News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: సమ్మె ఆలోచన విరమించిన విద్యుత్ ఉద్యోగులు- యూత్‌ ఓట్లపై బీజేపీ ఫోకస్ - జైలర్ టాక్ ఎలా ఉంది?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today:

సమ్మె నిర్ణయం వెనక్కి

రాష్ట్రంలోని విద్యుత్‌ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో విద్యుత్‌ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది విద్యుత్‌ సంఘాల జేఏసీ. పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) లో భాగంగా  డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఏపీఎస్‌ పీఈజేఏసీ (APS PEJAC) ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

యూత్‌పై ఫోకస్

తెలంగాణ అసెంబ్లీలో చాపకింద నీరులా విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంది. జాతీయవాద అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. జాతీయవాద అంశాలను ప్రజల్లో మరీముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకునేవిధంగా ప్రస్తావిస్తూనే స్థానిక సమస్యలను కూడా లేవనెత్తాలని భావిస్తోంది. జాతీయవాద అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం వెనక యువత ఓట్లను కొల్లగొట్టడమే కాషాయ పార్టీ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వారాహిపై ఆంక్షలు

విశాఖలో జనసేన వారాహి యాత్రపై పోలీసులు పలు రకాల ఆంక్షలు పెట్టారు. గురువారం నుంచి జనసేన  అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలురకాల ఆంక్షలతో అనుమతి ఇచ్చారు.  పలు నిబంధనలు విధించారు. కొన్ని షరుతలతో విశాఖలో యాత్రకు అనుమతులు జారీ చేశారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని కండీషన్ విధించారు. ఇక వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని షరతు పెట్టారు. జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘటనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అన్నది విజయసాయిరెడ్డినట

ప్రస్తుతం ఏపీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లు ఉంది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు మెగా ఎటాక్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం... 'వాల్తేరు వీరయ్య' 200 డేస్ ఫంక్షన్! పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తగ్గిస్తారా? పెంచుతారా?

దేశంలో బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయో, లేదో అన్న విషయం కాసేపట్లో తెలిసిపోతుంది. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇవాళ ప్రకటిస్తుంది. ఆర్‌బీఐ మూడు రోజుల ఎంపీసీ మీటింగ్‌ ఈ నెల 8న ప్రారంభమై ఈరోజు (ఆగస్టు 10) ముగుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) ఏ నిమిషంలోనైనా లైవ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పెరుగుతున్న గోధమ ధరలు

భారతదేశంలో గోధుమ ధరలు మంగళవారం ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సరఫరా తగ్గడం, పండుగ సీజన్ కు ముందే డిమాండ్ పెరగడంతో గోధుమ ధరలపై ప్రభావం చూపుతోందని డీలర్లు తెలిపారు. దేశంలో అవసరాల కోసం, ధరలను అదుపులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధం విధించినా అంతగా ఫలితం చూపలేదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ధరలను నియంత్రించడానికి తృణధాన్యాలపై దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం కనిపిస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పాక్‌పై విజయం 

ప్రతిష్ఠాత్మక ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ జట్టుపై భారత్ విజయం సాధించింది. చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై 4-0 తేడాతో భారత్ గెలిచింది. దాంతో లీగ్‌ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా ముగించింది. భారత్ ఇదివరకే సెమీస్ చేరగా, పాక్ జట్టు వేరే టీమ్స్ ఫలితాలపై ఆధారపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సమంత పేరుతో ఇడ్లీ బండి

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషీ’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ పెయిర్ చాలా రిఫ్రెషింగ్‌గా, క్యూట్‌గా అనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సారి వీరిద్దరు కచ్చితంగా హిట్ కొడతారని అంటున్నారు. ట్రైలర్ రిలీజ్‌లో భాగంగా విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఒకవేళ సమంత లేకపోయింటే ‘ఖుషి’ ఎలా ఉండేదో చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎన్టీఆర్‌ ముఖ చిత్రంతో రూ. 100 నాణెం

నందమూరి తారక రామారావు. తెలుగు వారు గర్వించే మహా నటుడు. ప్రజారంజక పాలన అందించిన రాజకీయనాయకుడు. భారతీయ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నట సార్వభౌముడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేక నాణెం రూపొందించింది. కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో రూ.100 నాణెం అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. ఈ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈనెల 28వ తేదీన అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. రాష్ట్రపతి భవన్ సూచనలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు పురుందేశ్వరి వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నిద్రలోనే కార్డియాక్ అరెస్టుకు కారణమేంటీ?

కన్నడ సినీ నటుడు, దర్శకుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన వయస్సు 44 ఏళ్ళు. ఆమె రాత్రి నిద్రపోయాక ఉదయం మరి లేవలేదు. నిద్రలోనే ఆకస్మిక కార్డియాక్ అరెస్టు వల్ల ఆమె మరణించిందని భావిస్తున్నారు వైద్యులు. ఇలా చాలామందికి జరుగుతుంది. నిద్రలోనే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో వివరిస్తున్నారు వైద్యులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

Published at : 10 Aug 2023 09:30 AM (IST) Tags: Breaking News AP news today Andhra Pradesh News Todays latest news Top 10 headlines today Todays Top news Telugu Top News Website Top 10 Telugu News

ఇవి కూడా చూడండి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

ఉజ్జెయిన్‌ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్‌డోజర్‌తో ధ్వంసం - వీడియో

ఉజ్జెయిన్‌ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్‌డోజర్‌తో ధ్వంసం - వీడియో

Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి

Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి

టాప్ స్టోరీస్

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి

ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి