News
News
వీడియోలు ఆటలు
X

CSK Vs DC: చేజేతులా ఓటమి పాలైన ఢిల్లీ - ప్లేఆఫ్స్ రేసులో ముందడుగేసిన చెన్నై!

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగులతో విజయం సాధించింది.

FOLLOW US: 
Share:

Chennai Super Kings vs Delhi Capitals: చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్‌ 2023 సీజన్ 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిల్ ఓవర్లలో చాలా నిదానంగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులా ఓటమి పాలైంది. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిలీ రౌసో (35: 37 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మనీష్ పాండే (27: 29 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు. పాతిక పరుగులు చేసిన శివం దూబేనే (25: 12 బంతుల్లో, మూడు సిక్సర్లు) చెన్నై సూపర్ కింగ్స్ తరఫున టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. చెన్నై బ్యాటర్లలో ఒక్క బ్యాటర్ కూడా రాణించలేదు. 25 పరుగులే జట్టులో టాప్ స్కోర్. కానీ వచ్చిన వారందరూ చిన్న చిన్న క్యామియోలు ఆడారు. ఈ సిరీస్‌లో మంచి ఫాంలో ఉన్న ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (24: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు), డెవాన్ కాన్వే (10: 13 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యారు. అజింక్య రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.

అయితే శివం దూబే (25: 12 బంతుల్లో, మూడు సిక్సర్లు), అంబటి రాయుడు (23: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు చెలరేగారు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోని (20: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) మెరుపు సిక్సర్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, సుభ్రాంశు సేనాపతి, మిచ్ సాంట్నర్, ఆకాష్ సింగ్, షేక్ రషీద్

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, చేతన్ సకారియా

Published at : 10 May 2023 11:31 PM (IST) Tags: CSK Delhi Capitals DC IPL CSK vs DC IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023 IPL 2023 Match 55

సంబంధిత కథనాలు

BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!

BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి