News
News
వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: క్షణాల్లో అప్‌డేట్ అవ్వాలంటే ఈ టాప్‌ టెన్ న్యూస్ చూస్తే చాలు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today:

తీవ్ర తుపానుగా మోచా
నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ఈ రోజు ఉదయం 5:30కి అదే ప్రదేశంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సుమారుగా కొంత సమయం వాయువ్యదిశగా కదిలి ఆ తర్వాత ఉత్తర - వాయవ్య దిశ వైపుగా కదులుతూ క్రమంగా బలపడి ఈ రోజు సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది క్రమంగా ఉత్తర - వాయువ్య దిశల వైపుగా కదులుతూ రేపు 11వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

హార్ట్ టచింగ్‌ సీన్ 
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకర్గంలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ రాకతో జన ప్రవాహం ఉప్పెనలా మారడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎండ తీవ్రత కూడా అత్యంత ఎక్కువగా ఉండటంతో అభిమానులు పోలీసులు తీవ్ర అలసటకు గురైన పరిస్థితి కనిపించింది.  ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి అత్యంత సమీపంలో విధులు నిర్వహిస్తున్న పి. గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ చెమటలు కక్కుతూ కొంత అలసటగా కనిపించారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ సీఐ ప్రశాంత్ కుమార్ కు ఎనర్జీ డ్రింకును అందించారు. అది తీసుకున్న సీఐ వెంటనే ఆ డ్రింక్ సేవించి కొంత ఉపశమనం పొందారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

కేసీఆర్‌ ప్లాన్ 
ఎమ్మెల్యేల అవినీతి వల్ల ప్రభుత్వంపై అవినీతి మరక పడటం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు కోపం తెప్పిస్తోంది.  సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికపై ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం లేకుండా చేయాలని నిర్ణయానికి వచ్చారు. జోక్యం చేసుకోవద్దని పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జి ల ద్వారా అధినేత ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి.  ఎమ్మెల్యేలు, నాయకులే కాదు.. పార్టీలో, ప్ర భుత్వంలో ఎంతటి స్థాయి ఉన్నవారైనా సరే రెకమండ్‌ చేసిన అంశాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందేనని కేసీఆర్ మౌఖికంగా ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రిలిమినరీ కీ విడుదల
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహించిన ఎస్‌ఐ, ఏఎస్‌ఎస్‌ తుది పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. ఈమేరకు పోలీసు నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస రావు మే 10న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' మే 11న వెల్లడించనున్నట్లు తెలిపారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 14న సాయంత్రం 5 గంటల వరకు తెలపవచ్చు. అయితే ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు ఆధారాలను నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించారు. ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ, ఎస్‌ఐ ఐటీ అండ్‌ సీఓ టెక్నికల్‌ పేపర్ల (ఆబ్జెక్టివ్‌ టైప్‌) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్‌ఐ పీటీవో పరీక్షను మార్చి 26న, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ పేపర్లను ఏర్పిల్‌ 8న, జనరల్‌ స్టడీస్‌ పేపర్ల ఫైనల్‌ ఎగ్జామ్‌ను ఏప్రిల్‌ 9న నిర్వహించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏం జరుగుతోంది?
వాట్సాప్‌లో ప్రైవసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ఈ మెసెంజర్ యాప్‌ను "నమ్మలేం" అంటూ చేసిన కామెంట్స్‌ అంతర్జాతీయంగా దుమారం రేపాయి. దీనిపై భారత ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. వాట్సాప్‌లో ప్రైవసీని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ట్విటర్‌లోని ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోద్ దబిరి ట్వీట్‌కు స్పందిస్తూ రాజీవ్ ఈ ప్రకటన చేశారు. తాను నిద్రపోతున్న సమయంలో వాట్సాప్‌ తన మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసిందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు దబిరి. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తున్నట్టు చెప్పారు. ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇదే తాను అబ్జర్వ్ చేసినట్టు వెల్లడించారు. ఇదే ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ మరోసారి ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ వాట్సాప్‌పై విమర్శలు చేశారు. "వాట్సాప్‌ని నమ్మడానికి వీల్లేదు" అంటూ ట్వీట్ చేశారు. అయితే...దీనిపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ తప్పకుండా విచారణ జరుపుతామని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

కర్ణాటక ఎవరిది?
కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఏబీపీ-సీఓటర్ ఎగ్టిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. ఆ పార్టీకి 100 నుంచి 112 సీట్లు వరకూ రావొచ్చని ఎగ్దిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే మెజార్టీకి కావాల్సింది 113 స్థానాలు. బీజేపీకి 83-95 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జేడీఎస్‌కు 21-29, ఇతరులకు 2-6 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా ఎగ్టిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయో కింద చూడవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

కాస్ట్లీ పొటాటో
బంగాళాదుంపలు అంటే పిల్లలకూ, పెద్దలకు కూడా చాలా ఇష్టం. వాటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ దుంపలకు చాలా విలువ ఉంది. ఇవి చాలా తక్కువ ధరకే దొరకడం వల్ల తినేవారి అధికంగా ఉంది. అంతేకాదు ఏడాది పొడువునా ఇవి పండుతాయి. కాలంతో పనిలేదు. అందుకే అధికంగా మార్కెట్లలో దొరుకుతాయి. కిలో 20 నుంచి 30 రూపాయలకే లభిస్తాయి. కాబట్టి పేదవారు కూడా వీటిని అధికంగా తింటారు. అయితే వీటిలో ఒక రకమైన దుంప ఉంది. వాటిని కొనాలంటే మాత్రం నెల జీతం ఖర్చు పెట్టుకోవాల్సిందే. వీటిని కేవలం ఫ్రాన్స్ లో మాత్రమే పండిస్తారు. ఈ బంగాళదుంపల రకం పేరు ‘లే బోనోట్’. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఢిల్లీ ఇంటికి
చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్‌ 2023 సీజన్ 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిల్ ఓవర్లలో చాలా నిదానంగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులా ఓటమి పాలైంది. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

సమస్యలు చెప్పుకుంటున్న వాళ్లెవరు?
జగనన్నకు చెప్పుకుందాం అనే  వినూత్న కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.  తొలిరోజే ప్రజల నుండి విశేష ఆదరణ లభిచింది. ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ఫోన్‌ కాల్స్‌ కలవక ఫిర్యాదు దారులు ఇబ్బందులు పడ్డారు.    అందిన ఫిర్యాదులను శాఖల వారీగా వేరుచేసేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా మోనటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఎంత వేగంగా స్పందిస్తే అంత ప్రజల మద్దతు పొందే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

గోల్డ్ రేట్‌
అమెరికా ఏప్రిల్‌ నెల ద్రవ్యోల్బణం డేటా అంచనాల కంటే తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర పుంజుకుంది. ప్రస్తుతం 2,037 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 250, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 280 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర ₹ 100 తగ్గింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Published at : 11 May 2023 08:04 AM (IST) Tags: AP news today Telangana LAtest News Todays latest news Top 10 headlines today

సంబంధిత కథనాలు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!