AP Assembly Sessions: 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు - ఎన్ని రోజులంటే
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి.
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి. దీనికి ఒకరోజు ముందు సెప్టెంబర్ 20న సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలి చర్చించనుంది. అయిదు రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది.
మార్పుల అనంతరం వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ఏపీ సర్కారు ప్రవేశపెట్టనుంది. బిల్లులతో పాటు కీలకాంశాలపై ప్రస్తావన సభలో వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైఎస్సార్సీఎల్పీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.