Top Headlines Today: ఏపీ రాజకీయంపై పొత్తు ఎఫెక్ట్ ఎంత? తెలంగాణ కాంగ్రెస్ దారికొచ్చిందా?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
ఏపీ రాజకీయాల్లో పొత్తు ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గురువారం కీలక మార్పు చోటు చేసుకుంది. టీడీపీతో కలిసి వెళ్తున్న జనసేనాని ప్రకటించారు. ప్రకటించిన సందర్భం కూడా సరిగ్గా సరిపోయింది. తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కలుస్తున్నామని చేతల ద్వారానే చెప్పారు. ఇక యుద్ధమేనన్నారు. పొత్తుల ప్రకటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కర్ణాటక వ్యూహం
తెలంగాణలో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యూహాన్ని అమలు చేస్తోంది. పార్టీ నేతులపైకి కనిపిస్తున్నా.. అంతర్గతంగా హైకమాండ్ నుంచి ఓ వ్యవస్థ పార్టీ వ్యవహారాలను నడిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి గత రెండు నెలల్లో ఢిల్లీ నుంచి 30 మంది దూతలు వచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సుర్‌అలీ ఖాన్, ప.ి విశ్వనాథ్…ఇక్కడే మకాం వేశారు. గాంధీభవన్ నుంచి ఠాక్రే పర్యవేక్షణ చేస్తుండగా, మిగతా ముగ్గురు మాత్రం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో తేలికపాటి వర్షాలు
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుండి అతిభారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని (ఉత్తర) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చిక్కుల్లో నవదీప్
డ్రగ్స్ కేసులో మరోసారి హీరో నవదీప్ చిక్కుకున్నారు. నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాంచంద్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. నవదీప్ ను కన్స్యూమర్ గా పోలీసులు తేల్చారు. గతంలో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ పేరు ఉన్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి. దీనికి ఒకరోజు ముందు సెప్టెంబర్ 20న సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలి చర్చించనుంది. అయిదు రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నామమాత్రపు పోరు
ఆసియా కప్ - 2023లో ఫైనల్ బెర్త్‌ను అందరికంటే ఫస్ట్ కన్ఫమ్ చేసుకున్న భారత్.. సూపర్ - 4కు చేరినా తుదిపోరు చేరకుండా ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టోర్నీ పరంగా చూస్తే ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అప్రధానమే అయినా వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను భారత్, బంగ్లాదేశ్‌లు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులు చేసే అవకాశముంది. ఆదివారం శ్రీలంకతో జరిగే ఫైనల్ పోరుకు ముందు భారత్‌కు ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సత్తా చాటిన లంకేయులు
మిగతా టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌ల సంగతి ఎలా ఉన్నా ఆసియా కప్ అంటేనే తమలోని అత్యుత్తమ ఆట ఆడే శ్రీలంక.. తమకు ఈ టోర్నీ అంటే ఎందుకంత క్రేజో మరోసారి నిరూపించింది. జట్టులో కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడ్డా, టోర్నీ ఆరంభానికి ముందే జట్టులో కోవిడ్ కలకలం రేగినా.. ఉన్న వనరులతోనే ఆ జట్టు 12వ సారి ఆసియా కప్‌లో ఫైనల్ (11 వన్డే, ఒక టీ20)కు చేరింది. అసలు ఈ జట్టుతో సూపర్ - 4 చేరడమే గొప్ప అని భావించిన విమర్శకులకు తమ ఆటతోనే సమాధానమిచ్చింది. గురువారం రాత్రి కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో ముగిసిన సూపర్ - 4 మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో బాబర్ గ్యాంగ్‌ను ఓడించి పాక్‌ను టోర్నీ నుంచి పంపించింది. అద్భుత విజయంతో వచ్చే ఆదివారం భారత్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చైతన్య, సమంత పెళ్లి ఫొటోలు
విడాకుల విషయాన్ని చాలామంది మర్చిపోయారు. సమంత, నాగచైతన్య కూడా ఎవరి ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇద్దరికీ ఒకే విధంగా ఫ్లాపులు కూడా ఎదురవుతున్నాయి. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సమంత కలిసి నటించిన ‘ఖుషి’ మూవీ మంచి హిట్‌ను అందుకుంది. కలెక్షన్స్ విషయంలో కూడా పరవాలేదనిపించింది. నాగచైతన్య మాత్రం ఇంకా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సమంత ఇన్‌స్టా పేజీలో మళ్లీ పెళ్లి ఫోటోలు, నాగచైతన్యతో హాలిడేలకు వెళ్లిన ఫోటోలు ప్రత్యక్షమవ్వడంతో అసలు దీనికి అర్థమేంటి అని ప్రేక్షకులు సందేహంలో పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'ఎంవై 3' వెబ్ సిరీస్ ఎలా ఉందంటే
తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా హన్సిక మోత్వానీ (Hansika) 50కు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పుడు 'ఎంవై 3' వెబ్ సిరీస్ (MY3 Web Series)తో ఆమె ఓటీటీకి పరిచయమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney plus hotstar)లో విడుదలైంది. తమిళంలో తెరకెక్కించిన 'ఎంవై 3'ని తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అనువదించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఉల్టా పుల్టా
బిగ్ బాస్ సీజన్ 6తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్‌ను 40 శాతం అత్యధిక మంది ప్రేక్షకులు చూశారు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ను 29 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం ముందు నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో లాంచ్ ఎపిసోడ్‌కు అంత ఆదరణ లభించిందని హేటర్స్ అనుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి