Bhagavanth Kesari OTT Release: ‘భగవంత్ కేసరి‘ ఆ ఓటీటీలోనే, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. భారీ అంచనాల నడుమ విడుదలై, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అటు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది.
![Bhagavanth Kesari OTT Release: ‘భగవంత్ కేసరి‘ ఆ ఓటీటీలోనే, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే? Nandamuri Balakrishna Bhagavanth Kesari Movie Digital Partner and Streaming Date Bhagavanth Kesari OTT Release: ‘భగవంత్ కేసరి‘ ఆ ఓటీటీలోనే, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/3fd4534010532544f265d82496ec0eaa1697684339364544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bhagavanth Kesari: తెలుగు సినిమా పరిశ్రమలో కుర్ర హీరోలతో పోటీ పడి నటించే స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. వయసు పెరుగుతున్నా, తన నటనలో ఏమాత్రం జోష్ తగ్గలేదంటారు ఆయన. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. వరుస హిట్లతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా ‘భగవంత్ కేసరి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా కానుకగా ఈ చిత్రం ఇవాళ(అక్టోబర్ 19న) విడుదల అయ్యింది.
‘భగవంత్ కేసరి’కి పాజిటివ్ టాక్ (Bhagavanth Kesari Review)
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యుఎస్ ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ లభించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూవీని చూసేందుకు ఓ రేంజిలో టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. బాలయ్య కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా ‘భగవంత్ కేసరి’ నిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
‘భగవంత్ కేసరి’ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్
Bhagavanth Kesari OTT: ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడి అయ్యాయి. నిజానికి అనిల్ రావిపూడి, బాలయ్యతో సినిమా అనగానే ఓ రేంజిలో అంచనాలు పెరిగాయి. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని బాలయ్య అభిమానులతో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అటు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో భారీగా పోటీ ఏర్పడింది. దిగ్గజ ఓటీటీ సంస్థలు ఈ సినిమా డిజిటల్ రైట్స్ పొందేందుకు పోటీ పడ్డాయి. చివరకు ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ భాగస్వామికి సంబంధించిన వివరాలను మూవీ టైటిల్ కార్డ్స్ లోనే చిత్రబృందం వెల్లడించింది.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే? (Bhagavanth Kesari OTT Date)
అటు 'భగవంత్ కేసరి' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 50 రోజుల అనంతరం ఓటీటీలో ప్రసారం చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కాగా, డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ‘భగవంత్ కేసరి’ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Read Also: సాయం కోసం వెళ్తే నరేష్, జీవిత నాతో ఆడుకున్నారు - క్యారెక్టర్ ఆర్టిస్టు పద్మ జయంతి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)