Bigg Boss Season 7 Rating: ఉల్టా ఫుల్టాతో ‘బిగ్ బాస్’కు ఊపిరి - సీజన్ 7తో మళ్లీ పుంజుకున్న రేటింగ్స్
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు అనేది గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. మూడు గంటల పాటు నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ కూడా ఎంటర్‌టైన్ చేశారు.
‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రేక్షకులను ఎంతగా బోరు కొట్టించిందో తెలిసిందే. అందులో కంటెస్టెంట్స్ నచ్చలేదో, కంటెంట్ నచ్చలేదో తెలియదుగానీ.. ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఆ ప్రభావం ఆ షోను ప్రసారం చేస్తున్న టీవీ చానెల్‌పై బాగాపడింది. మరీ రొటీన్‌గా ఉండటం, కాన్సెప్ట్స్ తెలిసిపోవడం వల్ల.. ఇందులో కొత్తగా ఏముంటుందిలే అనే భావన ప్రేక్షకుల్లో రావడంతో క్రియేటర్స్ Bigg Boss Telugu Season 7 కోసం గట్టిగానే శ్రమించాల్సి వచ్చింది. ఉల్టా పుల్టా పేరుతో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఈ సీజన్‌ను నడిపిస్తున్నారు. అలాగే, ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా Bigg Bossకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. దాని ఫలితం.. టీఆర్పీ రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఉల్టా పుల్టా సీజన్‌కు క్రేజ్..
బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తయ్యాయి. కానీ అన్ని సీజన్స్ ఒకేలాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రెగ్యులర్‌గా బిగ్ బాస్‌ను ఫాలో అవుతున్న ఫ్యాన్స్‌లో కొందరు బిగ్ బాస్ తెలుగులో మొదటి సీజన్‌ను బెస్ట్ అంటారు. కొందరు రెండో సీజన్ అన్నింటికంటే బాగుందని అంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. కానీ అన్నింటికి బిగ్ బాస్ తెలుగులో ఆరవ సీజన్.. ఎక్కువమంది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్‌లో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యింది. ఈ సీజన్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుండే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తిని క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. దీనికి లాంచ్ ఎపిసోడ్ రోజు వచ్చిన వ్యూసే ఉదాహరణ.
బిగ్ బాస్ సీజన్ 6తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్‌ను 40 శాతం అత్యధిక మంది ప్రేక్షకులు చూశారు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ను 29 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం ముందు నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో లాంచ్ ఎపిసోడ్‌కు అంత ఆదరణ లభించిందని హేటర్స్ అనుకుంటున్నారు. మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోపై వీక్షకులకు ఇంట్రెస్ట్ రావాలంటే కొన్ని ఎపిసోడ్స్ గడిచేవరకు రాదు. కానీ ఈసారి వీక్షకులకు అసలు గ్యాప్ ఇవ్వకుండా వెంటనే బిగ్ బాస్‌పై ఇంట్రెస్ట్ తీసుకురావడం కోసం మేకర్స్ కష్టపడుతున్నారు. వారి కష్టం ఫలించిందని టీఆర్‌పీలు చూస్తే అర్థమవుతోంది. బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి వారం పూర్తయ్యే సమయానికి దాదాపు 5.1 కోట్లమంది ప్రేక్షకులు దీనిని వీక్షించినట్టు తెలుస్తోంది. టీవీలో లాంచ్ ఎపిసోడ్‌ను దాదాపు 3 కోట్ల మంది చూశారు. డైలీ ఎపిసోడ్స్‌కు కూడా వ్యూవర్స్ పెరిగినట్లు సమాచారం. అయితే, ఆ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
క్రికెట్ రికార్డులను తిరగరాసింది..
బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు ఒక వీకెండ్ ఎపిసోడ్ పూర్తయ్యింది. ఆ వీకెండ్ ఎపిసోడ్‌కు యావరేజ్‌గా 7.1 శాతం రేటింగ్ వచ్చింది. అయితే ఆ యావరేజ్ రేటింగ్‌లో అత్యధిక శాతం హైదరాబాద్ నుండే వచ్చినట్టు తెలుస్తోంది. అందులో 8.7 శాతం రేటింగ్ అనేది కేవలం హైదరాబాద్‌లోని వీక్షకుల నుండి వచ్చిందని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్‌కు, వీకెండ్ ఎపిసోడ్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఇంకా రానున్న ఎపిసోడ్స్ రేటింగ్స్ విషయంలో, వ్యూస్ విషయంలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాయో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బిగ్ బాస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారమవుతుంది. ఇప్పటికే హాట్‌స్టార్‌లో ఇది క్రియేట్ చేస్తున్న రికార్డులతో ఎన్నో క్రికెట్ రికార్డులు చెరిగిపోయాయని నిపుణులు అంటున్నారు.
Also Read: అలా మాట్లాడొద్దు, నాకు నచ్చదని చెప్పేశా - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘బిగ్ బాస్’ శుభశ్రీ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial