Top 10 Headlines Today: తెలంగాణలో ఐటీ రైడ్స్, తమిళనాడులో మంత్రి అరెస్టు, రోడ్డెక్కనున్న వారాహి
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
ఐటీ రైడ్స్ కలకలం
తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీళ్లిద్దరి కంపెనీల్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తమిళనాడు మంత్రి అరెస్టు
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ నివాసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించింది. దాదాపు 17 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. అనంతరం తెల్లవారుజామున 2 గంటల సమయంలో వారిని చెన్నై నుంగంబాక్కంలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. సెంథిల్ బాలాజీని విచారణ కోసం తీసుకెళ్లారా లేక అరెస్టు చేశారా అనే దానిపై సందిగ్ధత నెలకొనగా, ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేటి నుంచి వారాహి యాత్ర
నేటి(బుధవారం, జూన్ 14 ) నుంచి వారాహి ప్రజాక్షేత్రంలోకి రానుంది. అన్నవరం నుంచి జనసేన అధినతే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. ఉదయం 9 గంటలకు సత్యదేవుడి దర్శనం తర్వాత యాత్ర మొదలుకానుంది. ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేస్తున్నారు పవన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్ర.యాణ భారం
భాగ్యనగరం సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచింది. సీనియర్ సిటిజెన్లు(పురుషులు, మహిళలు, 12 ఏళ్ల పైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా.. దాన్ని 90 రూపాయలకు పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు జూన్ 10 నుంచి జులై 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. గతంలో టీ-24 టికెట్ సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండగా.. ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించింది. తాజాగా పాత ధరల్ని పునరుద్ధరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సత్తా చాటిన ఏపీ విద్యార్థులు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ-2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 13న రాత్రి ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అవసరమైన వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. నీట్ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్ ఇండియా రెండో ర్యాంకుతో సత్తా చాటాడు. నీట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి 99.99 పర్సంటైల్‌తో అదరగొట్టారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి తర్వాత ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తడబడుతోందా?
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ బీజేపీపై విమర్శలు చేయలేదు. ఢిల్లీలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తోంది. అంతే కాదు బీజేపీకి సహకరించలేదని ఇతర పార్టీలపై సీఎం జగన్ రెండు సార్లు హితవులు చెబుతూ ట్వీట్లు కూడా చేశారు. కానీ బీజేపీ మాత్రం ఏపీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతి మయమని.. సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో వైఎస్ఆర్సీపీ తడబడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ విమర్శలకూ టీడీపీనే కారణం అని చెబుతూండటమే దీనికి కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జాతీయ స్థాయిలో నెట్ వర్క్ ఏర్పాటు
తెలంగాణలో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. మొత్తం రాష్ట్ర నేతలకే వదిలేకుండా ... జాతీయ స్థాయిలో ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని.. అగ్రనేతలను భాగస్వామ్యం చేస్తోంది. ప్రియాంకా గాంధీ తెర వెనుక. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెర ముందు తెలంగాణ ఎన్నితల బాధ్యతలు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ రాజకీయ వ్యూహాల్లో దిట్ట. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆయన వ్యూహమేనని చెబుతూంటారు. మరి తెలంగాణలోనూ ఆయన మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా ? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కోహ్లీ అలా ఎందుకు చేశాడో తెలియదన్న దాదా
విరాట్ కోహ్లీ హఠాత్తుగా టెస్టు కెప్టెన్సీ ఎందుకు వదిలేశాడో ఇప్పటికీ తెలియదని సౌరవ్ గంగూలీ అన్నాడు. అతడి నిర్ణయంతో బీసీసీఐ బిత్తరపోయిందన్నాడు. అతడి తర్వాత నాయకత్వానికి రోహిత్ శర్మే అత్యుత్తమంగా కనిపించాడని పేర్కొన్నాడు. ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా ప్రదర్శన బాగానే ఉందన్నాడు. కేవలం సెమీస్ లేదా ఫైనళ్లలోనే ఓడిపోతోందని వెల్లడించాడు. క్రీజులో నిర్భయంగా ఆడితే ఫలితం వస్తుందని సూచించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రాజమౌళితో అమిత్‌షా భేటీ
తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కలవనున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. అదే సమయంలో ఆయన రజాకార్ ఫైల్స్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా.. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఓ స్టార్ హోటల్‌లో విందు ఇచ్చేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆ విందు భేటీ రద్దైంది. ఈసారి రాజమౌళి ఒక్కరే అమిత్ షాతో భేటీ అయ్యే అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి