అన్వేషించండి

KCR New Plan : సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల పెత్తనానికి చెక్ - కేసీఆర్ రూటు మారుస్తున్నారా ?

సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఎమ్మెల్యేల పెత్తనం తగ్గించినట్లుగా చెబుతున్నారు.

KCR New Plan :   ఎమ్మెల్యేల అవినీతి వల్ల ప్రభుత్వంపై అవినీతి మరక పడటం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు కోపం తెప్పిస్తోంది.  సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికపై ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం లేకుండా చేయాలని నిర్ణయానికి వచ్చారు. జోక్యం చేసుకోవద్దని పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జి ల ద్వారా అధినేత ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి.  ఎమ్మెల్యేలు, నాయకులే కాదు.. పార్టీలో, ప్ర భుత్వంలో ఎంతటి స్థాయి ఉన్నవారైనా సరే రెకమండ్‌ చేసిన అంశాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందేనని కేసీఆర్ మౌఖికంగా ఆదేశించారు. 

గతంలో ఎమ్మెల్యేల చాయిస్ మేరకు లబ్దిదారుల ఎంపిక  !

లబ్దిదారుల ఎంపిక బాధ్యతను కేసీఆర్ గతంలో ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని  అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఒక్కో దళితబంధు లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారని, కొన్ని సంఘటన లను ఉటంకిస్తూ అధినేత వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది  ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉండటంతో పార్టీ పరంగా కఠిన నిర్ణ యాలు తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలు్సతోంది.  కొద్ది రోజులుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ స్వయం పర్యవేక్షణ మొదలుపెట్టారు. ప్రధానంగా భూ క్రమబద్దీకరణ ప్రక్రియలో ఎమ్మెల్యేల పాత్రకు బ్రేక్‌ వేశారని చెబుతున్నారు. 

అమలు చేయబోయే పథకాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉండనట్లే ! 
  
ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ, పేదల సొంతింటికి రూ.3లక్షల నగదు పారితోషికం లాంటి సంక్షేమ పథకాలను త్వరలో ప్రభుత్వం అమలు చేయనుంది.  క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని గత కొద్ది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్‌ 58, 59ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. వీటి ప్రకారం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పేదలకు నిబం ధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరిస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం కొంతమంది నాయకులకు విస్మయాన్ని కలిగిస్తున్నప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నందున   అధికార యంత్రాంగానికే సర్వాధికారాలు కట్టబెట్టేలా ముఖ్య మంత్రి నిర్ణయాలు తీసుకున్నారు.  

ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ !  

ప్రభుత్వం బహిరంగంగా చెప్పడం లేదు కానీ అధికార పార్టీకి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటు న్నట్లు అధినేత కేసీఆర్‌ సీక్రెట్‌ సర్వేలో తేలిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  ఎన్నికలకు ముందు ఇతరత్రా ప్రయోజనాలు పేదలకు సకాలంలో అందాలన్న సంకల్పంతో ముఖ్య మంత్రి స్వయం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పారదర్శకంగా చేయా ల్సిన పనిని కూడా విపక్షాలు రాజకీయం చేస్తూ, ఓట్ల కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాన్ని నిలువరించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరిగా మారిందని చెబుతున్నారు. కేసీఆర్ నిర్ణయం అధికారికం కాకపోవడంతో ఎమ్మెల్యేలు నోరు మెదపలేకపోతున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget