అన్వేషించండి

Top Headlines Today: ఉత్తరంలో ఊపు వస్తేనే గెలుపు- టీడీపీలో పెరుగుతున్న యాక్టివిటీ- మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

కాంగ్రెస్ స్ట్రాటజీ మారిందా!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో చావో రేవో అన్నట్లుగా తలపడుతోంది. గతంలో ఉన్న మైనస్‌లన్నిటినీ వీలైనంతగా తగ్గించుకుని పార్టీ నేతలంతా కలసి కట్టుగా పోరాటం చేస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఈ సారి పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు జత కూడారు. ఆయన కర్ణాటక ఎన్నికల్లో మంచి మైలేజీ ఇచ్చే వ్యూహాలను ఇచ్చారు. తెలంగాణలోనూ ఆయన టీం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు ముందు ఉన్న టాస్క్ ఉత్తర తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో అసలు ప్రభావం చూపలేదు. ఇప్పుడు అక్కడ పుంజుకుంటేనే అధికారం. అందుకే.. ఉత్తర తెలంగాణపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రిషికొండ కట్టడాలపై పిల్

రిషికొండలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణం జరుగుతోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ పర్యావరణవేత్త లింగమనేని శివారం ప్రసాద్‌ పిల్ వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

గవర్నర్ ఇంద్రసేనారెడ్డి 

రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్‌ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. నల్లు ఇంద్రసేనారెడ్డి తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, రఘుబర్‌ దాస్‌ ఝార్ఖండ్‌ మాజీ సీఎం అని తెలిసిందే.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

టీడీపీలో మార్పు  

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నలభై రోజులుగా జైల్లో ఉన్నారు. క్వాష్ పిటిషన్ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. అనుకూలంగా వస్తే ఆయన వెంటనే  బయటకు వస్తారు. వ్యతిరేకంగా వస్తే.. మళ్లీ బెయిల్ పిటిషన్లు వేసుకుని పోరాడాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తే దేనికైనా సుప్రీంకోర్టు వరకూ ప్రయత్నించాల్సి ఉంటుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. క్వాష్ పిటిషన్ వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు బయటకు రావడానికి మరింత సమయం పడుతుంది. ఈ నలభై రోజులుగా టీడీపీ చంద్రబాబు అరెస్టులు, కేసుల వ్యవహారలతోనే సమయం గడిపేసింది. లోకేష్ కూడా ఎక్కువగా ఢిల్లీలోనే కాలం గడిపారు. కానీ చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ఏపీలో ఎటు చూసినా టీడీపీ కనిపించేది. విస్తృతంగా నేతలు పర్యటించేవారు. ఇప్పుడు కూడా టీడీపీ నేతలు విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ భిన్నమైన కారణంతో.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నవంబర్ 15 లోపు అభిప్రాయాలు చెప్పండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 15 లోపు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని అందుకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ను కోరగా.... ఆంధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ ట్రిబ్యునల్ వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

నేడు జగనన్న చేదోడు నిధులు

ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వరుసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల చేయనున్నారు. అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రూ.10,000 సీఎం జగన్ గురువారం జమ చేయనున్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పే సీఎం జగన్.. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలని వారికి చేదోడునిస్తున్నారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఓటీటీలోకి భగవంత్ కేసరి

తెలుగు సినిమా పరిశ్రమలో కుర్ర హీరోలతో పోటీ పడి నటించే స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. వయసు పెరుగుతున్నా, తన నటనలో ఏమాత్రం జోష్ తగ్గలేదంటారు ఆయన. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. వరుస హిట్లతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా ‘భగవంత్ కేసరి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా కానుకగా ఈ చిత్రం ఇవాళ(అక్టోబర్ 19న) విడుదల అయ్యింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో సభ్యత్వం

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో సభ్యత్వం పొందారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో తారక్ స్థానం చోటు సంపాదించారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తారక్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

లియో ఎలా ఉంది

దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'లియో'. 'మాస్టర్' తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్ సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడమే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆదమరిస్తే నాగిని డ్యాన్సే

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. మహా సంగ్రామంలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయాలని పట్టుదలగా ఉంది. సెమీస్‌కు మార్గం సుగుమం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో రోహిత్‌ సేన అలసత్యానికి చోటివ్వకుండా గెలవాలని రోహిత్‌ సేన చూస్తోంది. గత నాలుగు వన్డేల్లో మూడుసార్లు టీమిండియాను బంగ్లాదేశ్‌ ఓడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget