అన్వేషించండి

Artist Padma Jayanti: సాయం కోసం వెళ్తే నరేష్, జీవిత నాతో ఆడుకున్నారు - క్యారెక్టర్ ఆర్టిస్టు పద్మ జయంతి సంచలన వ్యాఖ్యలు

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు పద్మ జయంతి నటుడు నరేష్, నటి జీవిత రాజశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు పెళ్లికి సాయం చేస్తానని చెప్పి ముప్పు తిప్పలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగారు పద్మ జయంతి. ఎన్నో చిత్రాల్లో భార్యగా, తల్లిగా, సోదరిగా నటించి మెప్పించారు. సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల నుంచి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా, ఆర్థికంగా పెద్దగా ఎదిగిందేమీ లేదని వెల్లడించారు. అంతేకాదు, సాయం కోసం వెళ్లితన తనకు మా అసోసియేషన్ నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక సాయం కోసం ఎన్నో అవమానాలు

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన పద్మ.. ఒకప్పుడు మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్, జనరల్ సెక్రెటరీగా ఉన్న జీవిత తనను ఎలా ఇబ్బంది పెట్టారో వెల్లడించే ప్రయత్నం చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడిన వారు ఎన్నో మాటలు చెప్తారని, వాటిని నెరవేర్చడంలో మాత్రం చిత్తశుద్ధి ఉండదని ఆమె ఆరోపించారు. నరేష్ మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ‘కల్యాణ లక్ష్మి’ అనే పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నిరుపేద ఆర్టిస్టుల పిల్లల పెళ్లిళ్లకు ఈ పథకం కింద సాయం చేస్తామని చెప్పారు. అందరి లాగే తన కూతురు పెళ్లి కోసం సాయం చేయాలని మా అసోసియేషన్ ను కోరినట్లు పద్మ తెలిపింది. అయితే, రూ. లక్ష కోసం తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు.

నరేష్, జీవిత నాతో ఆడుకున్నారు- పద్మ

వాస్తవానికి నాటి మా ప్రెసిడెంట్ నరేష్ కు, జనరల్ సెక్రెటరీ జీవిత రాజశేఖర్ కు అస్సలు పడేది కాదని పద్మ తెలిపారు. వారి ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా తాను ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. తను ఇచ్చే ఆర్థికసాయం క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు ఇద్దరు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. పెళ్లికి వారం రోజుల సమయం ఉన్నా, ఇంకా ఆర్థిక సాయం విషయం ఎటూ తేల్చక మానసిక క్షోభకు గురి చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణం రాజు స్పాన్సర్ షిప్ తో ఆర్థికసాయం

చివరకు దివంగత సీనియర్ నటుడు కృష్ణం రాజు స్పాన్సర్ షిప్ తో  తన బిడ్డ పెళ్లికి రూ. లక్ష అందించారని పద్మ తెలిపారు. లక్ష రూపాయలు ఇచ్చి, కోటి రూపాయలు ఇచ్చినట్లుగా కొంత మంది మా సభ్యులు ప్రవర్తించారని ఆమె విమర్శించారు. మరికొంత మంది అయితే, ఈ లక్ష రూపాయలు ఇచ్చుడే ఎక్కువ అంటూ అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మా పదవుల్లో ఉన్న మహిళలు కూడా సాటి మహిళ అనే సానుభూతి కూడా చూపించలేదని చెప్పారు. ఇండస్ట్రీలోనే కాదు, మా అసోసియేషన్ లోనూ చాలా మంది చెప్పే మాటలకు, చేసే పనులకు చాలా తేడా ఉంటుందని పద్మ తెలిపారు. వారి మాటలు నమ్మితే నట్టేట ముంచడం ఖాయం అని చెప్పారు. తనకు ఎదురైన ఘటనలే అందుకు ప్రత్యక్ష ఉదాహారణలని పద్మ తెలిపారు.

Read Also: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
Mahesh Babu: అన్నయ్య కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
అన్నయ్య కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mahesh Babu : బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget