూన్ 6న   బి.విజయలక్ష్మి  ఉస్మానియా యూనివర్సిటీ
ఐసెట్ జూన్ 8, 9 తేదీల్లో  అలువాల రవి  మహాత్మగాంధీ యూనివర్సిటీ 
పీజీఈసెట్ జూన్ 16 నుంచి 19 వరకు  ఎ.అరుణ కుమారి  జేఎన్టీయూహెచ్
పీఈసెట్ జూన్ 11 నుంచి 14 వరకు  ఎన్.ఎస్.దిలీప్  పాలమూరు యూనివర్సిటీ 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget