By: Satya Pulagam | Updated at : 15 Sep 2023 07:58 AM (IST)
'ఎంవై 3'లో శాంతను భాగ్యరాజ్, హన్సిక, మ్యుగెన్ రావు (Image Courtesy : ihansika / Instagram)
ఎంవై 3 వెబ్ సిరీస్
రొమాంటిక్ కామెడీ
దర్శకుడు: ఎం రాజేష్
Artist: హన్సిక, మ్యుగెన్ రావు, శాంతను భరద్వాజ్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : ఎంవై 3
రేటింగ్ : 1.5/5
నటీనటులు : హన్సిక మోత్వానీ, మ్యుగెన్ రావు, శాంతను భరద్వాజ్, జననీ అయ్యర్, అనీష్ కురువిల్లా, సుబ్బు పంచు అరుణాచలం, వీజే పార్వతి తదితరులు
ఛాయాగ్రహణం : కార్తీక్ ముత్తు కుమార్
సంగీతం : గణేశన్
నిర్మాణం : ట్రెండ్ లౌడ్
దర్శకత్వం : ఎం రాజేష్
విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఎపిసోడ్స్ : 9
తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా హన్సిక మోత్వానీ (Hansika) 50కు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పుడు 'ఎంవై 3' వెబ్ సిరీస్ (MY3 Web Series)తో ఆమె ఓటీటీకి పరిచయమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney plus hotstar)లో విడుదలైంది. తమిళంలో తెరకెక్కించిన 'ఎంవై 3'ని తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అనువదించారు.
కథ (MY3 Web Series Story) : ఆదిత్య చంద్రశేఖర్ (మ్యుగెన్ రావు)కు వేల కోట్ల ఆస్తి ఉంది. అయితే, అందరితో అతను కలవలేదు. హ్యూమన్ ఎలర్జీ ఉంది. ఎవరినైనా కలిస్తే రాషెస్ వస్తాయి. చిన్నతనంలో తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరిగా పెరుగుతాడు. ఇలియాస్ (శాంతను భాగ్యరాజ్) తయారు చేసిన ఎంవై 3 రోబో ఆదిత్య కంట పడుతుంది. ఆ రోబో మూడు నెలలు తనతో పాటు ఇంట్లో ఉండేలా అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆదిత్యకు రోబో డెలివరీ చేయడానికి ముందు క్రాష్ అవుతుంది. తన ఎక్స్ లవర్ మైత్రి (హన్సిక) రూపురేఖలతో రోబో డిజైన్ చేస్తాడు ఇలియాస్. మరో మార్గం లేక, ఏమీ చేయలేక... మైత్రి దగ్గరకు వెళ్లి ఆదిత్య ఇంట్లో రోబోలా యాక్ట్ చేయమని కన్వీన్స్ చేస్తాడు.
ఎంవై 3 రోబోలా నటిస్తున్న మైత్రితో ఆదిత్య ప్రేమలో పడతాడు. జీవితాంతం ఆ రోబో తనతో ఉండాలని, అందుకు ఎన్ని డబ్బులైనా ఇస్తానని చెబుతాడు. అప్పుడు ఇలియాస్ ఏం చేశాడు? మైత్రి ఫీలింగ్ ఏంటి? ఎంవై 3 రోబో కాదని, మైత్రి అని ఆదిత్యకు ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏమైంది? అనేది డిజిటల్ స్క్రీన్ మీద చూడాలి.
విశ్లేషణ (MY3 Web Series Review) : 'ఎంవై 3' తెలుగు డైలాగులు ఎవరు రాశారో కానీ ఆ రచయితను అభినందించాలి. సిరీస్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా '1990లలో వచ్చిన జోక్ ఇది' అని ఓ డైలాగ్ రాశారు. ఒరిజినల్ వెర్షన్ తమిళంలో కానీ, హిందీ & కన్నడ భాషల్లో గానీ ఆ డైలాగ్ లేదు. తెలుగు రైటర్ ఎవరో స్పేస్ తీసుకుని మరీ సిరీస్ మీద సెటైర్ వేసినట్లు అనిపించింది. అప్పటి వరకు అవుట్ డేటెడ్ సన్నివేశాలకు డైలాగులు రాసి రాసి ఆయనకు కూడా బోర్ కొట్టిందేమో!? అందుకే, ఆ సెటైర్ వేశారేమో!? నిజంగా 1990లలో రావాల్సిన సిరీస్ 'ఎంవై 3'! అంటే... సీన్లు అంతలా సాగదీశారు.
'ఎంవై 3' రోబో స్థానంలో మైత్రి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు ఆదిత్యకు తప్పకుండా నిజం తెలుస్తుందని చిన్న పిల్లలు సైతం ఊహిస్తారు. రోబోగా రెండో ఎపిసోడ్‌లో హన్సిక వెళితే... తొమ్మిదో ఎపిసోడ్ వరకు ముగెన్ రావుకు తెలియదు. అంతలా సిరీస్ సాగదీశారు. సీరియళ్లలో స్క్రీన్ ప్లే కూడా ఇంకా స్పీడుగా ఉంటుంది. హన్సిక రోబో కాదు, మనిషి అని తెలుస్తుందేమో!? దొరికేస్తుందేమో!? అని ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ఉత్కంఠ కలిగించకుండా దర్శకుడు సిరీస్ తీశారు. థ్రిల్ ఏమాత్రం ఇవ్వని సిరీస్ ఇది! ఇక, జోక్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులను నవ్వించే సీన్లు చాలా తక్కువ.
కొరియన్ డ్రామాలు చూసే ప్రేక్షకులకు 'ఎంవై 3' అసలు కొత్తగా అనిపించదు. 'ఐ యామ్ నాట్ ఎ రోబోట్'కు అఫీషియల్ ఇండియన్ అడాప్షన్ ఇది. ఆ కొరియన్ సిరీస్ చూడని ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే అంశాలు 'ఎంవై 3'లో తక్కువ. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ తీసిన 'రోబో' ఛాయలు కనిపిస్తాయి. 'ఎంవై 3'లో కామెడీ, రొమాన్స్ వర్కవుట్ కాలేదు. టెక్నికల్ అంశాల పరంగా కూడా సోసోగా ఉంది. కాన్సెప్ట్ పరంగా 'ఎంవై 3' ఓకే. కానీ, కథను ముందుకు తీసుకువెళ్లిన తీరు గానీ, ఆ కామెడీ గానీ ఏమాత్రం ఆసక్తికరంగా లేదు.
'ఎంవై 3'లో వినోదానికి, భావోద్వేగభరిత సన్నివేశాలకు మంచి ఆస్కారం ఉంది. ఎక్స్ లవర్ మరొకరికి దగ్గరైతే అబ్బాయి పరిస్థితి నుంచి హీరోకి హీరోయిన్ దగ్గరయ్యే సీన్స్ వరకు ఏదీ కనెక్ట్ అయ్యేలా తీయలేదు. ప్రతి సన్నివేశం కృతకంగా ఉంది.
నటీనటులు ఎలా చేశారంటే : హన్సిక డ్యూయల్ రోల్ చేశారు. రోబోగా పర్ఫెక్ట్ యాప్ట్! పలు సన్నివేశాల్లో నిజంగా బొమ్మలా ఉన్నారు. సాధారణ అమ్మాయిగా నటించిన సన్నివేశాలు చూస్తే... కెరీర్ ప్రారంభానికి, ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది. సేమ్ రొటీన్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. కొత్తగా చేసింది ఏమీ లేదు. చివరి రెండు ఎపిసోడ్లలో ఎమోషనల్ సీన్లలో మాత్రమే హన్సిక మెప్పించారు.
హీరోగా నటించిన మ్యుగెన్ రావు పర్వాలేదు. అయితే... హన్సికతో ఆయన జోడీ సెట్ కాలేదు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరకపోవడంతో కొన్ని సన్నివేశాల్లో ఫీల్ రాలేదు. అనీష్ కురువిల్ల, ఆయన తనయుడు మధ్య వచ్చే సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడతాయి. శాంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ నటన ఓకే. రామ్, శ్యామ్ పాత్రల్లో నటించిన ఇద్దరికీ రాసిన జోకులు అసలు నవ్వించలేదు.
Also Read : 'తురుమ్ ఖాన్‌లు' రివ్యూ : ముగ్గురు హీరోలు నవ్వించారా? టార్చర్ పెట్టారా?
చివరగా చెప్పేది ఏంటంటే : 'ఎంవై 3'లో కామెడీ లేదు. క్యూట్, రొమాంటిక్ & లవ్లీ మూమెంట్స్ అసలే లేవు. రొమాంటిక్ కామెడీ కనుక థ్రిల్ ఆశించవద్దు. ఓటీటీ కనుక ఫార్వర్డ్ బటన్ మీద చెయ్యి వేస్తూ ముందుకు వెళదామని, చూద్దామని ట్రై చేసినా సరే కష్టమే. కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసమే 'ఎంవై 3'.
Also Read : జవాన్ రివ్యూ: షారుక్ ఖాన్ మాస్ యాక్షన్ అవతార్ ఎలా ఉంది? ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర గెలుస్తాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ, ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం !
‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!
Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?
Etela Rajender: గ్రూప్ 1 పరీక్ష రద్దు- తెలంగాణ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్
Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్
మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి, గన్ మిస్ ఫైర్
Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
/body>