Subhasree: అలా మాట్లాడొద్దు, నాకు నచ్చదని చెప్పేశా - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘బిగ్ బాస్’ శుభశ్రీ కామెంట్స్
‘బిగ్ బాస్’ శుభశ్రీ క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడింది. అయితే, తాను పిచ్చి పిచ్చి మాటలను ఎదుర్కోవల్సి వచ్చిందని, వారికి తగిన సమాధానం చెప్పానని వెల్లడించింది.
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) తెలుగులో ఒక కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శుభశ్రీ.. హౌజ్‌లోకి వెళ్లక ముందే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన కుటుంబం గురించి, ఫ్రెండ్‌షిప్ గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ఆఫర్
ఒడిశాలో పుట్టి పెరిగింది శుభశ్రీ. కుటుంబం అంతా లాయర్సే అయినా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అందుకే తన తండ్రి కోరిక మేరకు ఎల్ఎల్‌బీ చేసిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంటర్ అయ్యింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. 2020లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఆమిగోస్’ చిత్రంలో చోటును సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయంలోనే తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది శుభశ్రీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంలో నటిస్తోంది. అయితే భాష రాకుండా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను ఎలాంటి కష్టాలను ఎదుర్కుందో శుభశ్రీ బయటపెట్టింది.
కమిట్మెంట్ అడిగారా?
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను తాగుతున్న డ్రింక్‌లో ఎవరో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చారంట కదా అని శుభశ్రీకి ప్రశ్న ఎదురయ్యింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదని తను క్లారిటీ ఇచ్చింది. మామూలుగా ఇండస్ట్రీ అంటే కష్టాలు ఉంటాయని, కానీ క్యాస్టింగ్ కౌచ్‌లాంటి కష్టాలు తనకు ఎప్పుడూ ఎదురవ్వలేదని చెప్పింది. తనను ఎవరూ కమిట్మెంట్ అడగలేదని క్లారిటీ ఇచ్చింది. మామూలుగా ఈవెంట్స్‌లో దగ్గరకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం లాంటి అనుభవాలు ఎదురయ్యాయని బయటపెట్టింది. అలాంటి సమయాల్లో అలా మాట్టాడొద్దని, తనకు నచ్చదని ముక్కుసూటిగా చెప్పేస్తానని అంటోంది శుభశ్రీ. అమ్మాయిలకు ఇలాంటివి కామన్‌గా జరుగుతాయి కాబట్టి హ్యాండిల్ చేయాలి అంటూ కూల్‌గా చెప్పింది.
బెస్ట్ ఫ్రెండ్స్ వద్దు
మిస్ ఇండియా అయిపోయింది కాబట్టి తన తరువాతి టార్గెట్ మిస్ వరల్డ్ అని బయటపెట్టింది శుభశ్రీ. పైగా తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరు లేరని తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ లేరని చెప్పింది. ఒకప్పుడు తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ తనను ఎప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవారని, అందుకే జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ అనేవారిని వద్దనుకున్నానని తెలిపింది. ప్రేమ విషయంలో తనకు చాలా సిగ్గు అని వెల్లడించింది. తెలుగులో తన ఫేవరెట్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అంటూ తనకు వారి మీద ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది. విజయ్ దేవరకొండతో క్యాండిల్ లైట్ డిన్నర్‌కు సిద్ధమని చెప్పింది. ఇక సౌత్‌లో ఎన్నో భాషలు ఉండగా.. నార్త్ నుండి వచ్చి తెలుగు సినీ పరిశ్రమనే ఎందుకు ఎంచుకున్నారు అని అడగగా.. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలేస్తుందని, అందులో మాస్ మసాలా ఉంటుందని, ఇదంతా తనకు ఇష్టమని చెప్పింది శుభశ్రీ.
Also Read: మళ్లీ డ్రగ్స్ కేసులో నవదీప్, ప్రస్తుతం పరారీలో - కీలక వివరాలు చెప్పిన సీపీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial