News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Karnataka Exit Poll 2023 : ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కే మొగ్గు కానీ కుమారస్వామే కింగ్ మేకర్ - ఇవిగో పూర్తి డీటైల్స్

Karnataka Exit Poll 2023 కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఏబీపీ-సీఓటర్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు మొగ్గు కనిపించింది. కానీ హంగ్ రావొచ్చని అంచనా వేసింది.

FOLLOW US: 
Share:

Karnataka Exit Poll 2023 :  కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఏబీపీ-సీఓటర్ ఎగ్టిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. ఆ పార్టీకి 100 నుంచి 112 సీట్లు వరకూ రావొచ్చని ఎగ్దిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే మెజార్టీకి కావాల్సింది 113 స్థానాలు. బీజేపీకి 83-95 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జేడీఎస్‌కు 21-29, ఇతరులకు 2-6 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా ఎగ్టిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయో కింద చూడవచ్చు.  

హైదరాబాద్  కర్ణాటక 

హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో మొత్తం 31 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత చూపిస్తుందని ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్‌కు13-17 సీట్లు లభించే అవకాశం ఉంది. బీజేపీకి 11-15 మధ్య సీట్లు లభిస్తాయి. జేడీఎస్‌కు 0-2 , ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడింటాయి. ఓట్ షేర్ హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీకి 38, కాంగ్రెస్ కు 44, జేడీఎస్‌కు13 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. 

ముంబై కర్ణాటక 

ముంబై కర్ణాటక ప్రాంతంలో 50 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ హోరాహోరీగా రెండు పార్టీలు సీట్లు సాధించే అవకాశం ఉంది. బీజేపీకి  24-28  మధ్య సీట్లు లభిస్తాయి. కాంగ్రెస్ కు 22-26 మధ్య సీట్లు వస్తాయి. జేడీఎస్ , ఇతరులు 0-1 మధ్య గెలుపొందే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 44,  బీజేపీకి 43 శాతం లభించే అవకాశాలు ఉన్నాయి. 

కోస్టల్ కర్ణాటక

కోస్టల్ కర్ణాటక సంప్రదాయకంగా బీజేపీ బలంగా ఉంది. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ బలం స్పష్టంగా కనిపి్స్తోంది. ఇక్కడపూర్తి స్థాయిలో బీజేపీ లీడ్ చూపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం కోస్టల్ కర్ణాటకలో ఉన్న 21 సీట్లలో 19 వరకూ బీజేపీకి దక్కే సూచనలు ఉన్నయి. కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద రెండు నుంచి ఆరు స్థానాలు దక్కించుకునే చాన్స్ ఉంది. ఓటు షేర్ కూడా బీజేపీకి ఏకంగా 49 శాతం లభించనుందని ఎగ్జిట్  పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ కు 37 శాతమే వస్తాయని చెబుతున్నాయి. 

సెంట్రల్ కర్ణాటక

ఇక సెంట్రల్ కర్ణాటకలో మొత్తం 35 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ హోరాహోరీగా పోరు సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీనే లీడ్ సాధించే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ కర్ణాటకలో  కాంగ్రెస్ పార్టీకి 18-22 మధ్య స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కి 12-16 మధ్య అవకాశాలు ఉన్నాయి. 44 శాతం ఓటు షేర్ కాంగ్రెస్‌కు 39 శాతం ఓటు షేర్ బీజేపీకి లభించే అవకాశ ఉంది. 

ఓల్డ్ మైసూరు ప్రాంతం

కర్ణాటకలో గెలుపోటముల్ని నిర్ధారించేది ఓల్డ్ మైసూర్ ప్రాంతం. ఇక్కడ 55 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొదటి నుంచి బీజేపీ బలహీనంగా ఉంది. పోటీ కాంగ్రెస్, జేడీఎస్ మధ్యనే ఉంది. కాంగ్రెస్ 28-32 మధ్య సీట్లు సాధించే అవకాశాలు ఉండగా.. జేడీఎస్‌కు 19-23 మధ్య సీట్లు లభించే చాన్స్ ఉంది. బీజేపీకి 0-4 మధ్య సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఓటు షేర్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ కు 38, జేడీఎస్ కు 29,  బీజేపీకి 26 శాతం వరకూ ఓట్లు లభించవచ్చు. 

గ్రేటర్ బెంగళూరు

గ్రేటర్ బెంగళూరులో మొత్తం 32 స్థానాలు ఉన్నాయి. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో బీజేపీ ఆధిక్యత చూపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ 15-19  మధ్య సాధించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి  11-15 మధ్య స్థానాలు వస్తాయి. జేడీఎస్‌కు 1-4  స్థానాలు రావొచ్చని అంచనా వేశారు. బీజేపీకి 45, కాంగ్రెస్ కు 39 ఓటు బ్యాంక్ లభించే అకాశం ఉంది. 

Published at : 10 May 2023 07:26 PM (IST) Tags: ABP Cvoter Exit Poll Karnataka Election 2023 Punjab Exit Poll Karnataka Exit Poll Live Karnataka Exit Poll Result Karnataka Election Results 2023

ఇవి కూడా చూడండి

Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ

Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్

Nandyala News: చిన్నపిల్లోడిని ఇంత చేశాను- అనుభవం ఉన్న వ్యక్తి చేసిందేంటీ? ఎర్రగుంట్లలో ప్రశ్నించిన జగన్

Nandyala News: చిన్నపిల్లోడిని ఇంత చేశాను- అనుభవం ఉన్న వ్యక్తి చేసిందేంటీ? ఎర్రగుంట్లలో ప్రశ్నించిన జగన్

Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?

Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?

టాప్ స్టోరీస్

Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP

Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP

Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!

Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!

Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?

Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?

Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!

Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!