By: ABP Desam | Updated at : 08 Sep 2023 10:22 AM (IST)
'తురుమ్ ఖాన్‌లు' సినిమాలో ప్రధాన తారాగణం
తురుమ్ ఖాన్‌లు
రూరల్ కామెడీ డ్రామా
దర్శకుడు: ఎన్ శివ కళ్యాణ్
Artist: శ్రీరామ్ నిమ్మల, 'జబర్దస్త్' ఐశ్వర్య, దేవరాజ్ పాలమూర్, సీతా మహాలక్ష్మి
సినిమా రివ్యూ : తురుమ్ ఖాన్‌లు
రేటింగ్ : 1/5
నటీనటులు : శ్రీరామ్ నిమ్మల, 'జబర్దస్త్' ఐశ్వర్య, దేవరాజ్ పాలమూర్, సీతా మహాలక్ష్మి, అవినాష్ చౌదరి, విజయ, శ్రీయాంక తదితరులు
ఛాయాగ్రహణం : అంబటి చరణ్
నేపథ్య సంగీతం : వినోద్ యాజమాన్య
స్వరాలు : అఖిలేష్ గోగు, రియాన్
నిర్మాత : ఎండీ అసిఫ్ జానీ
రచన, దర్శకత్వం : ఎన్ శివ కళ్యాణ్
విడుదల తేదీ: సెప్టెంబర్ 08, 2023
తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఇటీవల 'బలగం', 'దసరా' గానీ... అంతకు ముందు 'ఫిదా' వంటివి అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మధ్య 'పరేషాన్' కూడా నవ్వించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన తాజా సినిమా 'తురుమ్ ఖాన్‌లు' (Thurum Khanlu Review). 'నీదీ నాదీ ఓకే కథ', 'విరాట పర్వం' చిత్రాలతో ప్రేక్షకుల్లో గౌరవం పొందిన వేణు ఊడుగుల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ఎన్. శివ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Thurum Khanlu Story) : మరదలు లలిత ('జబర్దస్త్' ఐశ్వర్య)తో ఏడడుగులు వేయాలని తుపాకుల గూడెంలో ఛోటా పొలిటీషియన్ శంకర్ (శ్రీరామ్ నిమ్మల) ఎప్పట్నుంచో కలలు కంటాడు. చాలా కష్టపడి మామను ఒప్పించి కరోనా కాలంలో పెళ్లికి రెడీ అవుతాడు. అతిథుల లిస్టు వంద దాటుతుంది. పీటల మీద ఉండగా... పోలీసులు రావడంతో జనాలు చెల్లాచెదురు అవుతారు. పెళ్లి ఆగుతుంది. అసలు, అక్కడికి పోలీసులు రావడానికి కారణం ఆ ఊరికి చెందిన విరాజ్ బ్రహ్మ (దేవరాజ్ పాలమూరు). అతడికి 40 ఏళ్ళు వచ్చినా సరే పెళ్లి కాదు. ఆ అక్కసుతో కంప్లైంట్ ఇస్తాడు. అది శంకర్ తెలుసుకుంటాడు. విరాజ్ బ్రహ్మ మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. భర్త మరణించిన తర్వాత ఇద్దరు పిల్లలను పోషిస్తూ వ్యవసాయం చేస్తున్న భారతి (సీతా మహాలక్ష్మి)తో విరాజ్ బ్రహ్మ ప్రేమ కథ ఏమిటి? శంకర్ అనుచరుడు, కాలేజీ స్టూడెంట్ విష్ణు (అవినాష్ చౌదరి) ప్రేమకు విరాజ్ బ్రహ్మ ఎలా అడ్డుపడ్డాడు? శంకర్, విష్ణు కలిసి విరాజ్ బ్రహ్మను ఏం చేశారు? శంకర్ పెళ్ళికి ఎన్ని అడ్డంకులు, కష్టాలు వచ్చాయి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Thurum Khanlu Review) : సినిమా మొదలైన కాసేపటికి రాబోయే రెండు గంటలు మన ఫ్యూచర్ ఏమిటనేది చెప్పవచ్చు. 'తురుమ్ ఖాన్‌లు' కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ముందుంది మొసళ్ల పండగ అని పది నిమిషాలకు ప్రేక్షకుడికి అర్థం అవుతుంది.
సినిమాకు ఒక స్క్రీన్ ప్లే, స్ట్రక్చర్ ఉంటాయి. తలాతోకా లేకుండా కొన్ని సినిమాలు వస్తుంటాయి. అందుకు ఉదాహరణ... 'తురుమ్ ఖాన్‌లు'. కథ ఎక్కడ మొదలైంది? ఎక్కడికి వెళుతుంది? అని ప్రేక్షకుడు ఎంత ఆలోచించినా అర్థం కాని విధంగా ఎన్. శివ కళ్యాణ్ సినిమాను ప్రారంభించారు. శంకర్ కథ మొదలైన కాసేపటికి విష్ణు కథ వస్తుంది. సీన్స్ మధ్య లింక్ లేకుండా, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్లు సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లారు. చాలా సేపటికి గానీ ముగ్గురు హీరోలు ఒక్క చోటకు రారు. అసలు కథ అర్థం కాదు. కామెడీతో పాటు సినిమాలో అన్నీ ఉండాలని అన్నట్లు రైతుల అప్పులు, ఫ్యామిలీ కష్టాలు వంటివి కూడా చూపించారు. అయితే... ఆ ఎమోషన్స్ ఏవీ ఆకట్టుకోవు. బలవంతంగా కథలో ఇరికించినట్టు ఉంటాయి.
సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య అనుకుంటే పొరబడినట్లే! సీతా మహాలక్ష్మి ఎక్కువ సేపు కనిపిస్తారు. హీరో శ్రీరామ్ నిమ్మల కాదు... దేవరాజ్ పాలమూర్! దేవరాజ్, సీత మధ్య ట్రాక్, ఆ అడల్ట్ జోక్స్ కొంత నవ్విస్తాయంతే!
వేణు ఊడుగుల సినిమాల్లో రైటింగ్ మాత్రమే కాదు, టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా బావుంటాయి. మరి, ఆయన దగ్గర శివ కళ్యాణ్ ఏం నేర్చుకున్నారో? కెమెరా వర్క్, ఎడిటింగ్, మ్యూజిక్... ఏదీ బాలేదు. వినోద్ యాజమాన్య లౌడ్ రీ రికార్డింగ్ కూడా తలపోటు తెప్పిస్తుంది. మిగతా టెక్నికల్ అంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 'తురుమ్ ఖాన్‌లు' సినిమా కంటే షార్ట్ ఫిల్మ్స్ క్వాలిటీగా తీస్తున్నారు.
నటీనటులు ఎలా చేశారంటే : శంకర్ పాత్రలో తెలంగాణ యువత ఆటిట్యూడ్ బాగా చూపించారు శ్రీరామ్ నిమ్మల. కానీ, సన్నివేశాలు బలంగా లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? శ్రీరామ్ నిమ్మల జోడీగా నటించిన ఐశ్వర్య ఉల్లింగాల ('జబర్దస్త్' ఐశ్వర్య) పాత్రకు కథలో పెద్ద స్కోప్ లేదు. కొన్ని సీన్లలో కనిపిస్తారంతే! క్యారెక్టర్ వరకు ఆమె న్యాయం చేశారు.
విరాజ్ బ్రహ్మ క్యారెక్టరైజేషన్ వల్ల దేవరాజ్ పాలమూర్ రిజిస్టర్ అవుతారు. పెళ్లి కాని ఫ్రస్ట్రేషన్ వల్ల చేసే పనులు కొంత నవ్వించాయి. భారతిగా సీతా మహాలక్ష్మికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ లభించింది. అవినాష్ చౌదరితో పాటు ఆర్టిస్టుల్లో ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ. నటనలో ఓనమాలు కూడా సరిగా దిద్దని వాళ్ళతో పెద్ద క్యారెక్టర్లు చేయించారు. అనుభవలేమి కారణంగా ఆ పాత్రలు తేలిపోయాయి.
Also Read : జవాన్ రివ్యూ : షారుక్ ఖాన్ మాస్ యాక్షన్ అవతార్ ఎలా ఉంది? ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర గెలుస్తాడా?
చివరగా చెప్పేది ఏంటంటే : దేవరాజ్ క్యారెక్టర్ మీద వేసిన అడల్ట్ జోక్స్ కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను నవ్విస్తాయి. వాటి కోసం రెండు గంటలు థియేటర్లలో కూర్చుకోవడం, సినిమాను భరించడం కష్టమే. ఒక దశలో ఈ సినిమా టార్చర్ పెడుతుంది. ఈజీగా స్కిప్ కొట్టేయడం ఆరోగ్యానికి మంచిది.
Also Read : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రివ్యూ : అనుష్క, నవీన్ పోలిశెట్టిల సినిమా హిట్టా? ఫట్టా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే తక్కువ ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా
Month Of Madhu Trailer : ఇండియన్ భార్యాభర్తల మధ్యలో అమెరికన్ అమ్మాయి - నెలలో ఏమైంది మధు?
Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
టిబెట్ విషయంలో దలైలామా వెనక్కి తగ్గారా? స్వాతంత్య్రం వద్దనడం వెనక ఉద్దేశమేంటి?
/body>