అన్వేషించండి

టీడీపీ కోవర్టులు రాసిన స్క్రిప్ట్ బీజేపీ అగ్రనేతలు చదివారా ? కౌంటర్ ఇవ్వడంలో వైఎస్ఆర్‌సీపీ తడబడుతోందా ?

బీజేపీ అగ్రనేతలు వైెస్ఆర్‌సీపీని విమర్శించడం వెనుక టీడీపీ ఉందా ?జేపీ నడ్డా, షా వ్యాఖ్యల స్క్రిప్ట్ టీడీపీ నుంచి వెళ్లిన వారు రాశారా ? వైసీపీ నేతలు బీజేపీని తిరిగి విమర్శించడానికి వెనుకాడుతున్నారా?

 

YSRCP Politics :  ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ బీజేపీపై విమర్శలు చేయలేదు. ఢిల్లీలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తోంది. అంతే కాదు బీజేపీకి సహకరించలేదని  ఇతర పార్టీలపై సీఎం జగన్ రెండు సార్లు  హితవులు చెబుతూ ట్వీట్లు కూడా చేశారు. కానీ బీజేపీ మాత్రం ఏపీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతి మయమని.. సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో వైఎస్ఆర్సీపీ తడబడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ విమర్శలకూ టీడీపీనే కారణం అని చెబుతూండటమే దీనికి కారణం. 

బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టుల పనేనని వైఎస్ఆర్సీపీ విమర్శలు 
 
అమిత్ షా, జేపీ నడ్డాలు స్వతహాగా తమను విమర్శించలేదని ఇదంతా టీడీపీ కుట్ర  అని చివరికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఓ వాదనను తెరపైకి తీసుకు వచ్చి వాదించడం ప్రారంభించారు. కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో పెద్దగా కనిపించని విజయసాయిరెడ్డి హఠాత్తుగా  మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సైలెన్స్ కు తెర దించారు. అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలు టీడీపీ కోవర్టులపనేనన్నట్లుగా ట్వీట్ చేశారు. 

 

 

బీజేపీ విమర్శలకూ టీడీపీనే కారణం అని చెబితే వర్కవుట్ అవుతుందా ?

టీడీపీ నుంచి మూడున్నరేళ్ల క్రితం సుజనా చౌదరి, సీఎం రమేష్ , టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలు బీజేపీలో చేరారు. నిజానికి వారు అప్పుడు రాజ్యసభ సభ్యులు. ఈ మధ్య కాలంలో వారి పదవీ కాలం పూర్తయింది. ఎవరికీ మరోసారి చాన్స్ దక్కలేదు. అలాగని బీజేపీలో కీలక పదవులు కూడా ఏమీ లేవు. సీనియర్ నేతలుగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో వారి పాత్ర కూడా పెద్దగా ప్రస్తావనకు రాలేదు.కానీ.. వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం బీజేపీ..  తమకు వ్యతిరేకంగా ఏం చేసినా వీరి పనేనని వాదిస్తూ వస్తున్నారు. వీరందర్నీ చంద్రబాబే బీజేపీలోకి పంపించారని వాదిస్తూ ఉంటారు. నిజానికి వీరు బీజేపీలో చేరారు.. టీడీపీ నుంచి చాలా మంది వైసీపీలో చేరారు. మరి వారినీ చంద్రబాబే పంపించారనే లాజిక్ ఇక్కడ వర్కవుట్ అవుతుందానే అనే ప్రశ్నలు సహజంగానే ఇతర పార్టీల నుంచి వస్తూంటాయి. ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్‌సీపీ నేతలు స్పందించరు. కానీ బీజేపీలో చేరిన వారే టీడీపీ కోవర్టులని సందర్భాన్ని బట్టి విమర్శిస్తూ ఉంటారు. 

బీజేపీని విమర్శించలేని బలహీనతను బయట పెట్టుకున్నట్లు కాదా ?

వైఎస్ఆర్‌సీపీకి బీజేపీతో విరోధం పెట్టుకోవడం ఇష్టం లేదు. దానికి రాజకీయ కారణాలు అయినా  .. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కారణం అయినా సరే..  ఆ పార్టీ తొందరపడాలని అనుకోవడం లేదు. సీఎం జగన్ స్పందిస్తేనే..వాల్యూ ఉంటుంది. ఇతర నేతలు స్పందించడం వల్ల రాష్ట్ర స్థాయి రాజకీయాల కోణంలోనే ఉంటుంది. అందుకే.. రాష్ట్ర నేతలు స్పందిస్తున్నారు.. అదీ కూడా టీడీపీ ప్రభావం అంటున్నారు కానీ..  బీజేపీపై తిరుగు విమర్శలకు పెద్దగా సిద్ధపడటం లేదు. వీలైనంత వరకూ టీడీపీకి లింక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వైఎస్ఆర్‌సీపీ ఎస్కేపిజానికి నిదర్శనమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget